News August 31, 2025

ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: హైకోర్టు

image

TG: 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఉద్యోగం ఇవ్వాలని క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. చట్టప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండాపోతే చనిపోయినట్లేనని, వారసత్వం కింద కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఇండియన్ బ్యాంకుకు సూచించింది. వారికి రావాల్సిన పదవీ తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని ఖమ్మంకు చెందిన వనపట్ల సుగుణ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ఈ ఆదేశాలిచ్చారు.

News August 31, 2025

మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా?

image

జీమెయిల్ అకౌంట్ యూజర్లకు గూగుల్ కీలక సూచన చేసింది. హ్యాకింగ్ అటాక్స్ నేపథ్యంలో వెంటనే పాస్‌వర్డ్స్ ఛేంజ్ చేసుకోవాలంది. థర్డ్ పార్టీ సేల్స్‌ఫోర్స్ సిస్టమ్ డేటాను తస్కరించడంతో 250కోట్ల మంది అకౌంట్స్ ప్రమాదంలో పడ్డాయని ఇటీవల గూగుల్ వెల్లడించింది. అయితే కస్టమర్ డేటాకు ప్రమాదం లేదని, కంపెనీ సేల్స్‌ఫోర్స్ సిస్టమ్‌కు ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా పాస్‌వర్డ్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

News August 31, 2025

‘స్థానిక’ ఎన్నికలు.. EC కీలక ఉత్తర్వులు

image

TG: సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం (EC) కార్యాచరణ ప్రారంభించింది. ‘MPTC, ZPTC స్థానాల్లో SEP 6న ముసాయిదా ఓటరు జాబితాలు ప్రచురించాలి. 6-8 వరకు వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించి 9న వాటిని పరిష్కరించాలి. 10న తుది ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలి’ అని కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

News August 31, 2025

ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే!

image

AP: సాధారణంగా మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలను ఈసారి FEBలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సిద్ధమైంది. CBSEతో పాటు ఎగ్జామ్స్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు తగినట్లు షెడ్యూల్‌లో మార్పులు చేసింది. తొలుత సైన్స్ స్టూడెంట్స్‌కు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు స్టార్ట్ అవుతాయి. తర్వాత లాంగ్వేజ్, చివర్లో ఆర్ట్స్ గ్రూప్ వారికి ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రాక్టికల్స్ నిర్వహణపై క్లారిటీ రావాల్సి ఉంది.

News August 31, 2025

అంచనాలకు మించి దూసుకెళ్తున్న భారత్

image

భారత ఎకానమీ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌(ఏప్రిల్-జూన్)లో <<17555786>>GDP<<>> వృద్ధి రేటు 7.8% నమోదవడమే ఇందుకు నిదర్శనం. మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్లు రాణించడం కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో అతిపెద్ద ఎకానమీగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో స్థానానికి చేరుతుందని అధికారులు వెల్లడించారు. అప్పటివరకు జీడీపీ $7.3 ట్రిలియన్లకు చేరుతుందని తెలిపారు.

News August 31, 2025

రేపు రాజంపేటలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేట మండలం, కె.బోయినపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల 1న సీఎం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేరుగా పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. రేపటి కార్యక్రమం అనంతరం సాయంత్రం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

News August 31, 2025

భారత్‌పై మరో కుట్రకు తెరలేపిన ట్రంప్?

image

50% టారిఫ్స్ అమలు చేస్తూ భారత ఎకానమీని దెబ్బకొట్టాలని చూస్తున్న ట్రంప్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. తమలాగే ఇండియాపై టారిఫ్స్ విధించాలని యూరోపియన్ దేశాలకు US సూచించినట్లు సమాచారం. IND నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లను కూడా పూర్తిగా నిలిపేయాలని చెప్పినట్లు తెలిసింది. ట్రేడ్ డీల్‌కు భారత్ ఒప్పుకోకపోవడం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోవడంతో ట్రంప్ అసహనానికి గురై ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం.

News August 31, 2025

నేడు కీలక చర్చ.. ప్రభుత్వం ఏం చేయనుంది?

image

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రిపోర్ట్‌ను మంత్రి ఉత్తమ్ సభ్యులకు వివరించిన అనంతరం సుదీర్ఘంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. సిట్ లేదా సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అటు పూర్తి నివేదికకు బదులు 63 పేజీల షార్ట్ రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెడతారని వార్తలొస్తున్నాయి.

News August 31, 2025

RRను వీడిన ద్రవిడ్.. కారణాలు ఇవేనా?

image

రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా <<17562348>>రాహుల్ ద్రవిడ్<<>> కొనసాగకపోవడానికి గల కారణాలను క్రిక్‌బజ్ అంచనా వేసింది. గత సీజన్‌లో టీమ్ వైఫల్యం (9వ స్థానం), కెప్టెన్ శాంసన్‌తో చిన్నపాటి భేదాభిప్రాయాలు, అతడు RRను వీడాలనుకోవడం, వేరే రోల్‌కు ద్రవిడ్ నిరాకరించడం వంటివి కారణం అయ్యుండొచ్చని పేర్కొంది. ఆ జట్టుకు మళ్లీ సంగక్కర తిరిగి కోచ్‌గా రావొచ్చని, శాంసన్ RRను వీడి వేలంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

News August 31, 2025

US వీసా ఫీజు పెంపు.. ట్రావెల్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం

image

US కొత్తగా తీసుకొచ్చిన వీసా ఇంటెగ్రిటీ ఫీజు ట్రావెల్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీని ప్రకారం ట్రావెలర్స్ $250(రూ.22వేలు) అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టోటల్ వీసా కాస్ట్ $442(రూ.39 వేలు)కు చేరనుంది. ఇది ఇండియా, చైనా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల వారికి భారంగా మారనుంది. అటు USకు వచ్చే టూరిస్టుల సంఖ్య మరింత తగ్గిపోయి, ఆదాయం పడిపోతుందని అక్కడి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.