News October 30, 2024

ఎడిటర్ మృతికి హీరో సూర్య దిగ్భ్రాంతి

image

‘కంగువా’ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్(43) <<14487953>>మృతిపై <<>>తమిళ హీరో సూర్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నిషాద్ ఇక లేరనే వార్త విని నా గుండె పగిలిపోయింది. మీరు ఎల్లప్పుడూ కంగువ జట్టులో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తుండిపోతారు. మా ఆలోచనలు, ప్రార్థనల్లో మీరు ఎప్పటికీ ఉంటారు. ఆయన కుటుంబానికి & స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News October 30, 2024

షర్మిలకు భద్రత పెంచాలి: ఏపీ కాంగ్రెస్

image

APCC చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంచాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈమేరకు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం షర్మిలకు ఉన్న 2+2 గన్‌మెన్స్ స్థానంలో 4+4 సెక్యూరిటీని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆమెకు భద్రత పెంచాలని కాంగ్రెస్ కోరడం గమనార్హం.

News October 30, 2024

BREAKING: ఫలితాలు విడుదల

image

ఛార్టెర్డ్ అకౌంటెంట్స్, ఇంటర్, ఫౌండేషన్ పరీక్షల ఫలితాలు రిలీజయ్యాయి. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల తమ ఫలితాలను తెలుసుకునేందుకు రోల్ నంబర్‌తో పాటు రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News October 30, 2024

నష్టాలు: పాత పెట్టుబడుల్ని వదిలించుకున్నారు

image

దీపావ‌ళికి ముందు ఇన్వెస్ట‌ర్లు పాత పెట్టుబ‌డుల‌ను వ‌దిలించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం న‌ష్టాల‌బాట‌ప‌ట్టాయి. సెన్సెక్స్ 426 పాయింట్లు న‌ష్ట‌పోయి 79,942 వ‌ద్ద, నిఫ్టీ 126 పాయింట్లు న‌ష్ట‌పోయి 24,340 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. Finance, Pharma షేర్లు న‌ష్ట‌పోయాయి. క్యాపిట‌ల్ గూడ్స్‌, ఆటో రంగ షేర్ల‌కు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించింది. Adani Ent, Hero Motoco టాప్ గెయినర్స్.

News October 30, 2024

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలు

image

TG: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే BC రిజర్వేషన్ల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అధ్యయనాన్ని బీసీ కమిషన్‌కు అప్పజెప్పడాన్ని పిటిషనర్ తరఫున న్యాయవాది తప్పుబట్టారు. అది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. కాగా 2 వారాల్లో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

News October 30, 2024

మద్యంపై ఖర్చు చేయడంలో తెలంగాణ NO.1

image

మద్యం అమ్మకాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. భారత్‌లో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. 2022-23లో రాష్ట్రంలో యావరేజ్‌గా ఓ వ్యక్తి రూ.1623 ఖర్చు చేసినట్లు నివేదికలో వెల్లడైంది. AP సగటున రూ.1306 ఖర్చుతో రెండో స్థానంలో ఉంది. తర్వాత పంజాబ్‌ (రూ.1245), ఛత్తీస్‌గఢ్(రూ.1227) ఉన్నాయి. కింగ్‌ఫిషర్, మెక్‌డొవెల్స్, టుబర్గ్‌లు పాపులర్ బ్రాండ్స్‌గా నిలిచాయి.

News October 30, 2024

ICC ర్యాంకింగ్స్‌: బుమ్రా కిందకి.. జైస్వాల్ పైకి

image

తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ బుమ్రా 3వ స్థానానికి పడిపోయారు. అశ్విన్ 4, జడేజా 8వ స్థానంలో ఉన్నారు. ఈ విభాగంలో సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడ అగ్రస్థానానికి చేరుకున్నారు. బ్యాటింగ్‌ విభాగంలో భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 3వ స్థానానికి ఎగబాకారు. టాప్‌-10లో భారత్ నుంచి అతనొక్కడే ఉన్నారు. ఈ విభాగంలో టాప్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ రూట్ ఉన్నారు.

News October 30, 2024

రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు: MLA జీవీ

image

AP: రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఉచిత పంటల బీమా పేరిట రైతులను జగన్ ముంచారని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై ఆయన మొసలి కన్నీరు మానుకోవాలని చురకలంటించారు. బీమా సంస్థలకు రూ.1300 కోట్లకు పైగా బకాయిలు పెట్టి, వాటిని మేం కట్టాలనడం శోచనీయమని అన్నారు. సాగును అస్తవ్యస్తం చేసిన జగన్ రైతులను ఆత్మహత్య ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు.

News October 30, 2024

విరాట్ కోహ్లీ భావోద్వేగాలు అదుపులో లేవు: హాగ్

image

టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ భావోద్వేగాలు అదుపులో లేకపోవడం వల్లనే రాణించలేకపోతున్నారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించారు. ‘విరాట్ పరిస్థితిని మరీ ఎక్కువగా అంచనా వేసి దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే విఫలమవుతున్నారు. అతడితో పోలిస్తే రోహిత్ టెక్నిక్ ప్రస్తుతం బాగుంది. ఏదేమైనా.. న్యూజిలాండ్‌ను భారత్ తేలికగా తీసుకోవడమే ఈ సిరీస్ ఓటమికి కారణం’ అని విశ్లేషించారు.

News October 30, 2024

సామాన్యుడు ఖర్చుపెట్టే రూ.100లో అదానీకే రూ.36 వెళ్తోంది: కాంగ్రెస్

image

BJP పదేళ్ల పాలనలో ఎకానమీ పతనావస్థకు చేరుకుందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు. వేతనాల్లో గ్రోత్ నిలిచిపోయిందని, ద్రవ్యోల్బణం పెరిగిందని విమర్శించారు. వస్తు వినియోగం తగ్గడంతో లాంగ్‌టర్మ్‌లో GDP గ్రోత్‌ తగ్గే ప్రమాదం ఉందన్నారు. 2015లో కామన్ మ్యాన్ రూ.100 వస్తువులు కొంటే 18% ఇండస్ట్రియలిస్ట్ ఓనర్‌కు వెళ్లేదన్నారు. ఇప్పుడు అదే ఓనర్‌కు రూ.36 వెళ్తోందని అదానీని పరోక్షంగా విమర్శించారు.