News April 24, 2024

హరీశ్ రావుకు సీఎం రేవంత్ సవాల్

image

TG: మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి <<13102228>>సవాల్<<>> విసిరారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తే గులాబీ పార్టీని రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించారు. తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. కొడంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సభలో సీఎం మాట్లాడారు. KCRను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే తిరిగి ఇటువైపు చూడలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదని దుయ్యబట్టారు.

News April 24, 2024

‘జై హనుమాన్’ నుంచి మరో అప్డేట్

image

హనుమాన్ జయంతి రోజున దర్శకుడు ప్రశాంత్ వర్మ కీలక అప్డేట్ ఇచ్చారు. తాను తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మూవీ ఐమాక్స్ 3డీ వెర్షన్‌లో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా మనమంతా విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంటూ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. అంతకుముందు శ్రీరామనవమి రోజున విడుదల చేసిన పోస్టర్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

News April 24, 2024

శ్రామికులకు వడగాలుల ముప్పు

image

ప్రపంచవ్యాప్తంగా 70% మంది కార్మికులకు వడగాలుల ముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 2000-2020 మధ్య ఈ ముప్పు 34.7% పెరిగిందని తెలిపింది. ‘వడగాలుల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య 2020 నాటికి 26.2 మిలియన్లుగా ఉంది. ఏటా 1.6 బిలియన్ల వర్కర్లు యూవీ రేడియేషన్‌కు గురవుతుండగా, 18,960 మంది స్కిన్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు’ అని పేర్కొంది.

News April 24, 2024

కూటమి ఘనవిజయం సాధించబోతోంది: పవన్

image

APలో తమ కూటమి ఘనవిజయం సాధించబోతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ‘బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి నేతలు సీట్లు త్యాగాలు చేశారు. 30, 40 చోట్ల మా అభ్యర్థులకు సర్ది చెప్పా. వర్మ జనసేనకు మద్దతిచ్చి పిఠాపురంలో సీటు త్యాగం చేశారు. ఆయన్ను భవిష్యత్తులో ఉన్నత స్థానంలో కూర్చోబెడతాం’ అని పిఠాపురంలో నామినేషన్ అనంతరం మాట్లాడారు.

News April 24, 2024

సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలోకి జంప్?

image

నామినేషన్ రిజెక్ట్ కావడంతో బీజేపీ విజయానికి పరోక్షంగా కారణమైన సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ అజ్ఞాతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నారట. ఆయన ఫోన్‌ స్విఛాఫ్‌ ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు నీలేశ్ ఇంటి ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కాగా ప్రతిపాదకుల సంతకాలు సరిగా లేకపోవడంతో నీలేశ్ నామినేషన్ రిజెక్ట్ అయింది.

News April 24, 2024

ఎల్లుండి తెలంగాణకు అమిత్ షా

image

TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. సిద్దిపేటలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేట వెళ్లనున్నారు. ఆ తర్వాత కారులో బహిరంగ సభ ప్రదేశానికి చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన భువనేశ్వర్ వెళ్తారు.

News April 24, 2024

వాలంటీర్ల రాజీనామాలు.. కోర్టు కీలక ఆదేశాలు

image

AP: వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికలు ముగిసే వరకు ఆమోదించవద్దని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ వాదించగా.. రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

News April 24, 2024

వచ్చే ఏడాది సుడిగాడు-2: నరేశ్

image

అల్లరి నరేశ్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘సుడిగాడు’ ఒకటి. స్పూఫ్ కామెడీ సీన్లతో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్‌పై ఓ ఈవెంట్‌లో నరేశ్ కీలక అప్డేట్ ఇచ్చారు. సుడిగాడు-2 కోసం తానే రచయితగా మారి కథ రాస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఆ సినిమాను చూడొచ్చని చెప్పారు.

News April 24, 2024

T20 World Cup సెలక్షన్ గురించి చర్చ

image

T20 World cup విషయంలో ఐపీఎల్‌లో విఫలమవుతున్న వారిని పక్కన పెట్టి, రాణిస్తున్నవారిని తీసుకోవాలన్న చర్చ నడుస్తోంది. విరాట్, రోహిత్, బుమ్రా, సూర్య, గిల్, జైస్వాల్, రాహుల్, రింకూ సెలక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీరితో పాటు పరాగ్, తిలక్, అభిషేక్, శశాంక్, దూబే, డీకే, చాహల్, నటరాజన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. IPLలో పంత్, జడ్డూ, పాండ్య, అర్షదీప్, సిరాజ్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది.

News April 24, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి?

image

TG: ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీటును కాంగ్రెస్ నేత రామసహాయం రఘురాంరెడ్డికి కేటాయించినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు టాక్. ఇప్పటికే ఆయన 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా హీరో వెంకటేశ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రఘురాంరెడ్డి వియ్యంకుడు. వీరిద్దరి కూతుళ్లను రఘురాం కుమారులు వివాహం చేసుకున్నారు.