India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలోని అన్ని ఆలయాల్లో వీఐపీ, ప్రత్యేక చెల్లింపు దర్శనాలు సమానత్వ హక్కు ఉల్లంఘన కిందకు వస్తాయని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాంటి దర్శనాలను రద్దు చేయాలని కోరారు. చట్టంలో వీఐపీ అనేపదానికి నిర్వచనం లేదన్నారు. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిసెంబర్ 10న విచారించనుంది.
AP: ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇవాళ ఉ.10 గంటల నుంచి ప్రారంభం కానుంది. గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద E-KYC చేయించుకోవాలి. పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్‌ను తీసుకుంటే 2 రోజుల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1967కి ఫోన్ చేయాలి. మొదటి సిలిండర్‌ను మార్చి 31 లోపు, రెండోది జులై 31, మూడోది నవంబరు 30లోపు తీసుకోవచ్చు.
AP: TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతులు చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ‘స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారు. స్వామీజీ కోపంతో మీడియా సమక్షంలో అదనపు ఈవోను కించపరుస్తూ మాట్లాడారు’ అని పేర్కొంది.
భారత్-కివీస్ మహిళల జట్ల మధ్య నేడు కీలకమైన చివరి వన్డే జరగనుంది. తొలి వన్డేలో గెలిచిన టీమ్ ఇండియా రెండో మ్యాచ్‌లో బోల్తా పడిన విషయం తెలిసిందే. రెండు వన్డేల్లోనూ భారత బ్యాటర్లు కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం ఆందోళన కలిగించే అంశం. కెప్టెన్ హర్మన్ కౌర్, స్మృతి, జెమీమా, షఫాలీ రాణించాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల తూటాలకు ఓ సైనిక శునకం వీరమరణం పొందింది. ఆక్నూర్‌లో సోమవారం ఆర్మీ కాన్వాయ్‌పై జరిపిన కాల్పుల్లో బుల్లెట్ తగిలి ‘ఫాంథోమ్’ అనే ఆర్మీ డాగ్ మరణించింది. 2020లో జన్మించిన ఈ శునకం 2022లో సైన్యంలో చేరింది. ఈ మూగజీవి ధైర్యం, విశ్వాసం, అంకితభావం ఎనలేనివని సైనిక అధికారులు గుర్తుచేసుకున్నారు.
AP: డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తొలివిడతలో ₹55Crతో 129 MSMEల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ₹5L-₹60L మధ్య ఈ ప్రాజెక్టుల వ్యయం ఉండనుంది. NOV రెండో వారంలో వీటిని ప్రారంభించనుంది. మొత్తం వ్యయంలో 35% రాయితీ ఉండగా, 10% లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం అందిస్తుంది. ఇందుకోసం కేంద్ర పథకాలైన PMFME, PMEGPలను అనుసంధానించింది.
TG: రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ని ప్రభుత్వం నిర్మించనుంది. వచ్చే నెల 6 నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 8-10నెలల్లో భవనాల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 6వేల మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ వర్సిటీకి మేఘా రూ.200 కోట్లు, అదానీ రూ.100 కోట్లు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(Q2)లో భారతీ ఎయిర్‌టెల్ రూ.3,593 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో రూ.1,341 కోట్ల లాభంతో పోలిస్తే 168 శాతం పెరుగుదల నమోదైంది. Q2లో ఆపరేషన్స్ ద్వారా కంపెనీ రెవెన్యూ రూ.41,473 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ నెట్‌వర్క్ విస్తృతిపై మరిన్ని పెట్టుబడులు పెడతామని కంపెనీ ఎండీ గోపాల్ విట్టల్ తెలిపారు.
సీబీఐ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ వెంకటసుబ్బారెడ్డిని నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన పదవిలో ఉంటారని పేర్కొంది. 2007 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఈయన స్వరాష్ట్రం ఏపీ. ప్రస్తుతం షిల్లాంగ్‌గా సీఐడీ డీఐజీగా పనిచేస్తున్నారు. వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
TG: బీఫార్మసీలో 8,845 సీట్లకుగాను తొలి విడత కౌన్సెలింగ్‌లో 8,453 సీట్లు(95 శాతం) భర్తీ అయ్యాయి. ఫార్మాడీలో 1,648 సీట్లకు 1,627, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌లో 122 సీట్లకు 117, బయో టెక్నాలజీలో 181, బయోమెడికల్‌లో 58 సీట్లు భర్తీ అయ్యాయి. అన్ని కోర్సుల్లో కలిపి 418 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. సీట్లు పొందిన వారు రేపటి లోగా ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
Sorry, no posts matched your criteria.