India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాంధీ కుటుంబం ఏదైనా హామీ ఇస్తే అది శిలాశాసనంతో సమానమని సీఎం రేవంత్ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కుల గణనపై అవగాహన సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియా గాంధీ కూడా మాటిచ్చారని, గాంధీ కుటుంబం మాటిస్తే 100% నెరవేర్చుతుందని ఆయన అన్నారు.
AP: సీఎం చంద్రబాబును ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కలిశారు. అమరావతిలో వీరిద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుపై సీఎంతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వెల్‌నెస్ సెంటర్లు, వ్యవసాయరంగంలో పెట్టుబడులపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం.
AP: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును ప్రభుత్వం ప్రకటించింది. 24 మంది సభ్యులతో పాలక మండలిని నియమించింది. కాగా బీఆర్ నాయుడు ఓ మీడియా ఛానల్ అధినేత. జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు, నన్నూరి నర్సిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్ర యెల్లా, మల్లెల రాజశేఖర్ గౌడ్, ఆనంద్ సాయి, వేముల ప్రశాంతి, పనబాక లక్ష్మి, జస్టిస్ హెచ్ఎల్ దత్, ఆర్ఎన్ దర్శన్, బొంగునూరు మహేందర్‌లను మెంబర్లుగా ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది అనారోగ్యాలకు కారణం అవుతున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మయోనైజ్‌ను వినియోగించకుండా హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ తనిఖీలు చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. కాగా మయోనైజ్ తిని ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్ర సచివాలయ భద్రత బాధ్యతను ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)కు అప్పగించింది. ఇప్పటివరకు తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) విధులు నిర్వహించింది. పాత సచివాలయంలో 25 ఏళ్లుగా SPF సిబ్బందే భద్రతను పర్యవేక్షించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత అప్పటి BRS సర్కార్ TGSPని నియమించింది. అయితే ఇటీవల బెటాలియన్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వారిని తొలగించినట్లు తెలుస్తోంది.
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హర్షసాయి పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా హర్షసాయి తన దగ్గర రూ.2 కోట్లు తీసుకోవడమే కాకుండా లైంగికంగా వేధించాడంటూ ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి హర్ష పరారీలోనే ఉన్నారు.
AP: రాష్ట్రంలోని ఏదైనా మెడికల్ కాలేజీకి ప్రముఖ వైద్య శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన CM చంద్రబాబుకు పూర్తి వివరాలు పంపారు. ‘సుబ్బారావు భీమవరంలో పుట్టి, రాజమండ్రిలో చదువుకున్నారు. కాబట్టి ఏలూరు, రాజమండ్రిలోని ఏదైనా ఒక కళాశాలకు ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుంది. సీఎం స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. పెరిగిన డీఏను నవంబర్ జీతంతో కలిపి ఇవ్వనుంది. 2022 జులై నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.
‘జై హనుమాన్’లో హీరోగా రిషబ్ శెట్టి నటించనున్నారు. హనుమంతుడి పాత్రలో ఆయన రాముడి విగ్రహాన్ని హత్తుకున్న ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ దీపావళిని ‘జై హనుమాన్’ నినాదంతో మొదలుపెడదామని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. కాగా ‘హనుమాన్’ మూవీ హిట్ కావడంతో జై హనుమాన్‌పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలున్నాయి. హనుమాన్‌లో హీరోగా తేజా సజ్జ నటించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో గ్రూప్-3 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉ.10గంటల నుంచి మ.12.30గంటల వరకు పేపర్ 1, మ.3గంటల నుంచి సా.5.30గంటల వరకు పేపర్ 2 పరీక్షలు ఉంటాయి. నవంబర్ 10 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా దాదాపు 1,380కి పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.