News August 31, 2025

జింబాబ్వే పాలిట సింహస్వప్నంగా నిస్సాంక

image

జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో శ్రీలంక క్రికెటర్ పాతుమ్ నిస్సాంక చెలరేగుతున్నారు. తొలి వన్డేలో 76 పరుగులు బాదిన ఆయన రెండో మ్యాచులో 122 రన్స్‌తో విరుచుకుపడ్డారు. అంతకుముందు ZIMతో జరిగిన వన్డేల్లోనూ ఆయన 75, 16, 55, 101 పరుగులు బాదారు. కాగా నిస్సాంక అరంగేట్రం (2021) నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు బాదిన ఓపెనర్‌గా (2,648) నిలిచారు. తర్వాత గిల్(2,476), ఒడౌడ్(2,008), రోహిత్ శర్మ (1,990) ఉన్నారు.

News August 31, 2025

జగన్‌కు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్

image

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి YS జగన్‌కు ఫోన్ చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. కానీ ముందుగానే NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మాట ఇచ్చినట్లు జగన్ తెలిపారని పేర్కొంది. మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని కోరినట్లు చెప్పింది. సుదర్శన్ రెడ్డి న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు అపార సేవలు అందించారని కొనియాడినట్లు వివరించింది.

News August 31, 2025

రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా: భట్టి

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకున్న నీళ్ల కంటే ఎత్తిపోసి, వదిలేసినవే ఎక్కువ అని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో అన్నారు. ‘రూ.27 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల నిర్మించి ఉంటే ఎంతో మేలు జరిగేది. బ్యారేజీల విషయంలో మా రిపోర్టుకు వ్యతిరేకంగా వెళ్లారని CWC చెప్పింది. రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేయడం చిన్న విషయం కాదు. మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని BRS హయాంలోనే NDSA చెప్పింది’ అని తెలిపారు.

News August 31, 2025

SEP నుంచి ఏమేం మారుతాయంటే!

image

*SEP 3, 4 తేదీల్లో జరగనున్న 56వ GST సమావేశంలో 4 శ్లాబులకు బదులు.. 5%, 18% శ్లాబులను మాత్రమే ఖరారు చేసే అవకాశం.
*రేపటి నుంచి వెండి ఆభరణాలకు హాల్ మార్క్ విధానం అమలు కావొచ్చు.
*కొన్ని SBI క్రెడిట్ కార్డ్స్‌కు డిజిటల్ గేమింగ్, Govt పోర్టల్స్‌లో పేమెంట్స్ రివార్డు పాయింట్స్ ఉండవు.
*SEP 30లోపు జన్‌ధన్ ఖాతాలకు KYC పూర్తి చేయాలి.
*2025-26 అసెస్మెంట్ ఇయర్ ITR ఫైలింగ్‌కు SEP 15 చివరి తేదీగా ఉంది.

News August 31, 2025

మేడిగడ్డ కూలింది ఇందుకే..: మంత్రి పొంగులేటి

image

TG: డయాఫ్రమ్ వాల్‌ను కాంక్రీట్‌తో కాకుండా సీకెంట్ పైల్ వాల్ టెక్నాలజీతో కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ‘మేడిగడ్డలో కేసీఆర్ ఫాంహౌస్‌లోని బావి సైజులో రంధ్రం పడింది. మామ KCR చెప్పారు.. అల్లుడు హరీశ్ పాటించారు. ఒకే టెక్నాలజీతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టారు. ఆ మూడూ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News August 31, 2025

మా కుటుంబం ఎప్పుడూ బీఫ్ తినలేదు: సల్మాన్ ఖాన్ తండ్రి

image

తమ కుటుంబం ఇప్పటివరకు బీఫ్ తినలేదని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తెలిపారు. తాము ముస్లింలైనప్పటికీ తమ ఇంట్లో దానిని నిషేధించామని చెప్పారు. ‘ఆవు పాలు తల్లి పాలతో సమానం. అందుకే మేం బీఫ్‌కు దూరం. ఫుడ్ విషయంలో ఎవరేం తిన్నా అది వారిష్టం. మా ఫ్యామిలీ అన్ని మతాలను గౌరవిస్తుంది. ఇంట్లో అన్ని పండుగలు జరుపుకుంటాం. ఈ ఏడాది కూడా గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.

News August 31, 2025

పోలవరం కొట్టుకుపోయినా NDSA ఎందుకు పట్టించుకోవట్లేదు: హరీశ్

image

TG: పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయినా NDSA ఎందుకు విచారణ జరపడం లేదని హరీశ్ రావు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘2019-25 వరకు పోలవరం డయాఫ్రమ్ వాల్, గైడ్‌బండ్, కాఫర్ డ్యామ్.. కొట్టుకుపోయాయి. రిపేర్‌కు రూ.7 వేల కోట్లు అవుతుంది. ఆ సమయంలో పోలవరం చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ మేడిగడ్డపై రిపోర్ట్ ఇస్తారా. NDSAకు నచ్చితే ఒక నీతి.. నచ్చకుంటే ఒక నీతి ఉంటుందా’ అని నిలదీశారు.

News August 31, 2025

చికెన్ తిని అలాగే పడుకుంటున్నారా?

image

రాత్రి పూట చికెన్ తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘పడుకునే ముందు చికెన్ తింటే సరిగ్గా జీర్ణం కాదు. గుండెలో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. నిద్రకు అంతరాయం కలుగుతుంది. కొవ్వు పేరుకుపోయి బరువు పెరగడానికి దారి తీస్తుంది. రక్తపోటు, డయాబెటిస్‌కు కూడా దారి తీసే ఛాన్స్ ఉంది. తిన్న 2-3 గంటల తర్వాత నిద్ర పోవడం ఉత్తమం’ అని నిపుణులు అంటున్నారు.

News August 31, 2025

VIRAL: ఒకటో తరగతికి రూ.8,35,000 ఫీజు

image

బెంగళూరులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పిల్లల ఫీజులు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏడాదికి 1-5 తరగతులకు రూ.7.35 లక్షలు, 6-8కి రూ.7.75 లక్షలు, 9-10 క్లాసులకు రూ.8.50 లక్షల ఫీజు అని ఆ స్కూల్ పేర్కొంది. రెండు టర్మ్‌ల్లో చెల్లించాలని తెలిపింది. అంతేకాదు అడ్మిషన్ ఫీజు రూ.లక్ష అని వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని, జాయిన్ అవ్వకపోతే తిరిగి రీఫండ్ చేయడం కుదరదని స్పష్టం చేసింది.

News August 31, 2025

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్

image

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో తాను వివాహం చేసుకోనున్నట్లు టాలీవుడ్ హీరో నారా రోహిత్ తెలిపారు. ‘ప్రతినిధి 2’ హీరోయిన్ శిరీషను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. రోహిత్ నటించిన ‘సుందరకాండ’ మూవీ ఇటీవలే విడుదలైంది.