India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘బెంగాల్ సీఎం మమత సీఏఏపై ముస్లింలలో అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాలకు సీఏఏను ఆపే అధికారం లేదు. మమత పార్టీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయింది. కానీ పదేళ్ల మా ప్రభుత్వంలో ఒక్క అవినీతి మచ్చ లేదు’ అని పేర్కొన్నారు.
తేజా సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు దుల్కర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రితిక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. గౌర హరీశ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నారు.
ఇండియన్ చార్లెస్ శోభరాజ్‌గా పేరొందిన ధన్ రామ్ మిట్టల్(85) గుండెపోటుతో మరణించాడు. హరియాణాకు చెందిన అతడు 1960లో రోహ్‌తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. అక్కడి జడ్జి 2 నెలలు లీవులో ఉండటంతో నకిలీ పత్రాల సాయంతో జడ్జి అవతారమెత్తి 2 వేల మంది నేరస్థులను విడుదల చేయించాడు. తర్వాత ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా కార్లను దొంగతనం చేసి లెక్కలేనన్ని సార్లు జైలుకు వెళ్లాడు.
ఐపీఎల్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించారు. 250 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కారు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత అందుకున్నారు. అగ్ర స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ (257), ఆ తర్వాత రోహిత్ శర్మ (250), విరాట్ కోహ్లీ (245), రవీంద్ర జడేజా (233) ఉన్నారు. కాగా ఈ IPL సీజన్‌లో డీకే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఏకంగా 205 స్ట్రైక్ రేట్‌తో 226 పరుగులు బాదారు.
AP: సీఎం జగన్‌లా తనపై 32 కేసులు లేవని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘జగన్‌లా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేను. ఆయనకు కాపుల ఓట్లు మాత్రమే కావాలి. వారి అభివృద్ధి పట్టదు. నేను ఒక్క కులం కోసం పనిచేయను. రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్డీఏతో కలిశాం. కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ప్రతీ చేనుకు నీరు.. ప్రతీ చేతికి పని.. ఇదే మా నినాదం. ఆక్వా రైతులకు అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు.
ఈ సీజన్‌లో RCB మరో ఓటమి మూటగట్టుకుంది. తాజాగా KKRతో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 223 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు 221 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో కర్ణ్ శర్మ 3సిక్సర్లు కొట్టినా అతడు ఔట్ కావడంతో RCB ఓటమి చెందింది. KKR బౌలర్లలో రస్సెల్ 3, హర్షిత్, నరైన్ తలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఈ ఓటమితో RCB ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి.
ఝార్ఖండ్‌లోని రాంచీలో ఇండియా కూటమి ఈరోజు భారీ ర్యాలీని నిర్వహించింది. జైలుపాలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఝార్ఖండ్ మాజీ సీఎం సోరెన్‌ల కోసం ఖాళీ కుర్చీలను ఈ సందర్భంగా నేతలు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతల భార్యలతో పాటు ఫరూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితర ఇండియా కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 28 పార్టీలు ర్యాలీలో పాలుపంచుకున్నాయి.
గుజరాత్‌కు చెందిన సోలంకి గాడిద పాలతో రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఉద్యోగంలో వచ్చే జీతం కుటుంబ అవసరాలకు సరిపోదని నిర్ణయించుకున్న అతడు 8 నెలల క్రితం ₹22 లక్షల పెట్టుబడితో గాడిదల ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం అతడి వద్ద 42 గాడిదలు ఉండగా నెలకు రూ.3 లక్షల విలువ చేసే పాలను విక్రయిస్తున్నారు. మార్కెట్లో లీటర్ గాడిద పాల ధర ₹5-7 వేల వరకు పలుకుతోందని సోలంకి చెప్పారు. పాల పొడి అయితే కిలో రూ.లక్ష పలుకుతోందట.
ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
PBKS: సామ్ కరన్(C), ప్రభ్‌సిమ్రాన్, రోసోవ్, లివింగ్‌స్టోన్, శశాంక్, జితేష్, అశుతోష్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్, రబాడ, అర్ష్‌దీప్.
GT: సాహా, గిల్(C), మిల్లర్, ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, తెవాటియా, రషీద్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్.
హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 23న హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. 23న ఉదయం 6 గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు వైన్స్‌లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.