News November 10, 2025

శుభ సమయం (10-11-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ పంచమి ఉ.7.55 వరకు
✒ నక్షత్రం: పునర్వసు రా.1.17 వరకు
✒ శుభ సమయాలు: ఉ.6.30-7.10, రా.7.40-8.10
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.1.51-మ.3.22
✒ అమృత ఘడియలు: రా.11.00-రా.12.32

News November 10, 2025

TODAY HEADLINES

image

➧ కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్
➧ అనారోగ్యమే అసలైన పేదరికం: సీఎం చంద్రబాబు
➧ ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
➧ వారంలో TG TET నోటిఫికేషన్?
➧ ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి.. బిహార్ ప్రచారంలో లోకేశ్
➧ ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP
➧ డిసెంబర్ 15న IPL వేలం!

News November 10, 2025

సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

image

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండ‌రీ ఆసుప‌త్రులుండ‌గా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుప‌త్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్ద‌రు చొప్పున, మ‌రో 13 ఏరియా ఆసుప‌త్రుల‌కు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుప‌త్రుల‌కు ఇద్ద‌రు చొప్పున స్పెష‌లిస్టుల‌ను నియ‌మించారు. మ‌రో 97 ఆసుప‌త్రుల‌కు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.

News November 10, 2025

అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

image

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.

News November 10, 2025

కూతురి విజయం.. తండ్రికి మళ్లీ పోలీస్ జాబ్!

image

ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ సభ్యురాలైన క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. అంతేకాకుండా 2012లో ఎన్నికల విధుల్లో పొరపాటు వల్ల పోలీస్ ఉద్యోగం కోల్పోయిన ఆమె తండ్రి మున్నాసింగ్‌కు తిరిగి కానిస్టేబుల్ జాబ్ ఇస్తామని తెలిపింది. తన తండ్రిని మళ్లీ యూనిఫామ్‌లో చూడటం, ఆయన గౌరవంగా రిటైర్ అయ్యేలా చేయడమే తన కల అని క్రాంతి పేర్కొన్నారు. ఒకప్పుడు తమకు తిండికి కూడా ఉండేది కాదన్నారు.

News November 9, 2025

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: అనగాని

image

AP: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ పని ఉన్నా అది రెవెన్యూ ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. ‘గతంలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారు. YCP ప్రభుత్వం భూమి సమస్యలు సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సభల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించాం’ అని అనంతపురం జిల్లా పర్యటనలో అన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ పాత్ర కీలకం అని మరో మంత్రి పయ్యావుల చెప్పారు.

News November 9, 2025

‘ఎలుకల దాడి’పై మంత్రి సత్యకుమార్ సీరియస్

image

AP: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని DME రఘునందన్‌ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. కాగా హాస్టల్లోని పరిస్థితులపై తనిఖీ చేస్తున్నామని డీఎంఈ మంత్రికి తెలియజేశారు.

News November 9, 2025

తాజా వార్తలు

image

☛ పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. సంజీవని పథకం ద్వారా ఇంటి దగ్గరే వైద్యం అందిస్తాం. గ్రామాల్లో 5వేల వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తాం: CM చంద్రబాబు
☛ యాదగిరిగుట్టకు రూ.1,00,57,322 రికార్డ్ ఆదాయం. ఇవాళ ఆలయాన్ని దర్శించుకున్న 78,200మంది భక్తులు
☛ బిహార్‌లో మరోసారి ఎన్డీయేదే అధికారం: మంత్రి లోకేశ్
☛ నిన్నటి దాకా CM రేసులో భట్టి ఉండేవారు. ఇప్పుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా వచ్చారు: జగదీశ్ రెడ్డి

News November 9, 2025

నిద్ర సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

అధిక రక్తపోటు లక్షణాలు ఎక్కువగా రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాన్/ఎయిర్ కండిషనర్ ఉన్నా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ మూత్ర విసర్జన, దీర్ఘకాలిక అలసట, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, ముక్కు నుంచి రక్తం కారడం, ఛాతి నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

News November 9, 2025

రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన.. సీఎంతో భేటీ!

image

AP: రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రెండు బృందాలుగా ఏర్పడి పరిశీలించనుంది. రేపు టీం-1: ప్రకాశం, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నష్టాలను అంచనా వేయనుంది. ఎల్లుండి టీం-1: బాపట్ల, టీం-2: కోనసీమ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది.