India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ కుట్రలను కూటమి అభ్యర్థులు గట్టిగా తిప్పి కొట్టాలని ఎన్డీఏ అధిష్ఠానం ఆదేశించింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులతో టీడీపీ చీఫ్ చంద్రబాబు, బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఎన్డీఏ తరఫున ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయినా కూటమి అభ్యర్థిగానే భావించాలి. మూడు పార్టీల నేతలు కలిసి ఎన్నికల ప్రచారం చేయాలి’ అని తెలిపింది.
AP: టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రేపు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా పెడనలో మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7 గంటలకు మచిలీపట్నంలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇవాళ విడుదలైన సివిల్స్ ఫలితాల్లో దేశంలోనే రెండో ర్యాంక్ సాధించిన అనిమేశ్(ఒడిశా) జీవితంలోని కష్టాల ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అతని తండ్రి 9ఏళ్ల కిందటే చనిపోయాడు. సరిగ్గా సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలో తల్లి క్యాన్సర్‌తో మరణించింది. ఆ విషాదాన్ని దిగమింగి లక్ష్యం వైపు అడుగులు వేసి తొలి ప్రయత్నంలోనే సివిల్స్ క్లియర్ చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా రోజుకు 5-6 గంటలు చదివానని అతను తెలిపారు.
ఇకపై ప్రతీ మ్యాచ్ సెమీఫైనల్ అనుకునే ఆడతామని ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నారు. ‘SRHతో మ్యాచ్ మాకు కఠినమైనది. ఆ ఓటమి మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టింది. కానీ ఆ మ్యాచ్‌లో మా మిడిలార్డర్ గొప్పగా పోరాడింది. మా జట్టు పోరాడినందుకు గర్వంగా ఉంది. తర్వాతి మ్యాచ్‌లకు బలంగా తిరిగి వస్తాం. వరుస విజయాలు సాధించి గాడిలో పడతాం’ అని ఆయన పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ఈరోజు భారీ సంఖ్యలో నక్సలైట్లు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌ను ధైర్య సాహసాలతో విజయవంతం చేసిన భద్రతా సిబ్బందిని అభినందిస్తున్నా. గాయపడిన పోలీసులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అభివృద్ధి, శాంతి, యువత భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువు. ప్రధాని మోదీ నాయకత్వంలో నక్సలిజం నుంచి దేశాన్ని విముక్తి చేయాలని నిశ్చయించుకున్నాం’ అని తెలిపారు.
తప్పుడు పత్రాలతో బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందారన్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ న్యూయార్క్ కోర్టు ఎదుట హాజరయ్యారు. అక్కడ విచారణ జరుగుతుండగా ఆయన నిద్రపోయినట్లు మీడియా కథనాలు వైరలవుతున్నాయి. న్యాయవాది అప్రమత్తం చేసినప్పటికీ ట్రంప్ పట్టించుకోలేదట. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని ఆయన బృందం స్పష్టం చేసింది.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘వార్ 2’ మూవీ నుంచి పిక్స్ లీకైనట్లు తెలుస్తోంది. ముంబైలో జరుగుతున్న షూట్ నుంచి ఎన్టీఆర్, హృతిక్ ఫొటోలు బయటకు వచ్చాయి. వీరిద్దరూ పిక్స్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.
AP: సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘కోడికత్తి కమల్ హాసన్‌పై దాడి చేసిన నిందితుడు దొరికాడు. గౌరవ పోలీసుశాఖ ప్రకటించిన రూ.2 లక్షల నగదు బహుమతిని ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కమల్‌కు ఇచ్చేయండి!’ అని పోస్ట్ చేశారు. రాయి దాడి ఘటన బాధితుడు, నిందితుడు జగనే అని ఓ ఫొటోను షేర్ చేశారు లోకేశ్.
టీ20 వరల్డ్ కప్‌నకు వెళ్లే భారత జట్టులో రిషభ్ పంత్‌ను కచ్చితంగా సెలక్ట్ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ‘ఇషాన్, శాంసన్ వంటి కీపర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడుతున్నారని నాకు తెలుసు. అయినప్పటికీ నేనే సెలక్టర్ అయితే కచ్చితంగా పంత్‌ను ఎంపిక చేస్తాను. తను ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడో మనకు తెలుసు. భారత టీ20 జట్టులో పంత్ ఉండాలనేది నా అభిప్రాయం’ అని స్పష్టం చేశారు.
2030 నాటికి అవాంతరాలు, ఫెయిల్యూర్స్ లేని అంతరిక్ష ప్రయోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాబోయే రోజుల్లో స్పేస్ మిషన్లకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం అంతరిక్ష కక్ష్యలో దేశానికి చెందిన 54 స్పేస్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. మరికొన్ని వినియోగంలో లేనివీ ఉన్నాయి. వీటిని సురక్షితంగా తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.