News November 10, 2025

రూ.5,200 కోట్లతో విశాఖలో లారస్ ల్యాబ్స్

image

AP: ప్రముఖ డ్రగ్ కంపెనీ లారస్ ల్యాబ్స్ విశాఖలో దాదాపు రూ.5,200 కోట్లతో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 532 ఎకరాలను కేటాయించిందని సంస్థ ఫౌండర్ చావా సత్యనారాయణ తెలిపారు. ఔషధ కంపెనీల్లో కీలకమైన ఫర్మంటేషన్ ప్లాంట్‌నూ ఇక్కడే ఏర్పాటుచేస్తామన్నారు. ప్రస్తుతం ఏటా రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.

News November 10, 2025

సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

image

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.

News November 10, 2025

ఐఆర్ 30 శాతం ప్రకటించాలి: PRTU

image

AP: హైస్కూల్ ప్లస్‌లలో లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి(IR) 30 శాతం ప్రకటించాలని కోరింది. అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని APMPS HMల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.

News November 10, 2025

ప్రభుత్వ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. నేరుగా లైసెన్స్!

image

AP: రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(DTC), 5 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్ల(RDTC)ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంజూరు చేసింది. 10 లక్షల జనాభాకు ఒకటి చొప్పున DTCలను పెట్టనుండగా RDTCలను ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒకటి చొప్పున, కోస్తాలో 3 ఏర్పాటు చేయనుంది. వీటిలో టూవీలర్, కార్లు, భారీ వాహనాల ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్‌ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు.

News November 10, 2025

అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

image

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News November 10, 2025

ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.

News November 10, 2025

బ్రహ్మాస్త్రం తయారీ.. ఉపయోగించే విధానం

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

News November 10, 2025

స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 55 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 55 పోస్టులకు అప్లై చేయడానికి నవంబర్ 13 ఆఖరు తేదీ. ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, ఐటీ, ఎలక్ట్రీషియన్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18- 35ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.isro.gov.in/.

News November 10, 2025

జ్ఞానాన్ని పెంచుకునేందుకు యుధిష్టరుడి జిజ్ఞాస

image

శ్రీ వైశంపాయన ఉవాచ
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత ||
దీనిని వైశంపాయనుడు చెప్పారు. దీనర్థం: ‘సమస్త ధర్మాలను, పవిత్రమైన విషయాలన్నింటినీ పూర్తిగా విన్న తర్వాత, యుధిష్టరుడు మరల భీష్మునితో ఇలా పలికెను’. భీష్ముడు చెప్పిన అన్ని విషయాలను శ్రద్ధగా విన్న యుధిష్టరుడు తన సందేహాల నివృత్తికై, జ్ఞాన జిజ్ఞాసతో మళ్లీ వాటిని అడిగి తెలుసుకున్నాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 10, 2025

సుదీర్ఘ షట్‌డౌన్‌కు త్వరలోనే ముగింపు: ట్రంప్

image

ప్రభుత్వ <<17882827>>షట్‌డౌన్‌‌ <<>>త్వరలోనే ముగుస్తుందని US ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. అయితే ఖైదీలకు, ఇల్లీగల్స్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు తాను ఒప్పుకోనని, ఈ విషయాన్ని డెమొక్రాట్లు అర్థం చేసుకుంటారని చెప్పారు. 40 రోజులుగా కొనసాగుతున్న సుదీర్ఘ షట్‌డౌన్ కారణంగా పలు ప్రభుత్వ <<17975561>>సర్వీసులపై<<>> తీవ్ర ప్రభావం పడింది. కార్మికులకు జీతాలు అందడం లేదు.