News April 17, 2024

మే 20న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్?

image

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఉండనున్నట్లు సమాచారం. ఆ రోజు వార్ 2 మూవీ నుంచి ఫస్ట్ లుక్, దేవర నుంచి ఫస్ట్ సింగిల్, అలాగే ప్రశాంత్ నీల్ మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ రానున్నట్లు టాక్. ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాల షూటింగ్‌లతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు.

News April 17, 2024

నెల్లూరులో పెద్దారెడ్ల బిగ్ ఫైట్

image

నెల్లూరు లోక్‌సభ స్థానం TDP, YCPలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఆర్థిక, అంగ బలం పుష్కలంగా ఉన్న విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య ఫైట్‌ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మొన్నటిదాకా YCPకి జిల్లా పెద్దగా ఉన్న వేమిరెడ్డి TDPలో చేరి ప్రత్యర్థిగా మారారు. గతంలో కాంగ్రెస్ కంచుకోటైన ఈ ప్రాంతంలో 2012 నుంచి YCP గెలుస్తోంది. ఇక్కడ పైచేయి సాధించాలని ఇద్దరు నేతలూ తీవ్రంగా యత్నిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 17, 2024

హారర్ కామెడీతో రానున్న బెల్లంకొండ శ్రీనివాస్

image

శ్రీరామ నవమి సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న 11వ సినిమాను మేకర్స్ అనౌన్స్ చేశారు. డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ‘ఈ దివ్యమైన శ్రీరామ నవమి సందర్భంగా వెలుగు vs చీకటి మధ్య సాగే యుద్ధం ఒక కొత్త రూపం తీసుకుంటుంది. కొత్త-యుగం హారర్ మిస్టరీని #BSS11లో చూపించనున్నాం’ అని సాయి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఈ మూవీకి అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News April 17, 2024

ముద్దులు పెట్టాడు.. బుగ్గలు నిమిరాడు: చంద్రబాబు

image

AP: అధికారం కోసం జగన్ ముద్దులు పెట్టాడు.. బుగ్గలు నిమిరాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దుడే గుద్దుడు అని విమర్శించారు. ‘జగన్ మళ్లీ మరో నాటకం ఆడుతున్నారు. గులక రాయి అంటూ డ్రామాలాడుతున్నారు. రాష్ట్రంలో జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం. సర్వేలన్నీ కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News April 17, 2024

T20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదేనా?

image

టీ20 వరల్డ్‌కప్‌కు మొత్తం 20 మంది సభ్యులను పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 15 మంది స్క్వాడ్, 5 మంది స్టాండ్ బై ప్లేయర్లు ఉండనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలక్ట్ చేసినట్లు టాక్. జట్టు: రోహిత్, కోహ్లీ, జైస్వాల్, గిల్, సూర్య, హార్దిక్, పంత్, రింకూ, కేఎల్ రాహుల్, శాంసన్, జడేజా, దూబే, అక్షర్, కుల్దీప్, చాహల్, బిష్ణోయ్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్, అవేశ్.

News April 17, 2024

చెట్లను హగ్ చేసుకుంటారా.. రూ. 1500 కట్టండి!

image

బెంగళూరులో ఓ సంస్థ కొత్త వ్యాపారం విమర్శలకు దారి తీస్తోంది. తమ వద్ద రూ. 1500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చెట్లను హగ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని సదరు సంస్థ ప్రకటించింది. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ప్రకృతిని ప్రేమించేలా చేయడం ఓకేగానీ ఇలా దాన్ని సొమ్మ చేసుకోవడమేంటంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిలువు దోపిడీ స్కీమ్స్‌ను నమ్మొద్దంటూ సూచిస్తున్నారు.

News April 17, 2024

IPL: టాస్ గెలిచిన ఢిల్లీ

image

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

గుజరాత్: గిల్, సాహా, సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్

ఢిల్లీ: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్, స్టబ్స్, హోప్, పంత్, అక్షర్, సుమిత్, కుల్దీప్, ఇషాంత్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్

News April 17, 2024

‘మిస్టర్ బచ్చన్’ 30 రోజుల షెడ్యూల్ పూర్తి

image

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా లక్నోలో 30 రోజుల పాటు సాగిన లాంగ్ షూటింగ్ షెడ్యూల్ నేటితో పూర్తయినట్లు డైరెక్టర్ ట్వీట్ చేశారు. షూటింగ్‌లో చెమట చిందించిన హీరో రవితేజ, విలన్ జగపతిబాబుకు ఆయన థాంక్స్ చెప్పారు. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News April 17, 2024

వైసీపీ నేతలను తన్ని తరిమేయండి: పవన్

image

AP: వైసీపీ నేతలను తన్ని తరిమేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘మా కులాల నేతలతోనే మమ్మల్ని తిట్టిస్తున్నారు. మాలో మేమే కొట్టుకునేటట్లు చేస్తున్నారు. వైసీపీ పాలనలోనే బాబు, లోకేశ్‌పై కేసులు ఎక్కువగా పెట్టారు. ఓడిపోతామన్న బాధలోనే జగన్ కోపంతో ఉన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు తగిన శిక్ష విధిస్తాం’ అని ఆయన హెచ్చరించారు.

News April 17, 2024

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్

image

ఉద్యోగ భవిష్య నిధి నుంచి నగదు ఉపసంహరించుకోవడంలో ఈపీఎఫ్‌వో కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటోక్లెయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా, ఆపరేషన్‌ చేయించుకున్నా ఈ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ప్యారాగ్రాఫ్ 68జే ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖాతాదారు ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండానే ఈ నగదుని పొందొచ్చు.