News August 31, 2025

మంత్రి లోకేశ్‌కు మరో అరుదైన గౌరవం

image

AP: ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌(SVP)లో పాల్గొనాలని మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఢిల్లీలోని AUS హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఈ లేఖను మంత్రికి పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశంసించారు. SVPలో ఆస్ట్రేలియా విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలతో సమావేశమై అభివృద్ధి ప్రాధాన్యతలు, పెట్టుబడులపై చర్చించే అవకాశం ఉంటుంది.

News August 31, 2025

రాజ్యాంగ సవరణే మార్గం: KTR

image

TG: BCలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లుపై KTR అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు 50% సీలింగ్ విధించింది. దీనిని అతిక్రమించే అధికారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయడమే ఏకైక మార్గం. పార్లమెంట్‌లో BJP, INCకే మెజార్టీ ఉంది. BCలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే అసెంబ్లీలో కాదు. 9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే పరిష్కారం లభిస్తుంది’ అని చెప్పారు.

News August 31, 2025

అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్: వెంకట్‌రెడ్డి

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై చిట్ చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మొదట MPTC, ZPTC ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10 తర్వాత ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. సెప్టెంబర్ 30లోపే ఎన్నికలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ <<17568780>>ఎన్నికల<<>> నిర్వహణ కోసం SEC ఓటర్ల ముసాయిదా షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

News August 31, 2025

బాలయ్య ‘అఖండ-2’ సినిమాకి భారీ ధర?

image

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో రూపొందుతోన్న ‘అఖండ-2’ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. జియో హాట్‌స్టార్ సంస్థ రూ.85 కోట్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. బాలకృష్ణ సినిమాల్లో ఇదే రికార్డు ధర అని చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉంది.

News August 31, 2025

కేరళకు బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ కేరళకు బయల్దేరారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహిస్తున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సా.4 గంటలకు సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగే చర్చలో పాల్గొంటారు.

News August 31, 2025

బీసీ బిల్లు ఆమోదం కాకుండా BRS లాబీయింగ్: CM రేవంత్

image

TG: BRS నేతల మాటలు నమ్మి గవర్నర్ BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపించారని CM రేవంత్ అన్నారు. BRS తెరవెనక లాబీయింగ్ చేసి రాష్ట్రపతికి పంపేలా చేసిందని ఆరోపించారు. ‘సభలో గందరగోళం సృష్టించి బిల్లు ఆమోదం పొందకుండా మాట్లాడుతున్నారు. BRSకు ప్రజలు ఇప్పటికే శిక్ష విధించారు. అయినా మారకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మమ్మల్ని అభినందించి ఉంటే KCR పెద్దరికం పెరిగి ఉండేది’ అని వ్యాఖ్యానించారు.

News August 31, 2025

బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం

image

తెలంగాణ అసెంబ్లీలో మూడు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు, మున్సిపల్ చట్టసవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. తొలుత మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించారు.

News August 31, 2025

బీసీ బిల్లుకు BJP పూర్తి మద్దతు: పాయల్ శంకర్

image

TG: బిల్లుపై బీసీలకున్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ‘42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ చర్చించాలి. మీ చేతిలోని అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేంటి ఇబ్బంది? మంత్రివర్గంలో BCల సంఖ్య ఎంత? బీసీల సంక్షేమం కోసం ఏడాదికి రూ.20 వేలకోట్లు చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికీ 4 పైసలు రాలేదు’ అని వ్యాఖ్యానించారు.

News August 31, 2025

బార్లకు తగ్గిన దరఖాస్తుల కిక్కు

image

APలో సగానికి పైగా బార్లకు మళ్లీ దరఖాస్తులు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 840 బార్లకు మూడేళ్ల పరిమితితో నోటిఫికేషన్ ఇవ్వగా 388 బార్లకు నిన్న లాటరీలు తీసి, టెండర్లు ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఒక బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రాకపోవడంతో 452 బార్లకు లాటరీ తీయలేదు. 37 బార్లకు ఒకట్రెండు దరఖాస్తులే రావడంతో రేపటి వరకు గడువు పొడిగించారు. వీటికి నాలుగేసి దరఖాస్తులొస్తే ఎల్లుండి లాటరీ తీస్తారు.

News August 31, 2025

Way2News EXCLUSIVE… కాళేశ్వరం రిపోర్ట్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 665 పేజీలతో ప్రవేశపెట్టిన ఈ రిపోర్టును <>Way2News<<>> సంపాదించింది. ప్రాజెక్టు అంచనాల తయారీ, పరిపాలన, CWC అనుమతుల్లో లోపాలున్నాయని నివేదిక స్పష్టం చేసింది. KCR నిర్ణయం మేరకే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లు నిర్మించారని పేర్కొంది. సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో దీనిపై చర్చ జరగనుంది.