India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2030 నాటికి అవాంతరాలు, ఫెయిల్యూర్స్ లేని అంతరిక్ష ప్రయోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాబోయే రోజుల్లో స్పేస్ మిషన్లకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం అంతరిక్ష కక్ష్యలో దేశానికి చెందిన 54 స్పేస్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. మరికొన్ని వినియోగంలో లేనివీ ఉన్నాయి. వీటిని సురక్షితంగా తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
AP: ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మంది సలహాదారులు కోడ్ పరిధిలోకి వస్తారని పేర్కొంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని సలహాదారులపై భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు పెడుతున్నట్లు గుర్తించిన ఈసీ.. తాజాగా సలహాదారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.
AP: వచ్చే 4 రోజులపాటు అక్కడక్కడా 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 175 మండలాల్లో వడగాలులు, ఎల్లుండి 67 మండలాల్లో తీవ్ర వడగాలులు, 213 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు వడగాలులు వీచే మండలాలు, అక్కడి ఉష్ణోగ్రతల వివరాలను ఇక్కడ <
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు రెండో బుల్లెట్ ట్రైన్ రానున్నట్లు తెలుస్తోంది. రైల్వేశాఖ డీపీఆర్ ప్రకారం సబర్మతి స్టేషన్ నుంచి ఢిల్లీకి ఈ ట్రైన్ నడవనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 3.5 గంటలకు తగ్గనుంది. ఎలివేటెడ్ కారిడార్‌పై సగటు వేగం 250 కి.మీ ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ ఫేజ్ 2026కి పూర్తి కానుంది.
మద్యపానం, ధూమపానం, ప్రాసెస్డ్ ఫుడ్, స్మార్ట్ ఫోన్ అతిగా వినియోగిస్తే స్పెర్మ్ DNA దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీర్య నాణ్యత తక్కువగా ఉంటే సంతాన లేమి, మహిళల్లో గర్భ విచ్ఛిత్తి, పిల్లల్లో పుట్టుకతో లోపాలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. గర్భధారణ ఆలస్యం చేసినా స్పెర్మ్ నాణ్యత క్షీణిస్తుందని చెబుతున్నారు. మంచి లైఫ్ స్టైల్, యోగా, వ్యాయామం వంటివి చేస్తే DNA నాణ్యత పెరుగుతుందని అంటున్నారు.
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఓపెనర్ సునీల్ నరైన్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. 55 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 109 రన్స్ బాదారు. అతడికి తోడు రఘువంశీ (30) రాణించడంతో కేకేఆర్ భారీ స్కోరు చేసింది. ఆర్ఆర్ బౌలర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో సెంచరీతోపాటు హ్యాట్రిక్ వికెట్లు తీసిన మూడో ప్లేయర్‌గా నరైన్ రికార్డు సృష్టించారు. ఇంతకుముందు షేన్ వాట్సన్, రోహిత్ శర్మ కూడా ఈ ఘనత సాధించారు. అయితే IPLలో 5 వికెట్ల హాల్, సెంచరీ ఉన్న ఏకైక ప్లేయర్ నరైన్ కావడం విశేషం. కాగా RRతో జరుగుతున్న మ్యాచ్‌లో నరైన్ (109) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.
TG: సీఎం రేవంత్ BJPలోకి వెళ్తారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘BRS అంతరిస్తుందనే భయం కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఆయన గతంలో మెజార్టీ సీట్లలో గెలిచి కూడా మా 12 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. మేం ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనూ బెదిరించి పార్టీలో చేర్చుకోవట్లేదు. BRSలో ఇమడలేక వారే వస్తున్నారు’ అని చెప్పారు.
TG: లోక్‌సభ ఎన్నికల వేళ BRSకు మరో షాక్ తగిలే అవకాశం కన్పిస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ ఆదిలాబాద్‌లో KTR అధ్యక్షతన జరిగిన సన్నాహక భేటీకి ఆయన డుమ్మాకొట్టారు. నిర్మల్‌లో కార్యకర్తలతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎక్కువ మంది కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. దీంతో ఆయన త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఎన్నికల కోడ్ కారణంగా కళ్యాణ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఏప్రిల్ 4న ఈసీ ఆంక్షలు విధించింది. 40 ఏళ్లుగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని దేవాదాయశాఖ, నేతలు ఈసీ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఎన్నికల సంఘం ప్రత్యక్షప్రసారానికి ఓకే చెప్పింది.
Sorry, no posts matched your criteria.