India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మరణం తర్వాత కర్ణుడు స్వర్గానికి వెళ్లాడు. అక్కడ ఆయన దేన్ని తాకినా, అది బంగారంగా మారిపోసాగింది. ఆహారం తిందామన్నా ఇదే పరిస్థితి. దీంతో ‘నేనేం తప్పు చేశా’ అని బాధపడ్డాడు. అప్పుడు అశరీరవాణి ‘కర్ణా! నీవు దానశీలిగా ఎవరికి ఏం కావాలన్నా కాదనకుండా ఇచ్చావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, డబ్బు రూపేణా చేశావు. కానీ, ఒక్కసారైన అన్నదానం చేశావా? ఎవరి ఆకలినైనా తీర్చావా? అందుకే ఈ దుస్థితి’ అని పలికింది.
తనకు కల్గిన దుస్థితి నుంచి విముక్తి కలిగించమని తండ్రి సూర్యుని వద్దకు వెళ్లి అడిగాడు కర్ణుడు. సూర్యుడి కోరిక మేరకు ఇంద్రుడు కల్పించుకొని కర్ణుడికి అవకాశం ఇచ్చాడు. భూలోకానికి వెళ్లి అన్నదానం చేయమన్నాడు. కర్ణుడు భూమ్మీదకు వెళ్లి అన్నదానం చేసి, మాతా పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి స్వర్గానికి వెళ్లాడు. అప్పుడే ఆయన ఆకలి తీరింది. అయితే కర్ణుడు భూమ్మీద గడిపిన ఈ 15 రోజుల కాలాన్నే మహాలయ పక్షమని అంటారు.
1. రామాయణంలో సుగ్రీవుడి భార్య ఎవరు?
2. మహాభారతం అసలు పేరేంటి?
3. గుజరాత్ రాష్ట్రంలో ఏ పండగను నూతన సంవత్సరంగా నిర్వహిస్తారు?
4. వైశాఖ తృతీయను మనం ఏమని పిలుస్తాం?
5. నారదుని వీణ పేరేంటి?
6. ‘బ్లాక్ పగోడా’ అని ఏ దేవాలయాన్ని అంటారు?
మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఒక టన్ను పశువుల ఎరువును ఎకరం పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19KGల పొటాష్, ఇతర పోషకాలు పంటకు అందుతాయి. ఒక టన్ను గొర్రెల, మేకల ఎరువు వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్, ఇతర పోషకాలు మొక్కలకు చేరతాయి. ఫలితంగా భూమిలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతో భూసారం పెరుగుతుంది.
ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
* వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.
* ఆ గొర్రెలకు గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పచ్చి పశుగ్రాసాన్ని ఎక్కువగా ఇవ్వరాదు.
* బొబ్బల మీద వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను రాయాలి.
* వెటర్నరీ డాక్టర్ సలహాతో బాక్టీరియాను నియంత్రించడానికి యాంటీ బయాటిక్స్, డీహైడ్రేషన్ తగ్గించడానికి IV fluids లేదా ORS తరహా ద్రావణాలు ఇవ్వడం, టీకాలు అందించడం మంచిది.
వివిధ కారణాల వల్ల బిడ్డలకు పాలివ్వలేని వారి కోసం తల్లిపాల బ్యాంకులు వచ్చాయి. శిక్షణ పొందిన సిబ్బంది స్టెరియిల్ కంటైనర్‌లో పాలను సేకరించి, మైక్రోబయోలాజికల్ స్క్రీనింగ్ చేస్తారు. పాశ్చురైజ్ చేసి బాక్టీరియా టెస్ట్ నెగటివ్ వచ్చాక నిల్వ చేసిన పాలను, అవసరమైన శిశువులకు పంపిణీ చేస్తారు. వీటిని ఫీడింగ్ కోసం 4 °C వద్ద ఫ్రిజ్‌లో నెమ్మదిగా డీఫ్రాస్ట్ చేయాలి. డీఫ్రాస్టింగ్ చేసిన పాలను వెంటనే ఉపయోగించాలి.
చాలామంది లావుగా ఉండటం వల్ల అందంగా లేమని కుంగిపోతుంటారు. దీన్నే ఫ్యాట్ ఫోబియా అంటారు. ఇది శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధికబరువు వల్ల ఎందులోనూ సక్సెస్ కాలేమని, ఇతరులతో పోల్చితే తాము తెలివితేటల్లోనూ తక్కువేనని బాధపడతారు. ఫొటోలు, అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడరు. ఇలా కాకుండా తమను తాము ప్రేమించుకోవడం నేర్చుకోవాలంటున్నారు నిపుణులు.
నార్మల్ డెలివరీ తర్వాత చాలామందికి యోని దగ్గర నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్, కారణం లేకుండా నొప్పి వస్తుంటే దాన్ని వల్వర్ పెయిన్ అంటారు. ప్రసవ భయం, ఒత్తిడి వల్ల ఈ నొప్పి రావొచ్చు. సరైన చికిత్స తీసుకోకపోతే ఇది దీర్ఘకాలం ఉంటుంది. గైనకాలజిస్ట్‌ని కలిస్తే వెజైనల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేస్తారు. అది నెగటివ్ వస్తే పెల్విక్ ఫ్లోర్ మజిల్ వ్యాయామాలు సూచిస్తారు. ఇలా నొప్పిగా ఉంటే సబ్బులు, వెజైనల్ వాష్‌లు వాడకూడదు.
అలసిన ముఖానికి సాంత్వన కలిగించే అద్భుతమైన పరికరం జేడ్ రోలర్. దీన్ని వాడే ముందు ముఖాన్ని శుభ్రం చేసి రోజ్‌వాటర్ అద్దాలి. తర్వాత జేడ్ రోలర్‌తో సవ్య, అపసవ్య దిశల్లో మసాజ్ చేయాలి. రోజుకి మూడుసార్లు మసాజ్ చేస్తే చర్మంపై లింఫాటిక్ ఫ్లూయిడ్ విడుదల తగ్గుతుంది. మసాజ్ చేయడంవల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరిగి, ఆక్సిజన్ అంది చర్మం కాంతివంతం అవుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గి, చర్మం తాజాగా ఉంటుంది.
Sorry, no posts matched your criteria.