India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టెన్త్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.INతో పాటు WAY2NEWS యాప్‌లో ఫలితాలను వేగంగా, సులభంగా పొందవచ్చు.
ఎన్నికలకు ఈసారి కాస్త ఎక్కువగా ‘సినీగ్లామర్’ తోడైంది. ఇప్పటికే హేమా మాలిని, కంగనా రనౌత్, రాధికా శరత్ కుమార్, నవనీత్ కౌర్, రచనా బెనర్జీ తదితరులు పోటీ చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ప్రముఖ నటి వర్షా ప్రియదర్శినికి BJD టికెట్ ఇచ్చింది. రాష్ట్రంలో MP, MLA ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బర్చానా MLA అభ్యర్థిగా వర్ష పేరును CM నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రెండు రోజుల క్రితమే ఆమె BJDలో చేరారు.
AP: రాష్ట్రంలో BRS నాయకుడు నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత కొణిజేటి ఆదినారాయణ నామినేషన్ వేశారు. ప్రస్తుతానికి ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో KCRను కలిసి బీఫామ్ అడగాలని నిర్ణయించుకున్నారు. కాగా APలో BRS పోటీపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆ పార్టీ సొంతింటిని చక్కదిద్దుకునే పనిలో పడింది. దీంతో ఏపీపై అంతగా దృష్టి సారించలేదని తెలుస్తోంది.
AP: వేసవి సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ ‘సెలవుల్లో సరదాగా-2024’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను.. పఠనాశక్తిని పెంపొందించడానికి టీచర్లు, HMలు ‘వుయ్ లవ్ రీడింగ్’ పోటీలు నిర్వహించాలని ఆదేశించింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, స్థానిక కమ్యూనిటీల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించింది.
TG: CM రేవంత్ రెడ్డి BJPలో చేరతారంటూ కొద్దిరోజులుగా BRS జోరుగా ప్రచారం చేస్తోంది. KCR, KTR సహా ఆ పార్టీ నేతలంతా ఇదే చెబుతున్నారు. BJP నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మెజార్టీ సీట్లతో అధికారంలోకి వచ్చి, CM పదవి చేపట్టిన వ్యక్తి మరో పార్టీలోకి వెళ్లడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది కేవలం INCపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చేందుకు BRS అనుసరిస్తున్న స్ట్రాటజీ అని హస్తం నేతలు మండిపడుతున్నారు.
AP: ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు కుళ్లు మెదడుకు ఎప్పుడైనా వచ్చిందా అని CM జగన్ మండిపడ్డారు. ‘ప్రత్యేక హోదా తెస్తానని మాట తప్పాడు. ఇప్పుడు ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అనేలా హామీలిస్తున్నాడు. అక్కా, చెల్లి నమ్ముతారా? మా పాలనలో 31లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. అమ్మఒడి, చేయూత, చేదోడు లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా?. ఇంటింటికీ పౌర సేవలందేలా మహా వ్యవస్థను ఏర్పాటు చేశాం’ అని చెప్పారు.
AP: ఎన్నికల నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు గూడూరు నియోజకవర్గంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన బిడ్డతో ఆయనను కలిసేందుకు వచ్చారు. బాబు ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టారు. ఈరోజు తన పుట్టినరోజు కావడంతో ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన CBN.. ‘చూడండి నన్ను విష్ చేయడానికి ఎవరొచ్చారో!’ అంటూ #Blessed హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.
మరోసారి తనకు టీమ్ ఇండియా తరఫున ఆడాలని ఉందని ఆర్సీబీ ఫినిషర్ దినేశ్ కార్తీక్ అన్నారు. ‘నా కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నా. 100 శాతం సిద్ధంగా ఉన్నా. టీ20 ప్రపంచకప్‌లో నా సేవలు అందించాలని అనుకుంటున్నా. జట్టు గెలుపు కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో డీకే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఏకంగా 205 స్ట్రైక్ రేట్‌తో 226 పరుగులు బాదారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నెల 21న ఓ సాలిడ్ గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
AP: తమ పార్టీ అధికారంలోకి రాగానే గులకరాయి డ్రామా, గూడుపుఠాణిని బయటపెడతామని TDP నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఈ డ్రామాకు దర్శకత్వం వహించిన వారికి తగిన రీతిలో సన్మానం చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో బోండా ఉమను కావాలనే వేధిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ సీపీ తీరుపై ఈసీ విచారణకు ఆదేశించాలన్నారు. CM జగన్ ప్లాన్ ప్రకారమే రాయి దాడి చేయించుకున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.