News October 30, 2024

మహారాష్ట్రలో 56 మంది రెబల్స్.. అధికార, విపక్ష కూటముల్లో టెన్షన్

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార మ‌హాయుతి, విప‌క్ష మ‌హా వికాస్ అఘాడీ కూటముల‌ను రెబ‌ల్స్ టెన్ష‌న్ పెడుతున్నారు. మ‌హాయుతి కూట‌మిలోని BJP, NCP, శివ‌సేన టిక్కెట్లు ఆశించి భంగ‌ప‌డిన 40 మంది అభ్య‌ర్థులు రెబ‌ల్స్‌గా బ‌రిలో నిలిచారు. అటు MVA నుంచి 16 మంది రెబ‌ల్స్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ల గడువు ముగిసింది. నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ గ‌డువు (Nov 4th) వరకు ఎంత మంది బరిలో ఉంటారన్నది వేచిచూడాలి.

News October 30, 2024

ఇక్కడ వృద్ధులకు తోలుబొమ్మలే తోడు

image

చదువు, ఉపాధి కోసం యువత గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లడం కామన్. ఆ ఇళ్లలో పిల్లలు లేని లోటు తీర్చలేనిది. అందుకు జపాన్ అతీతం కాదు. అయితే అక్కడి ఇచినోనో గ్రామంలో ఇళ్లు విడిచి వెళ్లిన వారి లోటు తెలియనీయకుండా వృద్ధులకు తోలుబొమ్మలు తోడుగా ఉంటున్నాయి. ఆ వృద్ధులు వారి పిల్లల పోలికలతో బొమ్మలను తయారు చేసుకుంటున్నారు. అటు జపాన్ యువతలేమి, వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

News October 30, 2024

న్యూట్రల్‌గా ఉండాలని నిర్ణయం.. బెజోస్‌కు షాక్!

image

అమెరికా ఎన్నికలు సమీపిస్తోన్న వేళ Washington Post కీలక నిర్ణయం తీసుకుంది. ఏపార్టీకి సపోర్ట్‌గా కాకుండా న్యూట్రల్‌గా ఉండేందుకు నిర్ణయించినట్లు సంస్థ అధినేత బెజోస్ ప్రకటించారు. ‘సంప్రదాయ US మీడియాపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఫేక్ వార్తలనే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు. బెజోస్ నిర్ణయంతో Washington Post భారీగా సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది.

News October 30, 2024

నటిని పెళ్లి చేసుకోనున్న దర్శకుడు!

image

‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నటి చాందినీ రావును ఆయన ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 11న వీరి ఎంగేజ్మెంట్ వైజాగ్‌లో జరగనుందని తెలిపాయి. డిసెంబర్ 7న తిరుపతిలో పెళ్లి చేసుకుంటారని వెల్లడించాయి. కాగా చాందినీ కలర్ ఫొటో, రణస్థలి వంటి చిత్రాలతో పాటు హెడ్స్ అండ్ టేల్స్ వెబ్ సిరీస్‌లో నటించారు.

News October 30, 2024

కొత్త నిబంధనల అమలు.. గడువు పొడిగించిన ట్రాయ్

image

కొత్త టెలికం నిబంధనల్ని అమల్లోకి తెచ్చేందుకు గాను గడువును ట్రాయ్ మరోసారి పెంచింది. రేపటితో గడువు ముగియనుండగా టెలికం ఆపరేటర్ల అభ్యర్థన మేరకు DEC 1 వరకు పొడిగించింది. టెలీమార్కెటింగ్, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి వచ్చే సందేశాలు, OTPలను బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశాలిచ్చింది. నకిలీ కాల్స్‌ను గుర్తించేలా సిస్టమ్‌ను తీసుకొచ్చింది. అయితే దీని వల్ల బ్యాంకింగ్ సందేశాలు, OTPలను స్వీకరించడంలో ఆలస్యం కావొచ్చు.

News October 30, 2024

రాజమౌళి కొత్త పోస్ట్.. హైప్ ఎక్కించు అంటున్న MB ఫ్యాన్స్

image

SSMB29 కోసం లోకేషన్ వేటలో ఆఫ్రికాలో ఉన్న దర్శకుడు రాజమౌళి మరో పోస్ట్ చేశారు. సింహాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘దీని పేరు బాబ్ జూనియర్. సెరెంగెటి(ఆఫ్రికాలోని ఓ ప్రాంతం)కి రాజు. ఈ ఫొటోను క్రిస్ ఫాలోస్ తీశారు’ అని రాసుకొచ్చారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తూ హైప్ ఎక్కించు ఇంకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా క్రిస్ ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్.

News October 30, 2024

ఈ శతాబ్దపు పెద్ద జోక్ అది: షర్మిల

image

AP: జగన్‌తో వివాదం నేపథ్యంలో YCP <<14486706>>ఆరోపణలకు<<>> షర్మిల కౌంటర్ ఇచ్చారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు. ‘ఈడీ అటాచ్ చేసింది రూ.32 కోట్ల విలువైన కంపెనీ ఆస్తిని. షేర్ల బదిలీపై ఆంక్షలు లేవు. విజయమ్మకు రూ.42 కోట్ల షేర్లు ఎలా అమ్మారు? నాకు 100%వాటాలు ఇస్తామని MOUపై జగన్ సంతకం చేశారు. బెయిల్ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా?’ అని ప్రశ్నించారు.

News October 30, 2024

ఉచిత సిలిండర్ పథకం.. చెక్కు అందజేసిన సీఎం

image

AP: రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్యాస్ సరఫరా సంస్థలకు రూ.876 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. కాగా ఈ పథకానికి నిన్నటి నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సిలిండర్ డెలివరీ అయిన 24-48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

News October 30, 2024

భారత్‌లో బ్రిటన్ రాజ దంపతుల సీక్రెట్ ట్రిప్.. ఎందుకంటే!

image

కింగ్ ఛార్లెస్ III, కామిల్లా దంపతులు భారత్‌లో రహస్యంగా పర్యటిస్తున్నారని తెలిసింది. OCT 27 నుంచి వీరు బెంగళూరులోని SICHలో వెల్‌నెస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. యోగా, థెరపీ, మెడిటేషన్ థెరపీ తీసుకుంటున్నారని IE తెలిపింది. గతంలోనూ వీరిక్కడికి రావడం గమనార్హం. ఓ సీక్రెట్ ట్రిప్ కోసం వీరిద్దరూ OCT 21-26 మధ్య సమోవాకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు HAL ఎయిర్‌పోర్టులో దిగారని తెలిసింది.

News October 30, 2024

క్రాకర్స్ కాల్చేటప్పుడు చేయాల్సినవి.. చేయకూడనివి..

image

* కాటన్ దుస్తులే ధరించాలి.
* అందుబాటులో బకెట్ నీళ్లు, ఇసుకను ఉంచుకోండి.
* ఫెయిలైన బాణసంచాను మళ్లీ వెలిగించొద్దు.
* ఫ్లవర్‌పాట్‌లు, హ్యాండ్ బాంబ్‌లు కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.
* ఫైర్ క్రాకర్స్ వెలిగించి బహిరంగ ప్రదేశాల్లో విసిరేయకండి.
* అగ్నిప్రమాదం జరిగితే 101,112,100,1070ను సంప్రదించండి.