India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తాయని సీఎం జగన్ అనకాపల్లి ‘మేమంతా సిద్ధం’ సభలో వెల్లడించారు. ‘మీ బిడ్డ ప్రతి ఇంటికి మంచి చేశాడు. అబద్ధాలు, మోసాలు, కుట్రదారులను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమా? కూటమి కుట్రదారులను ఓడించేందుకు సిద్ధమా? మన సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉక్రోశం, కడుపుమంటతో మనపై దాడులు చేస్తున్నారు’ అని ఆరోపించారు.
TG: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం TSRJC పరీక్ష జరగనుంది. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు ఈ ఎగ్జామ్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్లకు 73,527 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. https://tsrjdc.cgg.gov.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, KRMR, భద్రాద్రి, KMM, MHBD, WGL, హనుమకొండ, VKB, SRD, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
TG: తన కుమార్తె కవితను జైలు నుంచి విడిపించుకునేందుకు ప్రధాని మోదీతో KCR బేరసారాలు ఆడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే BRS, BJP ఓర్వలేకపోతున్నాయి. కరీంనగర్ ఎంపీ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌ను బలిపశువు చేశారు. బండి సంజయ్ హిందువుల పేరు మీద ఓట్ల రాజకీయం చేయడం తప్ప ఏమీ లేదు’ అని ఆయన మండిపడ్డారు.
రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే స్థానాల్లో ఏలూరు ఒకటి. దేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటైన కొల్లేరు ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ నుంచి 1989లో గెలిచారు. తొలినాళ్లలో ఏలూరు కమ్యూనిస్టుల కోటగా ఉంది. ఈ స్థానంలో కాంగ్రెస్ 8సార్లు, TDP 5సార్లు, YCP ఒకసారి నెగ్గాయి. ఈసారి సునీల్ యాదవ్(YCP), పుట్టా మహేశ్ యాదవ్(TDP) ఈ ప్రాంతంపై పట్టు కోసం యత్నిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
AP: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో బొండా ఉమను ఇరికించేలా కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ పోలీసుల తీరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు.
దుకాణాలు తాము అమ్మిన వస్తువుల ప్యాకింగ్‌కు లేదా క్యారీ బ్యాగ్ ఛార్జీలను అదనంగా వసూలు చేయకూడదు. కానీ HYDలోని ఐకియా క్యారీ బ్యాగ్‌కు ఓ కస్టమర్ నుంచి రూ.20 వసూలు చేసింది. అతడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా.. ఐకియాకు రూ.1000 ఫైన్ పడింది. ఆ మొత్తాన్ని కస్టమర్‌కు 45 రోజుల్లోపు చెల్లించకపోతే రూ.5వేలు ప్లస్ ఏడాదికి 24% వడ్డీ లెక్కన ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
హెల్త్ ఇన్సూరెన్స్‌పై బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు 65 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి తొలగించింది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా బీమా తీసుకోవచ్చని, ఇది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు IRDAI తెలిపింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్‌ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు, మారటోరియాన్ని 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది.
AP: మహిళా సాధికారత కోసమే సూపర్-6 పథకాలు తీసుకువస్తున్నట్లు నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం తపిస్తుంటారు. వయసు పెరుగుతున్నా చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. లోకేశ్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు’ అని ఆమె పేర్కొన్నారు.
TG: వికసిత్ భారత్ తరహాలోనే వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, BRSకు భవిష్యత్తు లేదన్నారు. సీఎం రేవంత్ పాలన ఓటమికి దారులు వెతుక్కుంటున్నట్లు ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.