News April 21, 2024

అప్పట్లో ఈమె క్రేజే వేరు!

image

SRH మ్యాచ్‌లంటే కావ్యా మారన్ ఫేమస్. అయితే అంతకంటే ముందే హైదరాబాద్ ఫ్రాంచైజీకి గాయత్రి రెడ్డి వల్ల ఫుల్ క్రేజ్ ఉండేది. IPL ప్రారంభ ఎడిషన్‌లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్ కొనుగోలు, ప్లేయర్ల వేలం, జెర్సీ ఇలా ప్రతి విషయంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఆమె ఓనర్‌గా ఉండగానే 2009లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్ టైటిల్ గెలిచింది. ప్రస్తుతం SRH వరుస విజయాలతో ఫ్యాన్స్ గాయత్రి రెడ్డిని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

News April 21, 2024

ఫోన్ పోయిందా? ఈ పోర్టల్ మీ కోసమే

image

కేంద్రం తీసుకొచ్చిన <>‘సంచార్ సాథీ’<<>> పోర్టల్ మొబైల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. దీని ద్వారా అపహరణకు గురైన మొబైల్‌ను ఐఎంఈఐ వివరాలతో వెంటనే బ్లాక్ చేయొచ్చు. అలాగే మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయన్న వివరాలు తెలుసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే వారు దాని పూర్వాపరాలను ఈ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. కాల్స్, మెసేజ్‌ల ద్వారా సైబర్ నేరాలకు యత్నించారని గుర్తిస్తే ఫిర్యాదు చేయొచ్చు.

News April 21, 2024

నర్సాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా రామరాజు

image

AP: నర్సాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుని ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. కాగా ఎంపీ రఘురామకృష్ణ రాజు కోసం ఉండి సీటుని రామరాజు వదులుకున్నారు. అలాగే ప.గో జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని నియమించారు.

News April 21, 2024

న్యాయ రాజధాని అంటే ఇదేనా?: షర్మిల

image

AP: కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్న YCP నేతలు కనీసం మంచినీళ్లు కూడా అందించలేదని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘కర్నూలు న్యాయ రాజధాని అంటే ఇదేనా? 5ఏళ్లలో సీమలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? గండ్రేవుల ప్రాజెక్టు పూర్తైతే కర్నూలుకు నీళ్లు వచ్చేవి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడ?’ అని కర్నూలు పర్యటనలో ఆమె ప్రశ్నించారు.

News April 21, 2024

బెంగళూరుకు డూ ఆర్ డై మ్యాచ్

image

పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా గో గ్రీన్‌ క్యాంపెయిన్‌ను ఆర్సీబీ కొన్నేళ్లుగా చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ్టి మ్యాచ్‌లో ఆ టీమ్ ప్లేయర్లు గ్రీన్ జెర్సీలో బరిలో దిగనున్నారు. ఈ జెర్సీలో ఆర్సీబీ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది. అందులో 4 గెలుపు, 8 ఓటములు ఉన్నాయి. ఈ సీజన్‌లో కేవలం ఒక విజయం సాధించిన బెంగళూరుకు ఇవాళ్టి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది.

News April 21, 2024

మెజార్టీలో రికార్డు సృష్టిస్తారా? 1/2

image

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో 1989 నుంచి ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నారు. వరుసగా 7 సార్లు గెలుస్తూ వస్తున్నా ఆయన మెజార్టీ మాత్రం తగ్గుతూ వస్తోంది. 1989లో తొలిసారిగా పోటీ చేసినప్పుడు 71,607 ఓట్ల మెజార్టీ వచ్చింది. 1994లో 70వేలు, 1999లో 65,687, 2004లో 59,588, 2009లో 46,066, 2014లో 47,121, 2019లో 45,722 ఓట్ల మెజార్టీ లభించింది. ఈసారి భారీ మెజార్టీ లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

మెజార్టీలో రికార్డు సృష్టిస్తారా?2/2

image

AP: YS కుటుంబానికి కంచుకోటైన కడప(D) పులివెందులలో 1978 నుంచి ఆ కుటుంబ సభ్యులే విజయ దుందుభి మోగిస్తున్నారు. ఇక్కడ 2014, 2019 ఎన్నికల్లో CM జగన్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2014లో ప్రత్యర్థి సతీశ్ కుమార్‌పై 75,243 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో 90,110 మెజార్టీ, 50.2 శాతం ఓట్లు పొంది రికార్డు సృష్టించారు. మరి ఈ ఎన్నికల్లో గత మెజార్టీ మార్క్‌ను ఆయన క్రాస్ చేస్తారేమో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

సా.7.15 గంటలకు ‘కల్కి’ నుంచి సాలిడ్ అప్‌డేట్

image

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘కల్కీ 2898 ఏడీ’. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇవాళ సాలిడ్ అప్‌డేట్ ఇవ్వనున్నారు. సాయంత్రం 7.15 గంటలకు స్టార్ స్పోర్ట్స్‌లో ఈ అప్‌డేట్‌ను రివీల్ చేయనున్నారు. ‘అతడెవరో తెలుసుకునే సమయం వచ్చింది’ అని మేకర్స్ షేర్ చేసిన అమితాబ్ బచ్చన్ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News April 21, 2024

చంద్రబాబు గెలిస్తే రాక్షస రాజ్యమే: ముద్రగడ

image

AP: చంద్రబాబు కడుపులో అధికార ఆకలి దహించిపోతోందని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. గత చంద్రబాబు పాలనలో రాక్షస రాజ్యం అనుభవించామని.. కిర్లంపూడిని పాకిస్థాన్ చేశారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఇస్తున్న మోసపు హామీలను నమ్మితే పేదలకు ఆక్సిజన్ కూడా దొరకదని అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలనే ప్రకటిస్తున్న బాబు రాక్షస పాలన మనకు అవసరమా? అని ప్రశ్నించారు.

News April 21, 2024

ఐపీఎల్.. NEXT లెవెల్

image

287, 277, 272, 266.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్లు. ఇవన్నీ ఈ సీజన్‌లోనే నమోదవడం మరో విశేషం. ఇలాంటి స్కోర్లు ఒకప్పుడు వన్డేల్లో మ్యాచ్ విన్నింగ్ టోటల్స్. ఇప్పటికీ కొన్ని మ్యాచుల్లో ఆ స్కోర్లు జట్లకు విజయాన్ని కట్టబెడుతున్నాయి. కానీ ఇప్పుడు T20ల్లో 250+ స్కోర్లు సాధారణమయ్యాయి. 300+ రన్స్ కొట్టడం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. దీంతో మన ఐపీఎల్.. NEXT లెవెల్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.