India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కన్నడ సీనియర్ నటుడు ద్వారకీశ్(81) <<13063171>>మృతిపై<<>> రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా చిరకాల మిత్రుడు మరణించడం చాలా బాధాకరం. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి పెద్ద నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ఎదిగారు. ద్వారకీశ్‌తో ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు.
RCBతో మ్యాచ్‌లో 39బంతుల్లోనే సెంచరీతో కదం తొక్కి SRH విజయంలో కీలకపాత్ర పోషించిన హెడ్ ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ మోగించారు. ‘ఓపెనర్లు దూకుడుగా ఆడేందుకు స్వేచ్ఛ కల్పించిన కెప్టెన్ కమిన్స్, కోచ్ డానియెల్ వెట్టోరికి క్రెడిట్ ఇవ్వాలి. ఇప్పుడు మా ముందున్న లక్ష్యం 300రన్స్. మిడిల్ ఆర్డర్‌లో క్లాసెన్, సమద్, నితీశ్‌తో మంచి పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ ఉంది’ అని హెడ్ అన్నారు. Apr 20న DCతో SRH మ్యాచ్ ఉంది.
AP: రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేయకపోవడంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తాము ఇచ్చిన హామీల్లో 98%కి పైగా అమలు చేశామని, చేయలేకపోయిన 2% హామీల్లో మద్యపాన నిషేధం ఒకటని చెప్పారు. ఒకేసారి నిషేధం విధిస్తే పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలివస్తోందనే భావనతో అమలు చేయలేకపోయామని వివరించారు. ఇప్పటికీ మద్యపాన నిషేధం చేయాలనే ఉద్దేశం ఉందన్నారు.
రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కాలంటే హార్దిక్ రెగ్యులర్‌గా బౌలింగ్ చేయాల్సిందేనని BCCI షరతు పెట్టినట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ, హెడ్ కోచ్ ద్రవిడ్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పాండ్య బౌలింగ్‌లో విఫలమవుతున్నారు. దీంతో భారత జట్టులో అతడి స్థానం అనుమానంగా మారింది.
శ్రీరామనవమి రోజున అయోధ్య బాలరాముడి దర్శనంపై ఆలయ ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. రేపు ఉదయం 3.30 గంటలకు మంగళహారతితో ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు మందిరం తెరిచి ఉంటుందని పేర్కొంది. రామనవమి నేపథ్యంలో భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ పాస్ బుకింగ్స్ రద్దు చేశారు. విశిష్ట అతిథులు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 19 తర్వాత రావాలని సూచించారు.
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. ఈ నెల 22 లేదా 23న విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బ్లాక్‌బస్టర్ మూవీ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’ రీమేక్‌లో ఆయన లీడ్ రోల్‌లో నటిస్తారని సమాచారం. భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో ఈ మలయాళ మూవీ తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. దీంతో రీమేక్‌లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? తరుణ్ భాస్కర్ రోల్ ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న కేటీఆర్.. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు జరుగుతాయని అన్నారు. ముఖ్యమైన మార్పు సీఎం రేవంత్‌రెడ్డిదేనని, గెలిచిన ఎంపీలతో ఆయన బీజేపీలో చేరతారని మరోసారి బాంబు పేల్చారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరతారని ఈమధ్య పదేపదే కేటీఆర్ అంటుండటం గమనార్హం.
దాదాపు రూ.2900 కోట్ల నెట్‌వర్త్ ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల తర్వాత అంతపెద్ద స్టార్ 1BHKలో ఎందుకు నివాసం ఉంటున్నారనే సందేహం చాలామందిలో నెలకొంది. సల్మాన్ ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో ఫ్లాట్లో ఉంటున్నారు. తన పేరెంట్స్ ఫ్లాట్ పక్క ఫ్లాట్లో సల్మాన్ ఉంటారట. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే ఆలోచనతోనే ఆయన ఆ 1BHKలో ఉంటున్నారట.
ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ దిగ్గజం మైకేల్ స్లేటర్‌ను ఆ దేశ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. మాజీ భార్యపై దాడి, వెంబడించడం, అనుమతి లేకుండా ఇంట్లోకి రావడం, హత్యాయత్నం తదితర అభియోగాలను ఆయనపై నమోదు చేశారు. ఇదే తరహాలో మరో 19 అభియోగాలు ఆయనపై గతంలోనూ నమోదయ్యాయి. 2022లో ఓ పోలీసు అధికారిని వెంబడించిన కేసూ స్లేటర్‌పై ఉంది. 1993 నుంచి 2003 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడారు.
Sorry, no posts matched your criteria.