News September 1, 2025

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

తెలంగాణలో సాయంత్రం 4 గంటలలోపు చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మేడ్చల్, MBNR, నిర్మల్, యాదాద్రి, VKB, RR, పెద్దపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వాతావరణం కూల్‌గా ఉంది.

News September 1, 2025

యువత గుండె వయసు వేగంగా పెరుగుతోంది!

image

మిలీనియల్స్ (1981-96) & GenZ (1997-2012)లలో ‘కార్డియాక్ ఏజింగ్’ అభివృద్ధి చెందుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే వారి గుండె సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యం చెందడం. అందుకే 50 ఏళ్లలో కనిపించే గుండె జబ్బులు 30 ఏళ్లలోపే చూస్తున్నట్లు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, స్క్రీన్ సమయం పెరగడం, ధూమపానం వంటివి ఇందుకు కారణమని తెలుస్తోంది.

News September 1, 2025

అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: సుదర్శన్ రెడ్డి

image

రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. నేను రాజకీయాల్లోకి రాలేదు. ఏ పార్టీలో సభ్యత్వం లేదు. ఇక ముందూ ఉండదు. పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి పోరాడుతా. నేను ప్రతిపక్షాల అభ్యర్థిని’ అని వ్యాఖ్యానించారు.

News September 1, 2025

ఒకే గదిలో వేర్వేరు బెడ్స్‌పై దంపతుల నిద్ర

image

జపాన్ కపుల్స్ నాణ్యమైన నిద్ర కోసం ‘సపరేట్ స్లీపింగ్’ పద్ధతిని పాటిస్తారు. వారు ఒకే గదిలో వేర్వేరు బెడ్స్‌పై పడుకుంటారు. నిద్రలో గురక పెట్టడం, కదలడం వల్ల తమ భాగస్వామి నిద్రకు భంగం కలుగుతుందని ఇలా వేరుగా పడుకుంటారట. అయితే ఇది జంటల మధ్య దూరాన్ని పెంచుతుందని కొందరు భావిస్తే, భాగస్వామికిచ్చే గౌరవంగా మరికొందరు నమ్ముతున్నారు. కాగా జపాన్‌లో జననాల రేటు పడిపోవడానికి ఇదీ ఓ కారణం కావొచ్చనే చర్చ జరుగుతోంది.

News September 1, 2025

రాష్ట్రంలో 63.61 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ: CM

image

AP: రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో.. లేదో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది పెన్షనర్ల కోసం రూ.2,746.52 కోట్లు విడుదల చేశారు. కొత్తగా 7,872 మందికి నెలకు రూ.4 వేలు చొప్పున స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేశారు.

News September 1, 2025

ఏకమైన భారత్-చైనా-రష్యా.. దిగొచ్చిన US!

image

భారత్-చైనా-రష్యా ఒక తాటిపైకి రాగానే అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టిందా? ట్రంపరితనం తగ్గుతుందా? భారత్‌తో మళ్లీ చెట్టాపట్టాలకు సిద్ధమవుతుందా? SMలో US స్పందన చూస్తే అదే నిజమయ్యేలా ఉంది. ‘భారత్-US భాగస్వామ్యం నూతన శిఖరాలను అధిరోహిస్తోంది. ఇరు దేశాల ప్రజల స్నేహమే మన సంబంధాలను బలోపేతం చేస్తోంది. #USIndiaFWDforOurPeople అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ క్యాంపైన్‌లో భాగం కావాలి’ అని ట్వీట్ చేసింది.

News September 1, 2025

E20 పెట్రోల్‌పై పిల్.. కొట్టేసిన సుప్రీంకోర్టు

image

20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇథనాల్ లేని పెట్రోల్‌ను ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్రా అనే లాయర్ ఈ పిల్ దాఖలు చేశారు. E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతోందని పలువురు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే మైలేజీలో ఎలాంటి తేడాల్లేవని కేంద్రం చెబుతోంది.

News September 1, 2025

నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు: IMD

image

బంగాళాఖాతంలో మరో 12-36 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని IMD HYD తెలిపింది. దీని ప్రభావంతో AP, TGలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఉ.8.30 వరకు <>TG<<>>లోని కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. అటు APలోని SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News September 1, 2025

IOCLలో 537 అప్రెంటిస్ ఖాళీలు

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 537 అప్రెంటిస్ పోస్టులకు ఈ నెల 18 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈస్ట్రర్న్, వెస్టర్న్, నార్తర్న్, సౌతర్న్, సౌత్ ఈస్టర్న్ రీజియన్లలో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. వయసు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: <>https://iocl.com/apprenticeships<<>>

News September 1, 2025

మహిళలూ మీపై మీరు శ్రద్ధ పెట్టండి

image

భార్యగా, అమ్మగా బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే మహిళలు వ్యక్తిగత సంరక్షణను పక్కన పెట్టేస్తారు. ఇది భవిష్యత్తులో అనేక అనారోగ్యాలకు మూలం అవుతుందంటున్నారు నిపుణులు. ఒత్తిడిని అదుపులో ఉంచి ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చెయ్యాలని సూచిస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, నట్స్, సీడ్స్ వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. స్కిన్, హెయిర్ కేర్‌పై దృష్టి పెట్టాలి. ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం చేయాలి.