India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. జీఎస్టీ సంస్కరణలు, జీడీపీ గణాంకాల సెంటిమెంట్‌తో Sensex 554 పాయింట్లు లాభపడి 80,364 వద్ద సెటిల్ అయ్యింది. Nifty 198 పాయింట్ల లాభంతో 24,625 వద్ద స్థిరపడింది. బజాజ్ ఆటో, M&M, టాటా మోటార్స్, హీరో మోటాకార్ప్, ఐచర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడగా, సన్ ఫార్మా, ఐటీసీ, టైటాన్, రిలయన్స్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.
AP: ప్రజలు ఆశీర్వదిస్తే తాను కొండలనైనా పిండి చేస్తానని CM చంద్రబాబు అన్నారు. తన దృష్టిలో రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని చెప్పారు. అన్నమయ్య జిల్లా బోయినపల్లిలో ఆయన మాట్లాడారు. ‘నదుల అనుసంధానంతోనే రైతుల అభివృద్ధి సాధ్యం. గంగా నది నుంచి కావేరి నది వరకు అనుసంధానం జరగాలి. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. అందరూ ఆనందంగా ఉంటేనే సమాజం ఆనందంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తన ఫేవరెట్ టాప్-5 టెస్ట్ క్రికెటర్లను ప్రకటించారు. జాక్వెస్ కల్లిస్(SA), ఆండ్రూ ఫ్లింటాఫ్(ENG), మహమ్మద్ ఆసిఫ్(PAK), షేన్ వార్న్(AUS), సచిన్ టెండూల్కర్(IND)లను ఎంపిక చేశారు. కాగా తన ఫేవరెట్ క్రికెటర్ల లిస్టులో విరాట్‌ను ఎంపిక చేయనందుకు ఏబీడీ క్షమాపణలు చెప్పడం విశేషం. RCB ప్లేయర్లయిన కోహ్లీ, ఏబీడీ క్లోజ్ ఫ్రెండ్సనే విషయం తెలిసిందే.
దాదాపు రెండు దశాబ్దాల్లో తొలిసారి అమెరికాకు ప్రయాణించే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. NTTO నివేదిక ప్రకారం జూన్-2025లో US వెళ్లేవారి సంఖ్య 2.1లక్షలకు పడిపోయింది. జూన్-2024తో పోల్చితే (2.3 లక్షలు) ఈ ఏడాది 8 శాతం తగ్గింది. వీసా నిబంధనలు కఠినతరం అవ్వడం, విద్యార్థుల వీసాల జారీలో జాప్యం, ట్రంప్ నిర్ణయాలు దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
RR కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగిసిందని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఆయన్ను అప్‌సెట్ చేసి ఉంటుందని SA మాజీ క్రికెటర్ ABD అన్నారు. ‘ద్రవిడ్‌ను కోచ్‌గా తొలగించి వేరే రోల్ ఆఫర్ చేశారు. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. బహుశా కోచ్‌గా ఉండాలని అనుకున్నారేమో. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. బట్లర్ వంటి అద్భుతమైన ప్లేయర్లను వదులుకుని RR తప్పు చేసింది’ అని ABD అభిప్రాయపడ్డారు.
వినాయక నవరాత్రుల వేళ ‘విఘ్నేశ్వరి’ అమ్మవారి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. గణేశుడి అరుదైన స్త్రీ రూపమే ఈ గణేశ్వరి అమ్మవారు. ఆమె 64 యోగినిలలో(శక్తివంతమైన దేవతల సమూహం) ఒకరిగా చెబుతుంటారు. గణేశుడు విఘ్నాలను తొలగిస్తే.. అడ్డంకులను తొలగించే శక్తిగా గణేశ్వరిని పూజిస్తారు. TNలోని శుచీంద్రంలో గణనాథుడిని గణేశ్వరిగా చూడొచ్చు. మదురై మీనాక్షి ఆలయంలోనూ వ్యాఘ్రపాద వినాయకిని దర్శించుకోవచ్చు.
మహిళలు వివిధ కారణాల వల్ల గర్భస్రావం మందులు వాడతారు. అయితే వైద్యుల సూచన లేకుండా వీటిని వాడితే సైడ్ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు నిపుణులు. గర్భసంచి వీక్ అవడం, రక్తహీనత, ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో సొంత వైద్యం చేసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) 248 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు రేపటి నుంచి అక్టోబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, సీనియర్ అకౌంటెంట్, సూపర్‌వైజర్(ఐటీ), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhpcindia.com/
ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.
* విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో మూడో మూవీ షూటింగ్ ప్రారంభం. నిర్మాతగా మైత్రీ మూవీ మేకర్స్: సినీ వర్గాలు
* పెంపుడు కుక్క ‘గూగుల్’ చనిపోయిందంటూ విక్టరీ వెంకటేశ్ ఎమోషనల్ పోస్ట్. 12 ఏళ్ల పాటు అంతులేని ప్రేమను, జ్ఞాపకాలను మిగిల్చిందంటూ భావోద్వేగం.
* యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో మూవీ తెరకెక్కించనున్న సూపర్ హిట్ ‘మిర్జాపూర్’ డైరెక్టర్ ఆనంద్ అయ్యర్. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్!
Sorry, no posts matched your criteria.