News October 31, 2024

ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు

image

కర్ణాటకలోని హసన్‌ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.

News October 31, 2024

మాజీ మంత్రి అప్పలరాజుకు తీవ్ర అస్వస్థత

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

News October 31, 2024

పెట్టుబడులకు ఇదే మంచి సమయం: లోకేశ్

image

APలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఇదే మంచి సమయమని మంత్రి లోకేశ్ అన్నారు. అమెరికాలో ఆయన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. త్వరలో అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు.

News October 31, 2024

REVIEW: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’

image

చాలీచాలని జీతం వచ్చే ఓ బ్యాంకు ఉద్యోగైన హీరో కుటుంబం కోసం అప్పులు చేసి, ఆ తర్వాత ఓ రిస్క్ చేస్తాడు. ఏం చేశాడు? ఎలా చేశాడనేదే కథ. హీరో ఎదుర్కొనే అవమానాలు ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్టవుతాయి. అక్కడక్కడ ట్విస్టులు ఆకట్టుకుంటాయి. దుల్కర్ నటన, డైరెక్టర్ వెంకీ రచన, BGM, డైలాగ్స్ సినిమాకు బలం. స్టాక్ మార్కెట్, బ్యాంకుల పనితీరు గురించి తెలియని వారికి సెకండాఫ్ అంతగా కనెక్ట్ అవ్వదు.
రేటింగ్: 3/5

News October 31, 2024

పుష్ప-2లో క్రేజీ సర్‌ప్రైజ్?

image

అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తోన్న పుష్ప-2కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా క్లైమాక్స్‌ ఉంటుందని సమాచారం. ఇందులోనే మూడో పార్ట్‌కు అదిరిపోయే లీడ్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారనే చర్చ టాలీవుడ్‌లో నడుస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News October 31, 2024

ఈఆర్సీ ఛైర్మన్‌గా జస్టిస్ నాగార్జున్

image

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఛైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జున్ బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ నియంత్రణ్ భవన్‌లోని ఈఆర్సీ ఆఫీస్‌లో ఆయనతో సీఎస్ శాంతికుమారి ప్రమాణస్వీకారం చేయించారు. వినియోగదారులు, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను కాపాడుతానని జస్టిస్ నాగార్జున్ అన్నారు.

News October 31, 2024

రూ.4.2L Cr ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే లక్ష్యం

image

AP: రాష్ట్రంలో 2024-29కుగాను ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.Oకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగంలో ఆధునిక సాంకేతికతతోపాటు పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తామని తెలిపింది. 2029 నాటికి రూ.4.2 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీనే లక్ష్యమని వెల్లడించింది.

News October 31, 2024

ALERT: భారీ వర్షాలు

image

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ, రేపు APలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, NZB, KRMR, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, NLG, వరంగల్, హన్మకొండ, HYD, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.

News October 31, 2024

OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రవేశాల గడువు పొడిగింపు

image

TG: ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ గడువును NOV 15 వరకు అధికారులు పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 4,500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
వెబ్‌సైట్: http://oupgrrcde.com/

News October 31, 2024

అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్?

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో రూ.70K కోట్ల పెట్టుబడి పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదన అందించినట్లు తెలుస్తోంది. ప్లాంట్ నిర్మాణానికి 2వేల ఎకరాలు అవసరమని, 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది పూర్తయితే 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.