India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP ఎన్నికల వేళ మరో అధికారిపై వేటు పడింది. స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ MD వాసుదేవరెడ్డిపై EC బదిలీ వేటు వేసింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న EC.. తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని GOVTను ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు వాసుదేవరెడ్డికి ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. గత 5ఏళ్లలో ఎలాంటి విజిలెన్స్ విచారణ లేని అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలంది.
TG: సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పెళ్లితంతు మొదలు కానుంది. ఈ వేడుకల కోసం దేవస్థానం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆర్టీసీ 238 ప్రత్యేక బస్సులను నడుపుతుండగా.. భద్రాద్రిలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో స్థానికంగా వసతి కష్టంగా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉండటంతో ఎన్నికల ప్రచార బాధ్యతలు ఆయన సతీమణి సునీత అందుకోనున్నారు. స్టార్ క్యాంపెనర్ల లిస్ట్‌లో సునీతకు పార్టీ తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో మే 7న జరిగే లోక్‌సభ ఎన్నికలకు సునీత ప్రచారం చేయనున్నారు. పొత్తులో భాగంగా భావ్‌నగర్, భారుచ్ స్థానాల్లో ఆప్.. మిగతా 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి.
మానవ హక్కుల ఉల్లంఘన, కొవిడ్ మూలాలపై యూఎన్ రిపోర్టులను చైనా తనకు అనుకూలంగా మార్చుకుందని UN మాజీ ఉద్యోగి ఎమ్మా తన రిపోర్టులో పేర్కొన్నారు. “వుహాన్ ల్యాబ్ లీక్‌పైన ఎక్కువ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడింది. ఉయ్ఘర్ ముస్లిములపై దురాగతాలకు సంబంధించిన రిపోర్టులను తారుమారు చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనపై యూఎన్‌ను ఆశ్రయించిన వారి వివరాలను కొందరు సిబ్బంది రహస్యంగా చైనాకు చేరవేస్తున్నారు” అని తెలిపారు.
చైనా ఆగడాలకు సంబంధించి ఎమ్మె రైలీ అనే ఐక్యరాజ్య సమితి మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. ‘UN వంటి అంతర్జాతీయ సంస్థలను అధీనంలోకి తెచ్చుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు, నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. చైనాకు వ్యతిరేకంగా రిపోర్టులు రాయకుండా UN సీనియర్ అధికారులను ఒత్తిడి చేస్తోంది’ అని యూకే ఫారిన్ అఫైర్స్ కమిటీకి సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఇంటింటికీ గ్యారంటీ కార్డులు పంచడంపై ఎన్నికల సంఘానికి BJP ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఈ కార్డుల పంపిణీ, ప్రింటింగ్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విధానం ఓటర్లను మభ్యపెట్టేలా ఉందని, లంచగొండితనాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని ఆరోపించింది. గ్యారంటీల లబ్ధికి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా అప్లికేషన్ పేపర్లను కాంగ్రెస్ పంచుతోందని పేర్కొంది.
అమెరికాలో స్థిరపడాలనేది చాలా మంది భారతీయుల కల. అయితే ఇలా కలలు కంటున్న వారి జాబితా ఇటీవల బాగానే పెరిగింది. గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారి సంఖ్యే అందుకు ఉదాహరణ. డిపెండెంట్లతో కలిపి 12.6లక్షల మందికిపైగా భారతీయులు గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నట్లు US వెల్లడించింది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అనే మూడు కేటగిరీల కింద US గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది.
ఈవీఎం వ్యవస్థను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో బ్యాలెట్ పేపర్ల వ్యవస్థ ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయో చూశామని, ఆ ఘటనలు ఇంకా మర్చిపోలేమని పేర్కొంది. ఈవీఎంలకు ప్రత్యామ్నాయం ఏంటని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు ప్రశ్నించగా, ఆయన బ్యాలెట్ పేపర్ వ్యవస్థను సూచించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవస్థ సరికాదంటూ కోర్టు అభిప్రాయపడింది.
భారతీయ వాయుసేన మాజీ అధికారి స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజితియా (103) మంగళవారం కన్నుమూశారు. ఉత్తరాఖండ్ రుద్రపూర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వాయుసేనలో చేరిన దలీప్ భయమెరుగని యోధుడిగా గుర్తింపుపొందారు. 1942-1943 మధ్య బర్మా వద్ద వాయుసేనకు ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని IAF వర్గాలు పేర్కొన్నాయి. 1920 జూలై 27న జన్మించిన దలీప్ 1940లో వాయుసేనలో చేరారు.
బిహార్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సనాతన ధర్మాన్ని దూషించే వాళ్లు ఒక్క విషయం తెలుసుకోవాలి. రాజ్యాంగ రూపకర్తల్లో 80-90% మంది సనాతన ధర్మాన్ని గౌరవించిన వారే ఉన్నారు. ఈ గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్ తీర్చిదిద్దేందుకు వీరు మద్దతుగా నిలిచారు. దేశాభివృద్ధికై కలలు కని రూపకర్తలు రాజ్యాంగాన్ని అందిస్తే కాంగ్రెస్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది’ అని తెలిపారు
Sorry, no posts matched your criteria.