India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఛైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జున్ బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ నియంత్రణ్ భవన్‌లోని ఈఆర్సీ ఆఫీస్‌లో ఆయనతో సీఎస్ శాంతికుమారి ప్రమాణస్వీకారం చేయించారు. వినియోగదారులు, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను కాపాడుతానని జస్టిస్ నాగార్జున్ అన్నారు.
AP: రాష్ట్రంలో 2024-29కుగాను ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.Oకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగంలో ఆధునిక సాంకేతికతతోపాటు పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తామని తెలిపింది. 2029 నాటికి రూ.4.2 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీనే లక్ష్యమని వెల్లడించింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ, రేపు APలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, NZB, KRMR, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, NLG, వరంగల్, హన్మకొండ, HYD, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
TG: ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ గడువును NOV 15 వరకు అధికారులు పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 4,500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
వెబ్‌సైట్: http://oupgrrcde.com/
AP: అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో రూ.70K కోట్ల పెట్టుబడి పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదన అందించినట్లు తెలుస్తోంది. ప్లాంట్ నిర్మాణానికి 2వేల ఎకరాలు అవసరమని, 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది పూర్తయితే 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
ఓ ఊరిలో అమ్మాయిలు మిస్సవడానికి కారణమెవరు? ఈ కేసులకు హీరోకు సంబంధమేంటి అనే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ‘క’ తెరకెక్కింది. డైరెక్టర్లు సుజీత్-సందీప్ కథను నడిపిన తీరు, ఇంటర్వెల్, కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టిన క్లైమాక్స్, BGM, కిరణ్ నటన ఆకట్టుకున్నాయి. చివరి 15 నిమిషాల్లో మలుపులు థ్రిల్ చేస్తాయి. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. స్క్రీన్‌ప్లేపై దృష్టిపెడితే ఇంకా బాగుండేది.
రేటింగ్: 3/5
కివీస్‌తో రేపటి నుంచి జరిగే మూడో టెస్టులో గెలిచి పరువు నిలపాలని రోహిత్ సేనకు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. WTC పాయింట్లు కూడా మనకెంతో ముఖ్యమన్నారు. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఎప్పుడూ వైట్‌వాష్ కాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి అవాంఛిత రికార్డును బ్రేక్ చేయొద్దని సూచించారు. ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ పదవీ కాలంలో అనవసర రికార్డులు ఉన్నాయని, మరొకటి చేర్చొద్దని కోరారు.
TG: 2024-25 సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక దశలవారీగా కౌన్సెలింగ్ ఉంటుంది. అల్లోపతి, ఆయుర్వేద, హోమియో కోర్సులకు అడ్మిషన్లు పొందవచ్చు. జాతీయ కోటా పోగా మిగతా సీట్లన్నీ తెలంగాణ వాసులకే దక్కుతాయి.
నస్రల్లా స్థానంలో హెజ్బొల్లా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నయీమ్ ఖాసిమ్ తొలిసారి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఆ దేశం దురాక్రమణను ఆపి తమకు అనుకూలమైన షరతులకు ఒప్పుకుంటే కాల్పుల విరమణకు సిద్ధమేనని తెలిపారు. అందుకోసం తామేమీ అడుక్కోబోమని స్పష్టం చేశారు. నస్రల్లా అనుసరించిన వార్ ప్లాన్‌కు కట్టుబడి ఉంటామన్నారు. కాగా ఈ కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండరని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
భారత్‌లో స్మార్ట్ ఫోన్ విక్రయాల పరంగా 19.4% వాటాతో వివో అగ్రస్థానంలో నిలిచినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్ గణాంకాలను అది వెలువరించింది. ఆ తర్వాత షావోమి(16.7%), శాంసంగ్(15.8%), ఒప్పో(13.4%), రియల్‌మీ(11.3%) ఉన్నాయంది. ఇక విక్రయాల్లో విలువపరంగా 22.8% వాటాతో శాంసంగ్ టాప్‌లో ఉన్నట్లు తెలిపింది. రెండో స్థానంలో యాపిల్(21.8%) ఉన్నట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.