News April 18, 2024

బస్సు యాత్ర చేయాలని KCR నిర్ణయం

image

TG: BRS చీఫ్ KCR ఇవాళ లోక్‌సభ అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. వారికి బీ-ఫారాలతో పాటు ప్రచార ఖర్చు కోసం రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు. అనంతరం ప్రచారం, వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించిన KCR.. రూట్ మ్యాప్‌పై నేతలతో చర్చించనున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు MLAలు, MLCలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

News April 18, 2024

‘మీలాంటి అధికారులే దేశానికి కావాలి’

image

UPSC విజేతల విజయగాథలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. కర్ణాటకలోని శ్రీరాంపురా పోలీస్ స్టేషన్‌లో SIగా పని చేస్తున్న శాంతప్ప కురుబరా 8వ ప్రయత్నంలో 644వ ర్యాంక్ సాధించారు. బెంగళూరులో వలస కార్మికుల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేవారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇచ్చేవారు. ఒకసారి తన తల్లి టాయ్‌లెట్ లేక ఇబ్బంది పడటంతో.. మొబైల్ టాయిలెట్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.

News April 18, 2024

HAPPY BIRTHDAY KL రాహుల్

image

ఇవాళ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బర్త్ డే. ఓపెనర్‌, కీపర్‌గా జట్టు గెలుపుకోసం కీలక ఇన్నింగ్స్‌లు ఆడే ఆయనకు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ తనకు ఏ బాధ్యత అప్పగించినా అదరగొడతారని ప్రశంసిస్తున్నారు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీలు చేసిన తొలి ఆసియా ప్లేయర్ రాహుల్ కావడం విశేషం. ప్రస్తుతం జట్టులో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఉన్నారు.

News April 18, 2024

BRSకు మాజీ ఎమ్మెల్యే రాజీనామా

image

హైదరాబాద్‌లో BRS పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్ మాజీ MLA బేతి సుభాష్ రెడ్డి BRSకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్, ఇప్పుడు మల్కాజ్‌గిరి MP టికెట్లు తనకు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన BJPలో చేరాలని నిర్ణయించుకున్నారు. ‘నాపై ఎలాంటి మచ్చ లేకున్నా అవకాశవాదులకే KCR టికెట్లు ఇచ్చారు. బీజేపీలో ఈటల రాజేందర్‌కు మద్దతిస్తా. నా రాజీనామాను ఆమోదించాలి’ అని సుభాష్ రెడ్డి కోరారు.

News April 18, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో స్కూళ్లు పున:ప్రారంభం రోజైన జూన్ 12న నిర్వహించాలని ఆదేశించింది. ఏప్రిల్ 23న విద్యార్థులందరికీ రిపోర్టు కార్డులు పంపిణీ చేయాలని, సమ్మెటివ్ పరీక్షల్లో సాధించిన మార్కులను పోర్టల్‌లో నమోదు చేయాలంది.

News April 18, 2024

PV, మన్మోహన్ తెచ్చిన సంస్కరణలు ఏంటి?1/2

image

సుప్రీంకోర్టులో తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా PV నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. 1991లో ప్రధాని PV నేతృత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని కొనియాడింది.
➯1991 నాటికి దేశంలో ప్రతీ నిర్ణయం GOVT చేతుల్లోనే ఉండేది. లైసెన్స్ రాజ్ అనే ఈ విధానాన్ని PV ప్రభుత్వం రద్దు చేసింది.

News April 18, 2024

తమిళనాడు ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు..

image

➥నీట్ పరీక్ష తమకొద్దని, వైద్య సీట్ల భర్తీని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికే వదిలేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ నడుస్తోంది.
➥కచ్చతవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించి TNకి ద్రోహం చేశారని కాంగ్రెస్, DMKపై BJP విమర్శలు గుప్పిస్తోంది.
➥రాష్ట్రానికి నిధులివ్వడం లేదని కేంద్రంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు.
➥కావేరి జలాలు, మద్దతు ధర, రుణమాఫీపై BJP, DMKపై రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనేది విశ్లేషకుల మాట.

News April 18, 2024

పాపం ధవన్.. కొడుకును తల్చుకుంటూ..

image

క్రికెటర్ శిఖర్ ధవన్ ఇన్‌స్టాలో కుమారుడు జోరావర్‌ను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘నువ్వెప్పటికీ నాతోనే ఉంటావ్. మై బాయ్’ అంటూ జెర్సీ షేర్ చేశారు. భార్య అయేషా క్రూరత్వం కారణంగా ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఆమె ఆస్ట్రేలియన్ సిటిజన్ కావడంతో కొడుకుతో పాటు అక్కడికి వెళ్లిపోయారు. వీడియో కాల్‌కు సైతం ఆమె నిరాకరించడంతో కొడుకును తలుచుకుంటూ ధవన్ దీనంగా ఉంటున్నారు.

News April 18, 2024

నేడు సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ

image

సుప్రీంకోర్టులో ఇవాళ ఓటుకు నోటు కేసుపై విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై ధర్మాసనం వాదనలు విననుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఎరవేశారన్న కేసులో చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది.

News April 18, 2024

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడికి బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెల 23న ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలవుతున్న నేపథ్యంలో 23 లేదా 24వ తేదీలోగా ఇంటర్ ఫలితాలను బోర్డు వెల్లడించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.