India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో స్పష్టతనిచ్చింది. ఇవాళ ఆదివారం కావడంతో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి ఆయనతో పాటు అల్లు అర్జున్‌ను ఓదార్చారు. ఇతర కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. వృద్ధాప్య సమస్యలతో కనకరత్నం (94) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
TG: BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను ఆమోదించని గవర్నర్ బిల్లుపై సంతకం పెడతారా అని ప్రభుత్వాన్ని KTR ప్రశ్నించారు. ‘అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినంత మాత్రాన అమలు కాదు కదా. గవర్నర్‌తో బలవంతంగా సంతకం పెట్టిస్తారా? సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? BC రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే CM రేవంత్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలి’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలన్నారు.
AP: ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్(SVP)లో పాల్గొనాలని మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఢిల్లీలోని AUS హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఈ లేఖను మంత్రికి పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశంసించారు. SVPలో ఆస్ట్రేలియా విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలతో సమావేశమై అభివృద్ధి ప్రాధాన్యతలు, పెట్టుబడులపై చర్చించే అవకాశం ఉంటుంది.
TG: BCలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లుపై KTR అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు 50% సీలింగ్ విధించింది. దీనిని అతిక్రమించే అధికారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయడమే ఏకైక మార్గం. పార్లమెంట్‌లో BJP, INCకే మెజార్టీ ఉంది. BCలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే అసెంబ్లీలో కాదు. 9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే పరిష్కారం లభిస్తుంది’ అని చెప్పారు.
TG: స్థానిక సంస్థల ఎన్నికలపై చిట్ చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మొదట MPTC, ZPTC ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10 తర్వాత ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. సెప్టెంబర్ 30లోపే ఎన్నికలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ <<17568780>>ఎన్నికల<<>> నిర్వహణ కోసం SEC ఓటర్ల ముసాయిదా షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో రూపొందుతోన్న ‘అఖండ-2’ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. జియో హాట్‌స్టార్ సంస్థ రూ.85 కోట్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. బాలకృష్ణ సినిమాల్లో ఇదే రికార్డు ధర అని చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉంది.
TG: అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ కేరళకు బయల్దేరారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహిస్తున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సా.4 గంటలకు సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగే చర్చలో పాల్గొంటారు.
TG: BRS నేతల మాటలు నమ్మి గవర్నర్ BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపించారని CM రేవంత్ అన్నారు. BRS తెరవెనక లాబీయింగ్ చేసి రాష్ట్రపతికి పంపేలా చేసిందని ఆరోపించారు. ‘సభలో గందరగోళం సృష్టించి బిల్లు ఆమోదం పొందకుండా మాట్లాడుతున్నారు. BRSకు ప్రజలు ఇప్పటికే శిక్ష విధించారు. అయినా మారకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మమ్మల్ని అభినందించి ఉంటే KCR పెద్దరికం పెరిగి ఉండేది’ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీలో మూడు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు, మున్సిపల్ చట్టసవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. తొలుత మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించారు.
Sorry, no posts matched your criteria.