News April 17, 2024

వాయుసేన మాజీ యోధుడు కన్నుమూత

image

భారతీయ వాయుసేన మాజీ అధికారి స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజితియా (103) మంగళవారం కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌ రుద్రపూర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వాయుసేనలో చేరిన దలీప్ భయమెరుగని యోధుడిగా గుర్తింపుపొందారు. 1942-1943 మధ్య బర్మా వద్ద వాయుసేనకు ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని IAF వర్గాలు పేర్కొన్నాయి. 1920 జూలై 27న జన్మించిన దలీప్ 1940లో వాయుసేనలో చేరారు.

News April 17, 2024

రాజ్యాంగ రూపకర్తల్లో 90% మంది సనాతనీలే: మోదీ

image

బిహార్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సనాతన ధర్మాన్ని దూషించే వాళ్లు ఒక్క విషయం తెలుసుకోవాలి. రాజ్యాంగ రూపకర్తల్లో 80-90% మంది సనాతన ధర్మాన్ని గౌరవించిన వారే ఉన్నారు. ఈ గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్ తీర్చిదిద్దేందుకు వీరు మద్దతుగా నిలిచారు. దేశాభివృద్ధికై కలలు కని రూపకర్తలు రాజ్యాంగాన్ని అందిస్తే కాంగ్రెస్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది’ అని తెలిపారు

News April 17, 2024

రాజ్యాంగాన్ని గౌరవిస్తాం.. అంబేడ్కర్ కూడా మార్చలేరు: మోదీ

image

రాజ్యాంగంలో సవరణలు చేపట్టేందుకే BJP భారీ మెజార్టీని కోరుకుంటోందన్న ప్రతిపక్షాల విమర్శలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. NDA రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేడ్కర్ సైతం దానిని మార్చలేరన్నారు. ‘నన్ను దూషించేందుకు ప్రతిపక్షాలు రాజ్యాంగం పేరును వాడుకుంటున్నాయి. అంబేడ్కర్, డా.రాజేంద్ర ప్రసాద్ తీర్చిదిద్దిన రాజ్యాంగమే నన్ను PMను చేసింది. ప్రతిపక్షాలు రాజ్యాంగంతో రాజకీయాలు చేస్తున్నాయి’ అని విమర్శించారు.

News April 17, 2024

ఇక్ష్వాకు తిలకుడి నుదిటిపై ‘సూర్య తిలకం’.. అంతా సిద్ధం!

image

శ్రీరామనవమి సందర్భంగా నేడు అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్య తిలకాన్ని ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియను నిన్న నిర్వాహకులు విజయవంతగా పరీక్షించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాయి. ఈ అపురూప ఘట్టాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో దాదాపు 100 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారట.

News April 17, 2024

రాళ్లు పట్టుకున్న చేతుల్లో ఇప్పుడు ల్యాప్‌టాప్స్ వచ్చాయి: షా

image

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ విజయంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఇక్కడి ప్రజల నమ్మకాన్ని, ప్రేమను పొందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కమలం దానంతట అదే వికసిస్తుందన్నారు. ‘ప్రధాని మోదీ హయాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించింది, రాళ్లు దాడులు ఆగాయి, ఆర్టికల్ 370 రద్దైంది. ఒకప్పుడు రాళ్లు పట్టుకున్న జమ్మూకశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు ల్యాప్‌టాప్స్ వచ్చాయి’ అని పేర్కొన్నారు.

News April 17, 2024

ధోనీ, కోహ్లీనే ఫాలో అయ్యా: బట్లర్

image

కేకేఆర్‌పై ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్‌కు సూపర్ విక్టరీ అందించిన బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆత్మవిశ్వాసంతో ధోనీ, కోహ్లీ చివరివరకు ఉండి పోరాడతారని ఈ మ్యాచ్‌లో తానూ అదే చేశానని అన్నారు. ‘నాకు గతంలో సంగక్కర కూడా ఇదే మాట చెప్పారు. చివరివరకు క్రీజులో ఉంటే ఏదో క్షణాన పరిస్థితులు మనకి అనుకూలించొచ్చని అన్నారు. పోరాడకుండా ప్రత్యర్థికి వికెట్ ఇచ్చేయడం కన్నా ఘోరమైంది మరొకటి లేదు’ అని తెలిపారు.

News April 17, 2024

ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

image

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహరాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్ధ్ జననం
1790: అమెరికా సహవ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం
2004: సినీ నటి సౌందర్య మరణం

News April 17, 2024

T20 WCకు వికెట్ కీపర్ అతడేనా?

image

టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి BCCI సెలక్టర్లకు వికెట్ కీపర్ ఎంపిక తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. IPLలో వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, జితేశ్ శర్మ, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ రాణిస్తున్నారు. వీరిలో రిషభ్ పంత్‌ను WC కోసం ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాకప్‌గా సంజూ శాంసన్, దినేశ్ కార్తీక్‌‌లలో ఒకరిని తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News April 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 17, 2024

సొంత మేనిఫెస్టోతో బరిలోకి గడ్కరీ

image

నాగ్‌పుర్ లోక్‌సభ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేయనున్న కేంద్రమంత్రి, BJP నేత నితిన్ గడ్కరీ సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. ‘ఐదేళ్లలో నాగ్‌పుర్‌లో లక్ష ఉద్యోగాలు, విదర్భ పరిధిలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అభివృద్ధి, స్వచ్ఛతలో నాగ్‌పుర్‌ను టాప్ ఫైవ్ నగరాల్లో నిలబెడతా. ఇప్పటికే స్లమ్స్‌లోని 500-600 ఇళ్లకు పట్టాలు అందించే ప్రక్రియ మొదలైంది. మరోసారి గెలిపిస్తే దీనిని విస్తరిస్తాను’ అని హామీ ఇచ్చారు.