India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి BRS మాత్రమే బాధ్యత వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘మేం మొదటి నుంచీ CBIతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాం. కానీ INC ప్రభుత్వం ఆలస్యం చేసింది. నేడు సత్యానికి తలవంచి కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించేందుకు అంగీకరించింది. ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీరియల్‌లా సాగుతోంది’ అని ట్వీట్ చేశారు.
చైనాలో SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ను కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ ఆయనను హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడిన ఫొటోలను Xలో షేర్ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ సంభాషించినట్లు పేర్కొన్నారు.
TG: అసెంబ్లీలో ఆమోదించిన పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరేందుకు ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. తమతో కలిసి రావాలని అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. ‘రిజర్వేషన్ పరిమితిపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాలి. బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఇబ్బంది ఏముంది?’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై మరోసారి ట్రోల్స్ పేలుతున్నాయి. చైనాలోని టియాన్‌జిన్‌లో మోదీ, పుతిన్ కలిసి మాట్లాడుకుంటుండగా షరీఫ్ వెనకాలే సెక్యూరిటీ గార్డులా నిలబడ్డారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. భారత్, రష్యా దేశాధినేతల స్నేహం, ఆప్యాయత చూసి పాక్ ప్రధాని వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. నిన్న జిన్‌పింగ్, పుతిన్.. షరీఫ్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయిన <<17575511>>సంగతి<<>> తెలిసిందే.
★ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్.. ‘మదరాసి’ మూవీ ఈవెంట్‌లో వెల్లడి
★ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు స్పెషల్ అప్‌డేట్
★ విక్టరీ వెంకటేశ్, వీవీ వినాయక్ కాంబోలో త్వరలో సినిమా?
★ ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాల డైరెక్టర్ శివ నిర్వాణతో రవితేజ థ్రిల్లర్ మూవీ?
AP: <<17398848>>నోటీసులతో<<>> సంబంధంలేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని CM ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులందుకున్న 1.35లక్షల మందిలో 95% మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హులపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా 7,872 మందికి రూ.4వేలు చొప్పున స్పౌజ్ పింఛన్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.3.15 కోట్లు రిలీజ్ చేశారు.
TG: కాళేశ్వరాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంపైనే అసెంబ్లీలో ప్రధాన చర్చ జరిగింది. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం చెప్పినా BRS ప్రభుత్వం దోపిడీ చేసేందుకే దాన్ని మార్చిందని సీఎం రేవంత్ ఆరోపించారు. MH అభ్యంతరం కేవలం ఎత్తుపైనే అని తెలిపారు. మేడిగడ్డ వద్ద అదనంగా 120 TMCల లభ్యత ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎక్స్‌పర్ట్స్ కమిటీ, CWC సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామన్నారు.
బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో APలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులపాటు వానలు పడతాయంది. ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP, అనకాపల్లి, KKD, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. అటు TGలో ఆసిఫాబాద్, MNCL, NRML, పెద్దపల్లి, భూపాలపల్లి, MLG, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
పర్వతారోహణకు నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకొచ్చాయి. ఎవరెస్ట్ లాంటి 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను ఎక్కాలంటే ఇద్దరు సభ్యుల టీమ్ వెంట కనీసం ఒక మౌంటేన్ గైడ్ తప్పనిసరి. ఒంటరిగా ఎక్కాలనుకునే ఔత్సాహికులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. అటు సీజన్ల వారీగా మౌంటేన్ క్లైంబింగ్ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచింది. MAR-MAY మధ్య ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒక్కొక్కరు రూ.13.2 లక్షలు కట్టాల్సిందే.
దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,580కి చేరింది. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. అటు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Sorry, no posts matched your criteria.