News August 31, 2025

కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో చర్చ.. ఉత్కంఠ

image

TG: ఈ మధ్యాహ్నం కేరళకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. నివేదికలోని ప్రధాన అంశాలతో మంత్రి ఇప్పటికే నోట్ రెడీ చేసుకున్నారు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News August 31, 2025

పదేళ్లలో 1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ: CM

image

KC వేణుగోపాల్ ప్రారంభించిన MP మెరిట్ అవార్డులకు దేశంలో ఎంతో ప్రత్యేకత ఉందని CM రేవంత్ పేర్కొన్నారు. కేరళలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘కేరళలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. TGలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించాం. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.

News August 31, 2025

బదోనీ ‘డబుల్’ బాదుడు.. సెమీస్‌కు నార్త్ జోన్

image

దులీప్ ట్రోఫీలో భాగంగా క్వార్టర్ ఫైనల్-1లో నార్త్ జోన్ ప్లేయర్ ఆయుష్ బదోనీ(204*) డబుల్ సెంచరీతో రెచ్చిపోయారు. ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో 223 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్లతో ద్విశతకం బాదారు. ఫస్ట్ ఇన్నింగ్సులోనూ బదోనీ 63 పరుగులు సాధించారు. యశ్ ధుల్, అంకిత్ కుమార్ కూడా శతకాలు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నార్త్ జోన్ నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

News August 31, 2025

జనసేన జాతీయ, టీడీపీ అంతర్జాతీయ పార్టీలు: పేర్ని సెటైర్స్

image

AP: జనసేన జాతీయ పార్టీ, TDP అంతర్జాతీయ పార్టీ అని YCP నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. జనసేన సిద్ధాంతాలు అర్థంకాక ఆ పార్టీ నేతలే సతమతం అవుతున్నారని తెలిపారు. సుగాలి ప్రీతి పేరును వాడుకుని పవన్ రాజకీయాల్లో ఎదిగారని విమర్శించారు. ‘ప్రీతి కుటుంబానికి న్యాయం చేసింది YS జగనే. ఆమె కుటుంబానికి పవన్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఆ కేసులో ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు.. చంద్రబాబును’ అని ఫైర్ అయ్యారు.

News August 31, 2025

రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త

image

AP: రేషన్ షాపుల్లో రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గుంటూరు(D) తెనాలి(M) నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ‘ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తాం. నిన్నటి నుంచి కాకినాడ, ELR, GNT, చిత్తూరు జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించాం. సెప్టెంబర్ 15 నాటికి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.

News August 31, 2025

మైనర్లకు వాహనాలిస్తే రూ.లక్ష జరిమానా!

image

TG: 18 ఏళ్లు నిండకుండానే బైకులతో రోడ్లపై రయ్ రయ్ అంటూ మైనర్లు దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో తమ పిల్లలు ప్రాణాలు కోల్పోకూడదని జనగామ(D) నాగిరెడ్డిపల్లి గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపితే పెరెంట్స్‌కు రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించింది. ప్రమాదాల నివారణకు బాధ్యతతో ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం అన్ని గ్రామాలకు ఆదర్శనీయం.

News August 31, 2025

శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైరవుతున్నారు: లలిత్

image

IPL-2008 సమయంలో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన వీడియో బయట పెట్టడంపై <<17559909>>శ్రీశాంత్ భార్య<<>> ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై లలిత్ మోదీ స్పందించారు. ‘శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైరవుతున్నారో నాకర్థం కాలేదు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఏం జరిగిందనే నిజాన్ని షేర్ చేశా. శ్రీశాంత్ బాధితుడు. నేను సరిగ్గా అదే చెప్పా. గతంలో నన్నెవరూ ఈ ప్రశ్న అడగలేదు. క్లార్క్ అడిగితేనే స్పందించా’ అని తెలిపారు.

News August 31, 2025

రేపు గవర్నర్‌ను కలుస్తాం: పొన్నం

image

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రేపు కలవనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రధాని మోదీ, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. BRS సహా అన్ని పార్టీల నేతలనూ గవర్నర్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

News August 31, 2025

నటి ప్రియా మరాఠే కన్నుమూత

image

ప్రముఖ మరాఠీ నటి ప్రియా మరాఠే(38) ముంబైలోని తన నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో కొన్నాళ్లు యాక్టింగ్‌కు విరామం తీసుకున్న ఆమె.. తగ్గిందని భావించి తిరిగి నటన ప్రారంభించారు. వ్యాధి ముదరడంతో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ప్రియ 2006 నుంచి టీవీ పరిశ్రమలో ఉన్నారు. 20కిపైగా సీరియల్స్‌, 2 చిత్రాల్లో నటించారు. సుశాంత్ సింగ్‌తో కలిసి చేసిన ‘పవిత్ర్ రిష్తా’ అనే సీరియల్‌తో ఆమె పాపులరయ్యారు.

News August 31, 2025

తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం

image

AP: ఆధ్యాత్మిక నగరం తిరుపతి మహిళా పార్లమెంటేరియన్ల సమావేశానికి వేదిక కానుంది. SEP 14, 15 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి పలు రాష్ట్రాల నుంచి 300మంది మహిళా MLAలు, MLCలు హాజరవనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, CM CBN కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, 15న ముగింపు వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ వేడుకలకు ఏపీ ఆతిథ్యం ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.