India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: KCRపై CM రేవంత్ <<14482748>>వ్యాఖ్యలపై<<>> KTR స్పందించారు. ‘నువ్వు చెప్పులు మోసిననాడు ఆయన ఉద్యమానికి ఊపిరిపోశాడు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్ననాడు ఆయన తన పదవిని తృణప్రాయంగా వదిలాడు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిననాడు ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నువ్వు బ్యాగులు మోస్తున్నప్పుడు ఆయన తెలంగాణ భవిష్యత్తుకు ఊపిరి పోశాడు. నువ్వా KCR పేరు తుడిచేది?’ అని KTR ట్వీట్ చేశారు.
AP: నవంబర్ నెల నుంచి రేషన్‌లో నాలుగు రకాల సరుకులు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును సబ్సిడీపై అందిస్తున్నారు. అక్టోబర్‌లో 50శాతం కార్డుదారులకు కందిపప్పు అందించగా NOV నుంచి 100% అందేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మార్కెట్‌లో దీని ధర రూ.170 వరకు ఉండగా రేషన్‌లో రూ.67కే ఇస్తున్నారు. ఇటు బియ్యం వద్దనుకునే వారికి 3KGల జొన్నలు సైతం అందించనున్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారి నిర్దయ కారణంగా ఓ ఉద్యోగి కడుపులోని బిడ్డను కోల్పోయిన ఘటన ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో జరిగింది. ప్రియదర్శిని అనే 7 నెలల గర్భిణికి ఆఫీసులో కడుపు నొప్పి వచ్చింది. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని, కనీసం సెలవు ఇవ్వాలని CDPOను కోరినా పట్టించుకోలేదు. సాయంత్రం ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే బిడ్డ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ వెల్లడించారు.
TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పరీక్షలకు నిర్వహించే ఎప్‌సెట్ పరీక్షను వచ్చే ఏప్రిల్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం. ఏటా మేలో పరీక్ష నిర్వహిస్తుండగా క్లాసులు మొదలవడానికి SEP వరకు సమయం పడుతోంది. దీంతో APRలో ఇంటర్ ఎగ్జామ్స్ ముగిశాక ఎప్‌సెట్ నిర్వహించి జులైలో క్లాసులు మొదలయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్‌పై సైతం కసరత్తు చేస్తోంది.
అక్కినేని నాగ చైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని ఇన్‌స్టాలో శోభిత చేసిన పోస్ట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా? హైదరాబాద్‌లోనే చేసుకుంటారా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
TG: ఫామ్ హౌస్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల నేడు హైదరాబాద్‌లోని మోకిల పీఎస్‌కు వెళ్లనున్నారు. హైకోర్టు ఇచ్చిన రెండు రోజుల గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఆయన న్యాయవాదితో కలిసి మధ్యాహ్నం విచారణకు హాజరవుతారని సమాచారం.
NZతో మూడో టెస్టు జరిగే ముంబై వాంఖడే పిచ్ విషయంలో క్యూరేటర్‌కు టీమ్ ఇండియా ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ‘తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరిగేలా పిచ్‌ను రూపొందించాలని IND కోరింది. గెలిచేందుకు ఇన్నేళ్లూ అనుసరిస్తున్న ఫార్ములానే మూడో టెస్టులో ప్రయోగించనుంది’ అని రాసుకొచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌ను భారత్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.
హీరో కిరణ్ అబ్బవరంకి మరో హీరో విశ్వక్ సేన్ మద్దతుగా నిలిచారు. ఎదిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ట్వీట్ చేశారు. ‘క’ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా నిన్న జరిగిన ‘క’ ప్రీరిలీజ్ ఈవెంట్లో <<14485692>>కిరణ్ చేసిన వ్యాఖ్యలు<<>> వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
సాధారణంగా షుగర్ లెవల్స్ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు 70 నుంచి 99 మధ్య ఉండాలి. ఆహారం తిన్న తర్వాత గంటన్నరకు 140 వరకు ఉండవచ్చు. ఈ లిమిట్ దాటితే డయాబెటిస్‌గా పరిగణిస్తారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే వైట్ రైస్, అరటి, పొటాటో, పుచ్చకాయ, వైట్ బ్రెడ్ లాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
ఎయిమ్స్ టాపర్ రూ. 50 కోట్లు కట్నంగా అడిగాడంటూ ఓ యువతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘నా ఫ్రెండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనస్థీషియాలో ఫెలోషిప్ చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు జీవిత కష్టం రూ.50 కోట్లను ఎయిమ్స్ టాపర్ కట్నంగా అడుగుతున్నాడు. నా ఫ్రెండ్‌కి పెళ్లి కావాల్సిన చెల్లి కూడా ఉంది. నాతో ఫోన్లో గంటల తరబడి ఏడుస్తూనే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. సదరు టాపర్‌పై నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Sorry, no posts matched your criteria.