India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 37 ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, CPT, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 18-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు కాగా.. ఎంపికైన వారికి నెలకు రూ.48,000 నుంచి రూ.1.37 లక్షలు వేతనంగా చెల్లిస్తారు. అప్లై చేసేందుకు ఇక్కడ <
TG: దేశంలో ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టాన్ని మారుస్తామన్నారు. ప్రధాని మోదీ రామదూతగా మారి అయోధ్య మందిరాన్ని నిర్మించారని కొనియాడారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామనవమి వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
భద్రాద్రిలో శ్రీ కోదండ రాముడి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలాస్టేడియానికి పల్లకిలో సీతమ్మతో కలిసి రాములోరిని అర్చకులు తీసుకొచ్చారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. నవ వధూవరులను చూసి తరించేందుకు ఇరు తెలుగురాష్ట్రాల నుంచి భక్తజనం భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో టీడీపీ నేత బొండా ఉమాను ఇరికిస్తున్నారని డీజీపీ, ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్‌కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా ఉమపై ఫిర్యాదు చేస్తున్నారని.. విజయవాడ సీపీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రామయ్య పేర్కొన్నారు. ఎన్నికల వేళ రాజకీయాలకు తావులేకుండా చూడాలని ఆయన కోరారు.
ఈ ఏడాది జనవరిలో రిలీజైన ‘హనుమాన్’కు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తీస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందుకు సంబంధించిన అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు. ‘శ్రీరాముడి దీవెనలతో.. మీకు ఇంతకుముందెన్నడూ లేని అనుభవాన్ని ఈ సినిమాతో అందించబోతున్నా. మనందరికీ ఇది చాలా ప్రత్యేకమైన సినిమా’ అని పోస్ట్ చేశారు. శ్రీరాముడి చేతిలో హనుమంతుడి చేయి ఉన్నట్లుగా డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
వేసవిలో లభించే తాటి ముంజల్లో విటమిన్ బి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుకు విరుగుడుగా, క్యాన్సర్ నిరోధకంగానూ ఇవి పని చేస్తాయని అంటున్నారు. ముఖంపై రాసుకుంటే మచ్చలు సైతం తగ్గుతాయట. లేత తాటి ముంజలు తింటే వేసవిలో ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. గర్భిణులకు, పిల్లలకు మంచిదట. సాధారణంగా బయట డజన్ ముంజలు సుమారు రూ.100 పలుకుతోంది. మరి మీ దగ్గర తాటి ముంజలు దొరుకుతున్నాయా? ధర ఎంతో కామెంట్ చేయండి.
AP: పాలిసెట్-2024 హాల్‌టికెట్లను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 27న జరిగే పాలిసెట్ పరీక్ష కోసం లక్ష మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ టెన్త్ హాల్‌టికెట్/మొబైల్ నంబర్, టెన్త్ పాసైన/ పూర్తి చేసిన సంవత్సరం వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <
ఎండలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు శుభవార్త. ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అదే సమయంలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
AP: ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఈ నెల 22న సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. ‘బుధవారం నుంచి ఈ నెల 26వరకు శ్రీరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నేటి ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న రాములోరి కల్యాణాన్ని లక్ష మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశాం. 23న రథోత్సవం నిర్వహిస్తాం’ అని టీటీడీ పేర్కొంది.
TG: మరో మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాము గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఒక్కరు కూడా మిగలరని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగిన రేవంత్‌ను సీఎంగా చూడలేకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కోమటిరెడ్డి విమర్శించారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు.
Sorry, no posts matched your criteria.