News September 1, 2025

తుమ్మిడిహట్టి, మేడిగడ్డపైనే ప్రధాన చర్చ

image

TG: కాళేశ్వరాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంపైనే అసెంబ్లీలో ప్రధాన చర్చ జరిగింది. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం చెప్పినా BRS ప్రభుత్వం దోపిడీ చేసేందుకే దాన్ని మార్చిందని సీఎం రేవంత్ ఆరోపించారు. MH అభ్యంతరం కేవలం ఎత్తుపైనే అని తెలిపారు. మేడిగడ్డ వద్ద అదనంగా 120 TMCల లభ్యత ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎక్స్‌పర్ట్స్ కమిటీ, CWC సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామన్నారు.

News September 1, 2025

ALERT: ఇవాళ భారీ వర్షాలు

image

బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో APలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులపాటు వానలు పడతాయంది. ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP, అనకాపల్లి, KKD, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. అటు TGలో ఆసిఫాబాద్, MNCL, NRML, పెద్దపల్లి, భూపాలపల్లి, MLG, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.

News September 1, 2025

ఇక సోలోగా ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు

image

పర్వతారోహణకు నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకొచ్చాయి. ఎవరెస్ట్ లాంటి 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను ఎక్కాలంటే ఇద్దరు సభ్యుల టీమ్ వెంట కనీసం ఒక మౌంటేన్ గైడ్ తప్పనిసరి. ఒంటరిగా ఎక్కాలనుకునే ఔత్సాహికులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. అటు సీజన్ల వారీగా మౌంటేన్ క్లైంబింగ్‌ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచింది. MAR-MAY మధ్య ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒక్కొక్కరు రూ.13.2 లక్షలు కట్టాల్సిందే.

News September 1, 2025

కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు

image

దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,580కి చేరింది. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. అటు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

News September 1, 2025

ఈనెల 7న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు చూడొచ్చా?

image

ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. కర్కాటక, కుంభ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ‘ఒక వేళ గ్రహణాన్ని వీక్షిస్తే అకారణంగా గొడవలు, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన తలెత్తుతాయి. ఈ రెండు రాశుల వారు గ్రహణం పూర్తయ్యాక చంద్రుడికి అభిషేకం చేయాలి. రాహు గ్రహానికి పూజలు చేయాలి. అలాగే పేదలకు ధన సహాయం చేస్తే మంచిది’ అని వారు అంటున్నారు.

News September 1, 2025

నేడు రాజంపేటలో సీఎం పర్యటన.. పెన్షన్ల పంపిణీ

image

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కె.బోయినపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం తాళ్లపాక గ్రామంలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.

News September 1, 2025

టారిఫ్స్ లేకపోతే మన దేశం నాశనమయ్యేది: ట్రంప్

image

ట్రంప్ అధికార పరిధి దాటి టారిఫ్స్ విధిస్తున్నారంటూ <<17559172>>US కోర్టు<<>> ఇటీవల ఆక్షేపించింది. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ‘టారిఫ్స్ వల్ల $ట్రిలియన్లు వచ్చాయి. అవి లేకుంటే మన దేశం పూర్తిగా నాశనమయ్యేది. మన మిలిటరీ పవర్ పోయేది. ఇది ర్యాడికల్ లెఫ్ట్ గ్రూప్ జడ్జిలకు తెలియదు. కానీ డెమోక్రాట్ ఒబామా నియమించిన ఒక్క జడ్జి మాత్రం దేశాన్ని కాపాడేందుకు ఓట్ వేశారు. అతడి ధైర్యానికి థాంక్స్’ అని వ్యాఖ్యానించారు.

News September 1, 2025

కాళేశ్వరంపై CBI విచారణకు నిర్ణయం.. ఇందుకేనా?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం CID లేదా సిట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశముందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఈ కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మాజీ సీఎం KCR అరెస్ట్ అయితే కక్షపూరిత చర్యలు తీసుకుందనే అపవాదు రాకుండా జాగ్రత్త పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు.

News September 1, 2025

సెప్టెంబర్ 1: చరిత్రలో ఈ రోజు

image

1945: నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ గ్రహీత గుళ్లపల్లి నాగేశ్వరరావు జననం
1947: లోక్‌సభ మాజీ సభాపతి పి.ఎ.సంగ్మా జననం
1950: తెలుగు సినీ దర్శకుడు టి.కృష్ణ జననం
1904: తెలుగు పండితుడు పూండ్ల రామకృష్ణయ్య మరణం
1990: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు మరణం
1992: సాహిత్యవేత్త ఎస్.వి.జోగారావు మరణం
1995: AP 19వ CMగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం(ఫొటోలో)

News September 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.