News October 30, 2024

ముంబై పిచ్.. టీమ్ ఇండియా స్పెషల్ రిక్వెస్ట్?

image

NZతో మూడో టెస్టు జరిగే ముంబై వాంఖడే పిచ్‌ విషయంలో క్యూరేటర్‌కు టీమ్ ఇండియా ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ‘తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరిగేలా పిచ్‌ను రూపొందించాలని IND కోరింది. గెలిచేందుకు ఇన్నేళ్లూ అనుసరిస్తున్న ఫార్ములానే మూడో టెస్టులో ప్రయోగించనుంది’ అని రాసుకొచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌ను భారత్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

News October 30, 2024

కిరణ్ అబ్బవరంకి విశ్వక్ సేన్ సపోర్ట్

image

హీరో కిరణ్ అబ్బవరంకి మరో హీరో విశ్వక్ సేన్ మద్దతుగా నిలిచారు. ఎదిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ట్వీట్ చేశారు. ‘క’ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా నిన్న జరిగిన ‘క’ ప్రీరిలీజ్ ఈవెంట్లో <<14485692>>కిరణ్ చేసిన వ్యాఖ్యలు<<>> వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

News October 30, 2024

షుగర్ లెవల్స్ ఎంత ఉండాలంటే?

image

సాధారణంగా షుగర్ లెవల్స్ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు 70 నుంచి 99 మధ్య ఉండాలి. ఆహారం తిన్న తర్వాత గంటన్నరకు 140 వరకు ఉండవచ్చు. ఈ లిమిట్ దాటితే డయాబెటిస్‌గా పరిగణిస్తారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే వైట్ రైస్, అరటి, పొటాటో, పుచ్చకాయ, వైట్ బ్రెడ్ లాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

News October 30, 2024

రూ.50 కోట్ల కట్నం అడిగిన ఎయిమ్స్ టాపర్?

image

ఎయిమ్స్ టాపర్ రూ. 50 కోట్లు కట్నంగా అడిగాడంటూ ఓ యువతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘నా ఫ్రెండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనస్థీషియాలో ఫెలోషిప్ చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు జీవిత కష్టం రూ.50 కోట్లను ఎయిమ్స్ టాపర్‌ కట్నంగా అడుగుతున్నాడు. నా ఫ్రెండ్‌కి పెళ్లి కావాల్సిన చెల్లి కూడా ఉంది. నాతో ఫోన్లో గంటల తరబడి ఏడుస్తూనే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. సదరు టాపర్‌పై నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

News October 30, 2024

అవును.. అమిత్‌ షానే ఖలిస్థానీలపై కుట్రచేశారు: కెనడా

image

తమ దేశంలో ఖలిస్థానీలను చంపేందుకు కుట్రలు పన్నింది అమిత్ షా‌నే అని కెనడా తాజాగా ఆరోపించింది. కుట్రలు పన్నింది ఆయనేనా అని వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ‘అవును’ అని జవాబిచ్చినట్టు కెనడా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిస్ పార్లమెంటరీ ప్యానెల్‌కు చెప్పారు. దీనిపై ఎలాంటి వివరాలు, ఆధారాలను మాత్రం ఆయన ఇవ్వలేదు. ఆయన స్టేట్‌మెంట్‌పై భారత హైకమిషన్, విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.

News October 30, 2024

గ్రూప్-4 ఫలితాలు ప్రకటించండి.. అభ్యర్థుల ఆవేదన

image

TG: 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి దాదాపు 2 నెలలు కావొస్తుంది. నెలలు గడుస్తున్నా ఎంపికైన వారి జాబితా ఇవ్వట్లేదని అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఇదే విషయమై టీజీపీఎస్సీ అధికారితో మాట్లాడినా ఇంకా ఎలాంటి ప్రకటన లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా తుది ఫలితాలు ప్రకటించాలని కోరుతున్నారు.

News October 30, 2024

క్రేజీ న్యూస్ చెప్పిన తమన్

image

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. NBK109, గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్లు రానున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా NBK109 బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోంది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తోంది. ఈ రెండు చిత్రాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News October 30, 2024

STOCK MARKET: ఎఫ్ఎంసీజీ, మీడియా, ఐటీ షేర్లు అదుర్స్

image

దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. సెన్సెక్స్ 80,027 (-341), నిఫ్టీ 24,367 (-99) వద్ద ట్రేడవుతున్నాయి. FMCG, మీడియా, IT షేర్లు పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్స్, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. సిప్లా, Dr రెడ్డీస్, సన్ ఫార్మా, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్స్.

News October 30, 2024

ఆర్సీబీకి మళ్లీ కెప్టెన్ కానున్న కోహ్లీ?

image

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ జట్టుకు మళ్లీ కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన జట్టు మేనేజ్‌మెంట్‌కు సమాచారమిచ్చినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. 2022 నుంచి ఆ జట్టుకు డు ప్లెసిస్ కెప్టెన్సీ చేస్తున్నారు. కెప్టెన్లు మారుతున్నా కప్పు కొట్టడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో మరోసారి తానే కెప్టెన్‌గా కప్పుకోసం ట్రై చేయాలని కోహ్లీ భావిస్తున్నట్లు సమాచారం.

News October 30, 2024

బాలీవుడ్ స్టార్‌కు మరోసారి బెదిరింపులు

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు కలకలం రేపాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి సందేశం పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను చంపేస్తామని బెదిరింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు భద్రతను పటిష్ఠం చేశారు.