News October 30, 2024

బాలీవుడ్ స్టార్‌కు మరోసారి బెదిరింపులు

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు కలకలం రేపాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి సందేశం పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను చంపేస్తామని బెదిరింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు భద్రతను పటిష్ఠం చేశారు.

News October 30, 2024

అగ్ర ఐటీ కంపెనీల సీఈవోలతో లోకేశ్ భేటీ

image

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ లాస్‌వేగాస్‌లో IT సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో ప్రసంగించారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ల, అమెజాన్ వెబ్ సర్వీసెస్ MD రేచల్, పెప్సికో మాజీ CEO ఇంద్రానూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాతో లోకేశ్ సమావేశమయ్యారు. APలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వివరించారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు.

News October 30, 2024

‘కంగువా’ ఎడిటర్ అనుమానాస్పద మృతి

image

త్వరలో విడుదల కానున్న సూర్య ‘కంగువా’ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్(43) అనుమానాస్పదంగా మృతిచెందారు. కొచ్చిలోని పనంపిల్లినగర్‌లో ఆయన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. ఎలా చనిపోయారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ జావా, వన్, ఉడాల్, ఎగ్జిట్, సౌదీ వెల్లక్కా తదితర మలయాళం సినిమాలకు ఆయన ఎడిటర్‌గా చేశారు. తల్లుమాల సినిమాకు గాను కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు.

News October 30, 2024

మహారాష్ట్రలో సీట్ షేరింగ్ ఇలా..

image

>>మహాయుతి కూటమి
*బీజేపీ- 148
*శివసేన (షిండే)- 80
*ఎన్సీపీ (అజిత్ పవార్)- 52
*ఇతరులు- 6
*ఒక సీట్లో పోటీ చేయట్లేదు. మరో సీట్ MNSకు ఇచ్చినట్లు సమాచారం.
>>మహా వికాస్ అఘాడీ
*కాంగ్రెస్- 101
*శివసేన (ఉద్ధవ్ థాక్రే)- 96
*ఎన్సీపీ (శరద్ పవార్)- 87
*ఎస్పీ- 2
*సీపీఎం- 2

News October 30, 2024

రేపు తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పించనుంది. ఇటు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 59,140 మంది దర్శించుకోగా 16,937 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు లభించింది.

News October 30, 2024

కాళేశ్వరం కమిషన్ గడువు 2 నెలలు పొడిగింపు

image

TG: కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించాలనే ప్రతిపాదనలకు GOVT ఆమోదం తెలిపింది. రేపటితో విచారణ గడువు ముగియనుండగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కీలక అధికారుల్ని విచారించిన కమిషన్, దీపావళి తర్వాత IASలు, మాజీ IASలు, నిర్మాణ సంస్థలను విచారించనుంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

News October 30, 2024

రాష్ట్రంలో 16,347 ఉద్యోగాలు.. 6న నోటిఫికేషన్!

image

AP: రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 3-4 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే విద్యాసంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్ల వివరాలను DEOల నుంచి సేకరించింది. మరోవైపు టెట్ తుది కీ నిన్న విడుదల కాగా, 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.

News October 30, 2024

ఇరాన్ ప్రతీకార దాడి చేస్తే మా స్పందన తీవ్రంగా ఉంటుంది: ఇజ్రాయెల్

image

తమపై ప్రతీకార దాడులకు తెగబడాలనుకుంటే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ హర్జీ హలేవి హెచ్చరించారు. ‘ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి చేయాలని భావిస్తే ఎలా స్పందించాలో మాకు తెలుసు. ఈసారి మేం కొట్టే దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది. యుద్ధం ఇంకా ముగిసిపోలేదు’ అని స్పష్టం చేశారు. తమపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఈ నెల 26న ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది.

News October 30, 2024

భారత్-చైనా సయోధ్యలో మా పాత్ర లేదు: అమెరికా

image

తూర్పు లద్దాక్‌లో సరిహద్దు సమస్యని భారత్, చైనా పరిష్కరించుకున్న సంగతి తెలిసిందే. అమెరికాయే ఈ సయోధ్య కుదిర్చిందని వచ్చిన ఊహాగానాలకు US చెక్ పెట్టింది. అందులో తమ కృషి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. ‘పరిణామాలను మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉద్రిక్తతలు చల్లబడే ఏ నిర్ణయాన్నైనా మేం స్వాగతిస్తాం. సరిహద్దు ఉద్రిక్తతల విషయమేంటని తెలుసుకున్నాం తప్పితే ఇందులో మేం చేసింది ఏం లేదు’ అని స్పష్టం చేసింది.

News October 30, 2024

త్వరలో కొత్త గనుల విధానం: మంత్రి కొల్లు

image

AP: త్వరలో కొత్త గనుల విధానం తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, ఆదాయం పెరిగేలా పాలసీ రూపొందిస్తామన్నారు. అనకాపల్లి(D) భమిడికలొద్ది లేటరైట్ క్వారీలో అక్రమాలపై విచారణను సీఐడీకి అప్పగించినట్లు చెప్పారు. ఉచిత ఇసుకను దుర్వినియోగం చేసేవారిపై పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు. అక్రమ రవాణా అరికట్టేందుకు అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు.