News April 20, 2024

రేపటి నుంచి UGC-NET దరఖాస్తుల స్వీకరణ!

image

UGC-NET జూన్ 2024 దరఖాస్తులను రేపటి నుంచి స్వీకరించే అవకాశం ఉందని UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 4 ఏళ్ల/8 సెమిస్టర్ల డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం ఫైనలియర్/ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్ల డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో Ph.D చేయవచ్చని తెలిపారు.

News April 19, 2024

FLASH: చెన్నై ఓటమి.. లక్నో సూపర్ విక్టరీ

image

CSKతో జరిగిన మ్యాచ్‌లో LSG 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. కేఎల్ రాహుల్ 82, డికాక్ 54 రాణించారు. ముస్తాఫిజుర్, పతిరణ చెరో వికెట్ తీశారు. చెన్నై బ్యాటర్లలో జడేజా 57, రహానే 36, అలీ 30, ధోనీ 28 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, స్టొయినిస్, బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.

News April 19, 2024

రోహిత్‌శర్మ గురించి నేనలా అనలేదు: ప్రీతీ జింటా

image

రోహిత్ శర్మను ఎంత ఖర్చు చేసైనా పంజాబ్ టీమ్ కెప్టెన్‌గా తీసుకొస్తానని తాను చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఫేక్ అని ఆ జట్టు ఓనర్ ప్రీతీ జింటా స్పష్టం చేశారు. ‘నేను రోహిత్‌కు బిగ్ ఫ్యాన్. అతన్ని చాలా గౌరవిస్తా. కానీ అతని గురించి నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు. మా జట్టు కెప్టెన్ ధవన్ అంటే కూడా నాకు చాలా గౌరవం. ప్రస్తుతం మా టీమ్ బాగుంది. నా దృష్టంతా ఈ సీజన్ గెలవడంపైనే ఉంది’ అని ఆమె ట్వీట్ చేశారు.

News April 19, 2024

SHOCKING: ఒక వ్యక్తిలో 613 రోజులపాటు కొవిడ్

image

నెదర్లాండ్స్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు 613 రోజులపాటు కొవిడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడ్డాడు. ఒక వ్యక్తి శరీరంలో అత్యధిక కాలం వైరస్ ఉన్న ఘటన ఇదేనని పరిశోధకులు వెల్లడించారు. గత ఏడాది చనిపోయే సమయానికి అతనిలో దాదాపు 50 సార్లు వైరస్ మ్యుటేషన్ అయ్యిందట. బలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల శరీరాలను వైరస్‌లు ఆవాసాలుగా చేసుకుని పరివర్తన చెందుతాయన్నారు. అలాంటివారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News April 19, 2024

ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్: కిరణ్ రావు

image

పెళ్లైన తొలి ఐదేళ్లలో తనకు ఎన్నో సార్లు గర్భస్రావమైందని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ భార్య, దర్శకనిర్మాత కిరణ్ రావు తెలిపారు. ‘అప్పట్లో పిల్లలు కావాలని చాలా ప్రయత్నించా. కానీ అబార్షన్ల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. పిల్లలను పొందడం ఇంత కష్టమా అని అప్పుడు అనిపించింది’ అని ఆమె చెప్పారు. కాగా ఆమిర్-కిరణ్‌కు ఐవీఎఫ్-సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించారు.

News April 19, 2024

లైంగిక జీవితానికి ముప్పుగా ఉప్పు?

image

ఉప్పు అధికంగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. దీనిని తినడం వల్ల రక్తనాళాలపై అధిక ఒత్తిడి పడి హైపర్ టెన్షన్, బీపీ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలతో బాధపడేవారు లైంగిక చర్యలో సరిగ్గా పాల్గొనలేరు. దీనిని అధికంగా తినడం వల్ల స్త్రీలలో కూడా లైంగిక కోరికలు తగ్గుతున్నట్లు వెల్లడైంది. అధికంగా తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.

News April 19, 2024

YELLOW ALERT: మూడు రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రంలో అక్కడక్కడా భారీ <<13084833>>వర్షాలు<<>> కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు మోస్తరు వానలు కొనసాగుతాయని IMD వెల్లడించింది. వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

News April 19, 2024

వేసవి రద్దీ.. రైల్వే 9,111 అదనపు ట్రిప్పులు

image

వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. గత ఏడాది 6,369 అదనపు ట్రిప్పులు నడపగా, ఈసారి ఆ సంఖ్యను 9,111కు పెంచినట్లు పేర్కొంది. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంది. పశ్చిమ రైల్వే అత్యధికంగా 1,878 ట్రిప్పులు, దక్షిణ మధ్య రైల్వే 1,012 ట్రిప్పులు నడపనుంది.

News April 19, 2024

‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్.. రిలీజ్ ఎప్పుడంటే?

image

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘ప్రేమలు’ చిత్రానికి త్వరలో సీక్వెల్ రూపొందనుంది. 2025లో ప్రేమలు-2ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించిన ‘ప్రేమలు’ మూవీలో నస్లేన్ కె.గఫూర్, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు. రూ.3కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మలయాళ మూవీ రూ.85కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తెలుగులోనూ విడుదలై ఆకట్టుకుంది.

News April 19, 2024

రేవంత్ బీజేపీ ఏజెంట్: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మైనారిటీకీ కూడా మంత్రి పదవి ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘మంత్రి పదవి ఇచ్చేందుకు ఒక్క మైనారిటీ నాయకుడు కూడా మీకు కనిపించలేదా? మైనారిటీలపై కాంగ్రెస్ ప్రేమ ఇదేనా? తెలంగాణలో మైనారిటీ మంత్రి లేకుండా ప్రభుత్వం నడవడం ఇదే తొలిసారి. రేవంత్ బీజేపీ ఏజెంట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయి’ అని ఆయన ఆరోపించారు.