India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగి నెల గడిచినా ఎలాంటి అప్‌డేట్ లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఈడీ, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట రావట్లేదు. భారీగా నగదు దొరికినట్లు మీడియాలో వచ్చినా కేసు కూడా ఫైల్ చేయలేదు. రైడ్స్ తర్వాత అదానీ హైదరాబాద్ వచ్చి రహస్యంగా పొంగులేటితో భేటీ అయ్యారు. ఇక్కడ క్విడ్ ప్రో కో ఏంటి? మీకేమైనా తెలుసా?’ అని నెటిజన్లను ప్రశ్నించారు.
TG: రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. దీంతో ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ ఫోకస్ చేసింది. ఇంటర్వ్యూలు లేకపోవడంతో రాతపరీక్షలో వచ్చిన మార్కులే కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో పకడ్బందీగా వాల్యుయేషన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటుంది. దీంతో ఫలితాలకు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఫలితాలు హైకోర్టు తీర్పునకు లోబడే ఉండొచ్చని తెలుస్తోంది.
నేడు ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం. ఈ సందర్భంగా PM మోదీ దేశవ్యాప్తంగా రూ.12,850 కోట్ల విలువైన హెల్త్ సెక్టార్ ప్రాజెక్టులను వర్చువల్‌గా ఆరంభిస్తారు. ఢిల్లీలో AIIAలో ఆయుర్వేద మందులు తయారు చేసే పంచకర్మ ఆస్పత్రి, స్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్, సెంట్రల్ లైబ్రరీ, స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఆరంభిస్తారు.
హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తోన్న స్టార్లింక్ నేవీ సైనికులకు వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎర్ర సముద్రంలో ఒత్తిడిలో ఉండే సైనికులకు ఇది కాస్త ఉపశమనం ఇవ్వనుంది. ‘USS ఐసెన్‌హోవర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో యుద్ధ బృందంలోని నావికులకు ఈ WiFi కనెక్టివిటీ మనోధైర్యాన్ని ఇచ్చింది’ అని నేవీ కెప్టెన్ క్రిస్ చౌదా హిల్ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. దీనికి ‘కూల్’ అంటూ ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారు.
నిన్న ANR జాతీయ అవార్డు వేడుకల్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ వజ్రోత్సవం వేడుకల్లో లెజెండరీ అవార్డు ఇవ్వగా తనకు ఆ అర్హత లేదని సరెండర్ చేసినట్లు గుర్తు చేశారు. అప్పట్లో చిరు ఎమోషనల్ స్పీచ్ తెగ వైరలయింది. ఇప్పుడు తనకు ఆ అర్హత వచ్చిందని మెగాస్టార్ పేర్కొన్నారు. కాగా 2007 నాటి ఆ వేడుకల్లో ఓ సీనియర్ నటుడు తానూ అవార్డుకు అర్హుడినేనని వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనంగా మారింది.
TG: HYDలో ఖరీదైన ప్రాంతాలుగా పేరున్న కోకాపేట, రాయదుర్గంలో ₹20వేల కోట్ల విలువైన 400 ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూలధనం, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ₹10వేల కోట్ల రుణం కోసం పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థకు గ్యారంటీ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది.
న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో జరిగే మూడో టెస్టుకూ దూరమయ్యారు. ఇప్పటికే గాయం వల్ల తొలి రెండు టెస్టులు ఆడలేకపోయిన కేన్ మూడో టెస్టుకూ అందుబాటులో ఉండటం లేదు. అయితే బ్యాటింగ్ పరంగా కేన్ లేకపోవడం న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ అయినప్పటికీ ఆ జట్టు ఇప్పటికే భారత్‌పై 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది. నామమాత్రపు మ్యాచ్ NOV 1న ప్రారంభమవుతుంది.
TG: ఇళ్లలో కరెంట్ అసలేం వాడుకోకపోయినా గతంలో కనీస ఛార్జీ కింద రూ.30 చెల్లించాల్సి వచ్చేది. దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది గృహజ్యోతికి అర్హులు కాని వారికి ఉపయోగపడనుంది. గృహేతర/వాణిజ్య పరంగా 50 యూనిట్లలోపు కరెంట్ వాడే వారికి ఫిక్స్‌డ్ ఛార్జీలను కిలోవాట్‌కు రూ.60 నుంచి రూ.30 తగ్గించింది. ఇదే కేటగిరీలో కనీస ఎనర్జీ ఛార్జీలను సింగిల్ ఫేజ్‌కు రూ.65-50కి, త్రీఫేజ్‌కు రూ.200-100కు తగ్గించింది.
AP: అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో AI, IT, నైపుణ్యాభివృద్ధికి ఆయన మద్దతు కోరినట్లు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో డిజిటల్ పరివర్తనకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో పర్యటించాలని ఆయనకు మంత్రి ఆహ్వానం పలికారు. ఈ క్రమంలో సత్య నాదెళ్లతో దిగిన ఫొటోలను పంచుకున్నారు.
భారతీయ అమెరికన్లకు ప్రెసిడెంట్ జోబైడెన్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వైట్‌హౌస్‌లో సోమవారం (Local Time) వేడుకలు నిర్వహించారు. ‘ప్రతి అమెరికన్ లైఫ్‌ను దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీ సంపన్నం చేస్తోంది. మీది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ. ఇప్పుడు వైట్‌హౌస్‌లో దీపావళిని గర్వంగా జరుపుకుంటున్నాం’ అని తెలిపారు. 2016లో తన భార్యతో కలిసి ఈ పండుగను తొలిసారి జరుపుకోవడాన్ని గుర్తుచేశారు.
Sorry, no posts matched your criteria.