India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ బేబీ ఫుడ్ ప్రొడక్టుల కంపెనీ Nestle భారతదేశంలో విక్రయించే ప్రతి సెరెలాక్‌లో 3గ్రాముల చక్కెర అదనంగా వాడుతున్నట్లు తేలింది. అభివృద్ధి చెందిన UK, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో షుగర్ ఫ్రీగా తయారు చేస్తూ.. మిగతా దేశాల్లో పిల్లలకు అందించే పాలు, తృణధాన్యాల ఉత్పత్తుల్లో అదనంగా షుగర్, తేనె జోడిస్తున్నట్లు publiceye పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
TG: 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న DSC పరీక్ష కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నట్లు టీశాట్ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 9 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్షప్రసారాలు ఉంటాయంది. గణితం, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులపై టెలికాస్ట్ అయ్యే లైవ్ ప్రోగ్రామ్స్.. మరుసటి రోజు విద్య ఛానల్‌లో సాయంత్రం 6 గంటలకు రీటెలికాస్ట్ అవుతాయని వెల్లడించింది.
మధ్యప్రదేశ్‌లో చింద్వారా లోక్‌సభ స్థానాన్ని BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ Ex CM కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ పోటీ చేస్తున్నారు. 2019లో ఆయన 37,356 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నకుల్‌ను ఈసారి ఓడించి గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన చింద్వారాను కైవసం చేసుకోవాలని BJP వ్యూహాలు పన్నుతోంది. ఈ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని నాథ్‌లు తీవ్రంగా యత్నిస్తున్నారు.
CSK ఆల్‌రౌండర్ శివమ్ దూబే T20 WC ఆడే భారత జట్టులో ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని ‘ఇంపాక్ట్’ రోల్ కలవరపెడుతోంది. 6మ్యాచుల్లో 242రన్స్‌తో CSK టాప్ స్కోరర్‌గా ఉన్న దూబే పేస్ బౌలింగ్ చేయగలరు. అయితే.. అతడిని ఇంపాక్ట్ ప్లేయర్ కింద పంపిస్తూ కేవలం బ్యాటింగ్‌కే పరిమితం చేస్తున్నారు. దీంతో ఆల్‌రౌండర్ల కోటాలో T20WC ఆడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని చెర్నివ్ సిటీపై రష్యా 3 మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్‌పై మిస్సైల్స్ పడటంతో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 61 మంది గాయపడ్డారు.
AP: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ కోసం నేటి నుంచి ఈ నెల 24వరకు ఫీజు చెల్లించవచ్చు. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు కూడా ఇంప్రూవ్‌మెంట్, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. పరీక్ష ఫీజు రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
TG: BRS చీఫ్ KCR ఇవాళ లోక్‌సభ అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. వారికి బీ-ఫారాలతో పాటు ప్రచార ఖర్చు కోసం రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు. అనంతరం ప్రచారం, వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించిన KCR.. రూట్ మ్యాప్‌పై నేతలతో చర్చించనున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు MLAలు, MLCలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
UPSC విజేతల విజయగాథలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. కర్ణాటకలోని శ్రీరాంపురా పోలీస్ స్టేషన్‌లో SIగా పని చేస్తున్న శాంతప్ప కురుబరా 8వ ప్రయత్నంలో 644వ ర్యాంక్ సాధించారు. బెంగళూరులో వలస కార్మికుల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేవారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇచ్చేవారు. ఒకసారి తన తల్లి టాయ్‌లెట్ లేక ఇబ్బంది పడటంతో.. మొబైల్ టాయిలెట్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.
ఇవాళ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బర్త్ డే. ఓపెనర్, కీపర్‌గా జట్టు గెలుపుకోసం కీలక ఇన్నింగ్స్‌లు ఆడే ఆయనకు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ తనకు ఏ బాధ్యత అప్పగించినా అదరగొడతారని ప్రశంసిస్తున్నారు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీలు చేసిన తొలి ఆసియా ప్లేయర్ రాహుల్ కావడం విశేషం. ప్రస్తుతం జట్టులో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఉన్నారు.
హైదరాబాద్‌లో BRS పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్ మాజీ MLA బేతి సుభాష్ రెడ్డి BRSకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్, ఇప్పుడు మల్కాజ్‌గిరి MP టికెట్లు తనకు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన BJPలో చేరాలని నిర్ణయించుకున్నారు. ‘నాపై ఎలాంటి మచ్చ లేకున్నా అవకాశవాదులకే KCR టికెట్లు ఇచ్చారు. బీజేపీలో ఈటల రాజేందర్‌కు మద్దతిస్తా. నా రాజీనామాను ఆమోదించాలి’ అని సుభాష్ రెడ్డి కోరారు.
Sorry, no posts matched your criteria.