News September 1, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.930 పెరిగి రూ.1,05,880కు చేరింది. కాగా 7 రోజుల్లో రూ.4,370 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.850 ఎగబాకి రూ.97,050 పలుకుతోంది. అటు KG వెండిపై శనివారం రూ.5,100, ఇవాళ రూ.1,000 పెరిగి రూ.1,36,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 1, 2025

సేంద్రియ కర్బనం.. వ్యవసాయంలో కీలకం

image

నేలలో చౌడు, రోగకారక సూక్ష్మజీవుల నిరోధం, క్షార గుణాన్ని తగ్గించటం, నేలను సారవంతం చేయడంలో సేంద్రియ కర్బనం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే నేలకోతను అరికట్టి భూమిలో నీటి నిల్వలను పెంచేందుకు దోహదపడుతుంది. నేలలో 1.5 – 2.0% వరకు సేంద్రియ కర్బనం ఉంటే భూమిలో పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలాగే భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాల లభ్యత కూడా చాలా వరకు పెరుగుతుంది.

News September 1, 2025

చంద్రబాబును సంప్రదించలేదు: సీఎం రేవంత్

image

TG: 2024 ఎన్నికల తర్వాత ఇండీ కూటమికి మద్దతు ఇవ్వాలంటూ తాను AP CM చంద్రబాబును సంప్రదించినట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని CM రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ అలాంటి రాజకీయాలను ఇష్టపడరని, తానెప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదని ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో స్పష్టం చేశారు. ‘చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్. గతంలోనూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆయన్ను మించినవారు లేరు’ అని పేర్కొన్నారు.

News September 1, 2025

కొత్తగా పెళ్లైందా.. ఇవి పాటించండి!

image

కొత్త దంపతులు ఎక్కువగా మాట్లాడుకుంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫోన్లు, టీవీ పక్కనపెట్టి కాసేపు భవిష్యత్ లక్ష్యాల గురించి చర్చించుకోవాలి. నచ్చిన వంట చేసుకుని కలిసి తినాలి. పనుల్లో ఒకరికొకరు సాయంగా నిలవాలి. కోపాన్ని పక్కనపెట్టి సహనంతో సమస్యలను పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. శృంగారంలో పరస్పర ఇష్టాలను గౌరవించుకోవాలి’ అని చెబుతున్నారు.

News September 1, 2025

CBIకి ‘కాళేశ్వరం కేసు’.. బండి సంజయ్ ఏమన్నారంటే?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి BRS మాత్రమే బాధ్యత వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘మేం మొదటి నుంచీ CBIతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాం. కానీ INC ప్రభుత్వం ఆలస్యం చేసింది. నేడు సత్యానికి తలవంచి కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించేందుకు అంగీకరించింది. ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీరియల్‌లా సాగుతోంది’ అని ట్వీట్ చేశారు.

News September 1, 2025

పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే: PM మోదీ

image

చైనాలో SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ను కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ ఆయనను హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడిన ఫొటోలను Xలో షేర్ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ సంభాషించినట్లు పేర్కొన్నారు.

News September 1, 2025

నేడు గవర్నర్ వద్దకు అఖిలపక్ష నేతలు

image

TG: అసెంబ్లీలో ఆమోదించిన పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరేందుకు ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. తమతో కలిసి రావాలని అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. ‘రిజర్వేషన్ పరిమితిపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాలి. బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఇబ్బంది ఏముంది?’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

News September 1, 2025

TROLLS: సెక్యూరిటీ గార్డ్‌లా పాక్ పీఎం!

image

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై మరోసారి ట్రోల్స్ పేలుతున్నాయి. చైనాలోని టియాన్‌జిన్‌లో మోదీ, పుతిన్ కలిసి మాట్లాడుకుంటుండగా షరీఫ్ వెనకాలే సెక్యూరిటీ గార్డులా నిలబడ్డారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. భారత్, రష్యా దేశాధినేతల స్నేహం, ఆప్యాయత చూసి పాక్ ప్రధాని వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. నిన్న జిన్‌పింగ్, పుతిన్.. షరీఫ్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయిన <<17575511>>సంగతి<<>> తెలిసిందే.

News September 1, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

★ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్.. ‘మదరాసి’ మూవీ ఈవెంట్‌లో వెల్లడి
★ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు స్పెషల్ అప్‌డేట్
★ విక్టరీ వెంకటేశ్, వీవీ వినాయక్ కాంబోలో త్వరలో సినిమా?
★ ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాల డైరెక్టర్ శివ నిర్వాణతో రవితేజ థ్రిల్లర్ మూవీ?

News September 1, 2025

దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ

image

AP: <<17398848>>నోటీసులతో<<>> సంబంధంలేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని CM ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులందుకున్న 1.35లక్షల మందిలో 95% మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హులపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా 7,872 మందికి రూ.4వేలు చొప్పున స్పౌజ్ పింఛన్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.3.15 కోట్లు రిలీజ్ చేశారు.