News October 31, 2024

ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉండగా మరో రెండు కొత్త గురుకులాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రాంపురం(పెనుకొండ), నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అద్దె భవనాల్లో వీటిని ప్రారంభించనుంది. 5, 6, 7, 8 తరగతుల విద్యార్థులతో 240 సీట్లను కేటాయించింది. పెనుకొండలో సీట్ల భర్తీ పూర్తయ్యింది. ఆత్మకూరులో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.

News October 31, 2024

మూడ్ బాగోలేదా?.. వీటిని తినండి

image

కొంత మందికి మూడ్ ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. శరీరంలో ఎండార్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్ తగ్గడం వల్లే ఇలా జరుగుతుంది. కొన్ని ఆహార పదార్థాలు తింటే మూడ్ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ తింటే వెంటనే మనసు ఉత్తేజపడుతుంది. బెర్రీస్, నట్స్, గింజలు, అవకాడో తింటే వెంటనే మనసు ఆనంద పడుతుంది. సాల్మన్ ఫిష్, బచ్చలికూర, పుట్టగొడుగులు తింటే మానసిక స్థితి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

News October 31, 2024

తిరుమల లడ్డూ ప్రసాదంపై India Today సంచలన అధ్యయనం

image

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేద‌ని India Today త‌న అధ్య‌య‌నం ద్వారా తేల్చింది. దేశంలోని వివిధ ప్ర‌ముఖ ఆల‌యాల‌కు చెందిన ప్ర‌సాదాల్ని సేక‌రించి ప‌రీక్ష‌లు జ‌రిపించిన స‌దరు జాతీయ న్యూస్ ఛాన‌ల్ వాటి ఫ‌లితాల‌ను తాజాగా బహిర్గతం చేసింది. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని శ్రీరాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెస్టింగ్ ప‌రీక్షించి జంతువుల కొవ్వు, వెజిటేబుల్ ఫ్యాట్‌ లేద‌ని నిర్ధారించిన‌ట్టు తెలిపింది.

News October 31, 2024

English Learning: Antonyms

image

✒ Barren× Damp, Fertile
✒ Bawdy× Decent, Moral
✒ Bind× Release
✒ Batty× Sane
✒ Benevolent× Malevolent, Miserly
✒ Befogged× Clear headed, Uncloud
✒ Base× Summit, Noble
✒ Benign× Malignant, Cruel
✒ Busy× Idle, Lazy

News October 31, 2024

అరటి పండ్లు తింటే జలుబు, దగ్గు వస్తుందా?

image

అరటిపండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఏడాది పొడవునా లభించే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తింటుంటారు. వీటిని తినడం వల్ల జలుబు, దగ్గు వస్తుందని కొందరనుకుంటారు. కానీ అరటిని తినడం వల్ల జలుబు, దగ్గు రాదని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే అవి వస్తాయి. అప్పటికే వాటితో బాధపడుతున్నవారు తింటే కఫం పెరుగుతుంది. వీటిలో పొటాషియం, ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తాయి.

News October 31, 2024

దేనికి లాలూచీపడి ఈ పనికి ఒడిగట్టారు బాబూ?: జగన్

image

AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15Mకే కేంద్రం <<14486841>>పరిమితం<<>> చేస్తున్నా CM చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని YS జగన్ ప్రశ్నించారు. ‘దేనికి లాలూచీపడి ఈ పనికి ఒడిగట్టారు? NDAలో ఉండి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఎత్తు తగ్గింపు వల్ల కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేం. పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేం. విశాఖ తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేం’ అని ట్వీట్ చేశారు.

News October 31, 2024

సుమతీ నీతి పద్యం: ఎవడు నేర్పరి?

image

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నకజేయువాడె నేర్పరి సుమతీ!
తాత్పర్యం: మనకు ఉపకారము చేసిన వారికి తిరిగి ఉపకారము చేయుట మంచి లక్షణము. అయితే అందులో ప్రత్యేకత లేదు. కానీ అపకారము చేసిన వారికి కూడా మంచి చేయగలిగినవాడే నేర్పరి అనిపించుకుంటాడు.

News October 31, 2024

కిర్‌స్టెన్‌ తన ఒప్పందాన్ని ఉల్లంఘించాడు: నఖ్వీ

image

పాక్ వన్డే జట్టు కోచ్‌ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ <<14471673>>రాజీనామా<<>> చేయడంపై PCB ఛైర్మన్ మొహ్సిన్‌ నఖ్వీ స్పందించారు. ఆయన కొన్ని ఉల్లంఘనలకు పాల్పడి తమతో ఒప్పందాన్ని ముగించారని తెలిపారు. ఈనెలాఖరులోగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కొత్త హెడ్‌ కోచ్‌ను నియమిస్తామన్నారు. టెస్ట్ కోచ్ గిలెస్పీ ఆస్ట్రేలియాతో ODI, T20 సిరీస్‌ కోసం మాత్రమే తాత్కాలిక కోచ్‌గా ఉండటానికి అంగీకరించారని చెప్పారు.

News October 31, 2024

హామీలెందుకు నెరవేర్చలేకపోతున్నారు: కూనంనేని

image

TG: ఎన్నికల హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. మూసీ పునరుద్ధరణపై విదేశాల్లో అధ్యయనానికి ముందు ఇక్కడి ప్రజల పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. వారికి నిధుల చెల్లింపులో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ BJP, BRS రహస్య అజెండాతో ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

News October 31, 2024

అక్టోబర్ 31: చరిత్రలో ఈరోజు

image

✒ 1875: సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం. ఆయన జయంతిని కేంద్రం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతోంది.
✒ 1895: భారత క్రికెట్ టీం తొలి కెప్టెన్ సీకే నాయుడు జననం
✒ 1975: సంగీత దర్శకుడు ఎస్‌డీ బర్మన్ కన్నుమూత
✒ 1984: బాడీగార్డుల చేతిలో ఇందిరాగాంధీ హత్య
✒ 2008: ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చిన కేంద్ర ప్రభుత్వం
✒ 1943: కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ జననం
✒ 2022: పారిశ్రామికవేత్త జేజే ఇరానీ మరణం