India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.
AP: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ తేదీని మే 7వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్ అధికారులను బహిరంగంగా బెదిరిస్తున్నారని, దర్యాప్తుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు కోర్టుకు వివరించారు.
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వాయిదా పడింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలీ కోర్టు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. నిన్నటి విచారణకు తెలంగాణ MLAలు గంగుల కమలాకర్, చింతకుంట విజయరమణారావు, ప్రకాశ్‌గౌడ్, మాజీ MLAలు హన్మంత్‌షిండే, కేఎస్ రత్నం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్‌బాబు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా 9 మంది విచారణకు హాజరు కాలేదు.
శ్రీరామనవమి రోజున సీతారాములతో పాటు ఆంజనేయుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. రాముడి తల్లిదండ్రులైన కౌసల్య, దశరథుడిని స్మరించుకోవడం మంచి ఫలితాలనిస్తుంది. దీంతో పాటు సీతారామ కల్యాణం జరిపించడం, ఆ వేడుకల్లో పాల్గొనడం, చూడటం మేలు చేస్తుంది. ఇక స్వామివారికి పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర పొంగలి, చెరకు, ఇప్పపూలు ప్రసాదంగా సమర్పించాలి.
‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ ఈ శ్లోకం చాలా విశిష్ఠమైనదని పండితులు చెబుతారు. ఇది విష్ణుసహస్ర నామంతో సమానమని అంటారు. మన పెదవులు రామ నామంలో ‘రా’ అనే అక్షరాన్ని ఉచ్చరించినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయని.. ‘మ’ అనే అక్షరాన్ని పలికినప్పుడు లోనికి రాకుండా మూసుకుంటాయని విశ్వసిస్తారు. ‘రామ’ నామాన్ని జపిస్తే పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
సివిల్ సర్వీసెస్‌లో మరోసారి తెలంగాణ సత్తాచాటింది. 2022లో సూర్యాపేటకు జిల్లాకు చెందిన ఉమాహారతి 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఆమె 5వ ప్రయత్నంలో విజయం సాధించారు. అప్పుడు ఆమె తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా ఉన్నారు. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి కూతురు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే 3వ ర్యాంకు సాధించారు.
ఎన్డీయే కూటమి ప్రచారం నేడు కృష్ణా జిల్లాకు చేరుకోనుంది. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఇద్దరు నేతలు పెడనకు చేరుకుంటారు. అక్కడి సభలో ప్రసంగం అనంతరం మచిలీపట్నం నియోజకవర్గానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు విజయవాడకు బయలుదేరతారు.
ఇవాళ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచులు జరగ్గా.. గుజరాత్‌దే పైచేయిగా ఉంది. GT రెండింట్లో, ఢిల్లీ ఒక మ్యాచులో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో గుజరాత్ 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ఢిల్లీ నాలుగు పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.
కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలాపై ఈసీ చర్యలకు దిగింది. బీజేపీ ఎంపీ హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో 48 గంటలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. అంతకుముందు ఆయన ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించింది.
TG: శ్రీరామనవమి సందర్భంగా HYD జంటనగరాల్లో ఇవాళ వైన్ షాప్స్ మూసి ఉండనున్నాయి. జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉ.6 వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. తిరిగి రేపు వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.
Sorry, no posts matched your criteria.