India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 55 పోస్టులకు అప్లై చేయడానికి నవంబర్ 13 ఆఖరు తేదీ. ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, ఐటీ, ఎలక్ట్రీషియన్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18- 35ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.isro.gov.in/.

శ్రీ వైశంపాయన ఉవాచ
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత ||
దీనిని వైశంపాయనుడు చెప్పారు. దీనర్థం: ‘సమస్త ధర్మాలను, పవిత్రమైన విషయాలన్నింటినీ పూర్తిగా విన్న తర్వాత, యుధిష్టరుడు మరల భీష్మునితో ఇలా పలికెను’. భీష్ముడు చెప్పిన అన్ని విషయాలను శ్రద్ధగా విన్న యుధిష్టరుడు తన సందేహాల నివృత్తికై, జ్ఞాన జిజ్ఞాసతో మళ్లీ వాటిని అడిగి తెలుసుకున్నాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

ప్రభుత్వ <<17882827>>షట్‌డౌన్ <<>>త్వరలోనే ముగుస్తుందని US ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. అయితే ఖైదీలకు, ఇల్లీగల్స్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు తాను ఒప్పుకోనని, ఈ విషయాన్ని డెమొక్రాట్లు అర్థం చేసుకుంటారని చెప్పారు. 40 రోజులుగా కొనసాగుతున్న సుదీర్ఘ షట్‌డౌన్ కారణంగా పలు ప్రభుత్వ <<17975561>>సర్వీసులపై<<>> తీవ్ర ప్రభావం పడింది. కార్మికులకు జీతాలు అందడం లేదు.

AP: రాష్ట్రంలోని MSMEలకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే తరహా పరిశ్రమలున్న క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల(CFC)ను ఏర్పాటుచేయనుంది. ఒక్కోదానికి ₹10కోట్లు వెచ్చించనుంది. ఇందులో కొత్త డిజైన్లు, రీసెర్చ్, టెక్నాలజీ, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ తదితర సదుపాయాలు ఉంటాయి. వీటివల్ల MSMEలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశం లభిస్తుంది.

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి వాటికి తగ్గ ట్రీట్‌మెంట్ చేయాలి.

IAFలో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(AFCAT)-2026 <

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.

IVFలో 5 కీలకమైన దశలు ఉంటాయి. ఎగ్ స్టిమ్యులేషన్‌కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి బ్లడ్ టెస్ట్ చేయడానికి 9-14 రోజులు పడుతుంది. తర్వాత పిండాన్ని బదిలీ చేస్తారు. యావరేజ్‌గా IVF సైకిల్ కోసం 17-20 రోజుల సమయం పడుతుంది. అయితే పేషెంట్ కండీషన్ బట్టి.. సమయం మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా సంతానం పొందాలనుకునేవారు ప్రోటీన్లు, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.

చక్కెర తినడం మానేస్తే శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఆకలి తగ్గుతుంది. సాధారణంగా బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె, కాలేయం మరింత ఆరోగ్యవంతంగా మారుతాయి. చిరాకు, ఆందోళన తగ్గి ఫోకస్ పెరుగుతుంది. అయితే ఒక్కసారిగా మానేయకుండా క్రమంగా తగ్గించాలి’ అని సూచిస్తున్నారు.

ముంబై పోర్ట్ అథారిటీలో 116 గ్రాడ్యుయేట్, COPA అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్‌తో పాటు NCVT సర్టిఫికెట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. COPA 105, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 11 ఉన్నాయి. NATS పోర్టల్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్‌సైట్:https://mumbaiport.gov.in/
Sorry, no posts matched your criteria.