News November 7, 2025

టెక్నికల్ సమస్య వల్లే అంతరాయం: రామ్మోహన్

image

ATCలో సాంకేతిక లోపం వల్లే ఢిల్లీ, ముంబైలో విమానాల రాకపోకలకు <<18227103>>అంతరాయం<<>> ఏర్పడిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ టెక్నికల్ సమస్య వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అయినా లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. విమానాలు సకాలంలో నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.

News November 7, 2025

ఈ వ్యాధులు ఉంటే అమెరికా వీసా కష్టమే!

image

వీసా నిబంధనలను కఠినం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గుండె సంబంధ సమస్యలు, రెస్పిరేటరీ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వీసా నిరాకరించాలని మార్గదర్శకాలు రూపొందించినట్టు వార్తలు వస్తున్నాయి. వారిని అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని వీసా మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

News November 7, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

☛ 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్(ఫీచర్ ఫిల్మ్)గా ‘కమిటీ కుర్రాళ్లు’ డైరెక్టర్‌ యధు వంశీ నామినేట్
☛ DEC 25న థియేటర్లలోకి మోహన్‌లాల్ ‘వృషభ’ మూవీ
☛ ‘కథనార్-ది వైల్డ్ సోర్సెరర్’ మూవీ నుంచి అనుష్క శెట్టి లుక్ రివీల్. రోజిన్ థామస్ దర్శకుడు. ప్రధాన పాత్రలో మలయాళ నటుడు జయసూర్య
☛ TV యాడ్ కోసం సచిన్ టెండూల్కర్‌ను డైరెక్ట్ చేసిన ‘OG’ డైరెక్టర్ సుజీత్

News November 7, 2025

పెళ్లి ఏర్పాట్లలో రష్మిక!

image

విజయ్ దేవరకొండతో రష్మిక మంధాన వచ్చే ఏడాది వివాహ <<18217983>>బంధంలోకి <<>>అడుగు పెట్టనున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఫేమస్ వెడ్డింగ్ డెస్టినేషన్ జైపూర్(రాజస్థాన్)లో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సరైన వేదిక కోసం రష్మిక 3 రోజులు అక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. జైపూర్‌లోని పలు రిసార్టులను పరిశీలించారని టాక్. త్వరలోనే వేదికను ఖరారు చేయనున్నట్లు సినీ వర్గాల ప్రచారం.

News November 7, 2025

అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం

image

AP: నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్ అందించారు.

News November 7, 2025

ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్సే: శ్రీధర్ బాబు

image

TG: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు BJP, BRSకు గుణపాఠం చెబుతారన్నారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

News November 7, 2025

కేంద్ర బలగాలతో ఉప ఎన్నిక నిర్వహించాలి: BRS

image

ECI అధికారులతో BRS MPలు సురేశ్ రెడ్డి, దామోదర్ రావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. CM, మంత్రులు అధికార దుర్వినియోగానికి, కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించాలన్నారు. స్త్రీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున మహిళా అధికారులను నియమించాలన్నారు.

News November 7, 2025

వంగ, బెండలో కాపు దశలో చీడల నివారణ

image

కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.

News November 7, 2025

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

image

క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్‌లో ఆడుతారా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. IPL-2026లో ధోనీ ఆడుతారని వెల్లడించారు. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటానని ఆయన తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను తీసుకునే అంశంపైనా సీఎస్కే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

News November 7, 2025

₹1,01,899 CR పెట్టుబడులకు CBN ఆమోదం

image

AP: రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా చూడడంతో పాటు పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. పారిశ్రామికవేత్తల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. భూమి, ఇతర రాయితీలు పొందిన వాటిని సమీక్షించి పురోగతి లేకుంటే రద్దు చేయాలని SIPB భేటీలో స్పష్టం చేశారు. ల్యాండ్ బ్యాంకును ఏర్పాటుచేయాలని సూచించారు. కాగా భేటీలో ₹1,01,899 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు.