News April 17, 2024

నరైన్ అద్భుత ప్రదర్శనలు.. కానీ..

image

IPL: కేకేఆర్ తరఫున సునీల్ నరైన్ అద్భుత ప్రదర్శన చేసిన మ్యాచుల్లో ఆ జట్టు ఓటమి పాలవుతోంది. 2012లో నరైన్ ఐదు వికెట్లు తీసిన మ్యాచులో, 2013లో హ్యాట్రిక్ తీసిన మ్యాచులో, నిన్న సెంచరీ చేసిన మ్యాచులోనూ ఓడిపోయింది. కాగా, బౌలర్ అయిన నరైన్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో మేటి బ్యాటర్ల సరసన నిలుస్తున్నారు.

News April 17, 2024

మాదిగలకు అన్యాయం.. రేపు దీక్ష చేస్తా: మోత్కుపల్లి

image

మాదిగలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తోందని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ‘మా జాతి హక్కులు మాకు ఇవ్వడం లేదు. మందకృష్ణ మాట్లాడిన దాంట్లో తప్పులేదు. కడియం శ్రీహరిది ఏ కులమో ఆయనకే తెలీదు. సీఎం రేవంత్‌ ఇప్పటి వరకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. మాదిగలం అనే మా మీద సీఎం చిన్నచూపు. ఎవరికి కాంగ్రెస్ నుంచి మారే ఉద్దేశం లేదు. మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై రేపు దీక్ష చేస్తా’ అని తెలిపారు.

News April 17, 2024

RCB 11 మంది బ్యాటర్లతో ఆడాలి: మాజీ క్రికెటర్

image

ఇకపై ఆర్సీబీ గెలవాలంటే 11 మంది బ్యాటర్లతో ఆడాల్సిందేనని భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ‘ఇప్పుడున్న బౌలర్లందరూ ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. అందుకే అందరు బ్యాటర్లు బరిలోకి దిగాలి. విల్ జాక్స్, క్రిస్ గ్రీన్, విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ బౌలింగ్ చేయాలి. ప్రత్యర్థి ఎన్ని పరుగులు చేసినా వీరు ఛేజ్ చేయగలరు. ప్రస్తుతం కోహ్లీని చూస్తే బాధేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 17, 2024

అలా చేస్తే బీజేపీకి 180 సీట్లు కూడా రావు: ప్రియాంక

image

ఎన్నికల్లో టాంపరింగ్ జరగకపోతే BJP 180 సీట్లు కూడా సాధించలేదని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. ‘తమకు 400 సీట్లు వస్తాయని BJP నేతలు ఎలా చెబుతున్నారు? వారేమైనా జ్యోతిషులా? ఎన్నికల్లో ఏదో చేస్తున్నారు కాబట్టే వారు అంత ధీమాగా మాట్లాడుతున్నారు. ఇక దేశంలోని నిరుద్యోగం, పేదరికంపై బీజేపీ నేతలు మాట్లాడరు. వారెప్పుడూ వాటి నుంచి ప్రజల మైండ్‌ను డైవర్ట్ చేస్తారు’ అని ప్రియాంక మండిపడ్డారు.

News April 17, 2024

TVల్లోకి వచ్చేస్తోన్న ‘హనుమాన్’

image

తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

News April 17, 2024

ఎలక్షన్ డిపాజిట్ల సంగతేంటి? 1/3

image

ఎన్నికల సమయంలో సరదాగా వేసే నామినేషన్లను నిలువరించేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల డిపాజిట్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రజాప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 34,1(ఎ) దీనికి సంబంధించిన నిబంధనలు తెలియజేస్తుంది. దీని ప్రకారం పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే వ్యక్తి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.10వేలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకైతే రూ.15వేలు డిపాజిట్ చేయాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 17, 2024

ఎలక్షన్ డిపాజిట్ల సంగతేంటి? 2/3

image

✒అభ్యర్థికి 16.66% లేదా ఆరో వంతు ఓట్లు రాకపోతే అతను జమ చేసిన డిపాజిట్ నగదు తిరిగి ఇవ్వరు.
✒అభ్యర్థి గెలిచినప్పుడో, ఆరో వంతు ఓట్లు వస్తేనో లేదా నిర్దేశిత సమయం కంటే ముందే నామినేషన్ ఉపసంహరించుకుంటే డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు.
✒ఇందులో SC, STలకు 50% రాయితీ ✒తొలి ఎన్నికల్లో(1951) ఎంపీ అభ్యర్థులకు రూ.500, MLA అభ్యర్థులకు రూ.100గా ఉండేది. 2009లో EC దీనిని పెంచింది
<<-se>>#ELECTIONS2024<<>>

News April 17, 2024

71 వేల మంది డిపాజిట్లు గల్లంతు! 3/3

image

➬ఈసీ డేటా ప్రకారం 1951 నుంచి 2019 వరకు 91,160 మందిలో 71,245(78 శాతం) మంది డిపాజిట్లు కోల్పోయారు.
➬1996లో అత్యధికంగా 13,952 మంది అభ్యర్థుల్లో 12,688(91%) మంది డిపాజిట్లు కోల్పోయారు. 1957 ఎన్నికల్లో అత్యల్పంగా 130 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.
➬2019లో 670 మంది డిపాజిట్లు కోల్పోగా.. 3,443 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 3,431 మందికి ఆరో వంతు ఓట్లు కూడా రాకపోవడంతో కట్టిన నగదును పోగొట్టుకున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 17, 2024

కోర్టులో బెంచ్ క్లర్క్.. ఇప్పుడు సివిల్స్ ర్యాంకర్!

image

సివిల్స్-2023 ఫలితాల్లో మొదటి 100 ర్యాంకులు సాధించిన వారిని నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. అయితే, మొదటి ర్యాంకు కాకుండా చివరి ర్యాంకు వచ్చిన అభ్యర్థి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. బిహార్‌లోని షేక్‌పురా జిల్లా కోర్టులో బెంచ్ క్లర్క్‌గా పనిచేసే మహేశ్ కుమార్.. UPSC ఫలితాల్లో 1016వ ర్యాంకును సాధించారు. ఆశయ సాధనకు వయసుతో సంబంధం లేదని, బలమైన సంకల్పం ఉంటే చాలని ఆయన్ను అభినందిస్తున్నారు.

News April 17, 2024

‘తండేల్’ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మత్స్యకారుడు గణగల్ల రామారావు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు టాక్.