India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
UPSC సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1016 మందిని ఎంపిక చేయగా.. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్ వచ్చింది. అనిమేశ్ ప్రధాన్ 2వ ర్యాంక్, దోనూరు అనన్య రెడ్డికి 3వ ర్యాంకు వచ్చింది. 347 మంది జనరల్ కేటగిరీలో, 303 OBC కేటగిరీలో, 165 SC కేటగిరీలో, ST కేటగిరీలో 86 మంది ఎంపికయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ <
జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ సందేశాన్ని పంపారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు’ అని పేర్కొన్నట్లు చెప్పారు. కేజ్రీవాల్‌ను తక్కువ చేసి చూపేందుకు 24 గంటలూ ప్రయత్నాలు జరుగుతున్నాయని సంజయ్ ఆరోపించారు. ‘కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారు. ఏ ఒక్కరినీ దగ్గరగా కలిసేందుకు ఆయనను అనుమతించట్లేదు. ఇవి ప్రతీకార రాజకీయాలే’ అని పేర్కొన్నారు.
ఈ ఏడాది నీట్-పీజీ రిజిస్ట్రేషన్లు నేటి నుంచి మొదలుకానున్నాయి. మధ్యాహ్నం 3గంటలనుంచి దరఖాస్తు లింక్ క్రియాశీలం కానుంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 23న పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్యసేవల పరీక్షల బోర్డు ప్రకటించింది. Nbe.edu.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ అందుబాటులోకి రానుంది.
AP:శిరోముండనం కేసులో YCP MLC తోట త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్షతో పాటు ₹2.50లక్షల ఫైన్ విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. కోనసీమ(D) రామచంద్రాపురం(మ) వెంకటాయపాలెంలో 1996 DEC 29న ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం మండపేట నుంచి త్రిమూర్తులు YCP నుంచి పోటీలో ఉన్నారు.
RCB ఫ్యాన్స్‌కు ఈసారీ నిరాశేనా? వారి కప్పు కల కలగానే మిగలనుందా? అంటే వరుస ఓటములు అవుననే అంటున్నాయి. హైదరాబాద్‌పై ఓటమితో ఆ టీమ్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా (0%) మారాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒకదాంట్లోనే విజయం సాధించింది. ఇక ఆ టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లోనూ తప్పక గెలవాలి. దాంతోపాటు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఇంగ్లండ్ స్పిన్ దిగ్గజం డెరెక్ అండర్‌వుడ్(78) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1966-82 మధ్య ఇంగ్లండ్ తరఫున 86 టెస్టుల్లో 297, 26 వన్డేల్లో 32 వికెట్లు తీశారు. ఇప్పటికీ ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు ఆయన పేరిటే ఉంది. కాగా కౌంటీల్లో 900కు పైగా మ్యాచులు ఆడిన డెరెక్ 2,523 వికెట్లు తీశారు.
Way2News పేరుతో కొందరు చేసే అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండండి. ఈ ఫేక్ న్యూస్ గుర్తించడం చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీకు వచ్చే స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. సెర్చ్‌లో సేమ్ ఆర్టికల్ వస్తే అది మేము పబ్లిష్ చేసిన వార్త. వేరే కంటెంట్ వచ్చినా, ఏ వార్త రాకపోయినా అది మా లోగో వాడి రూపొందించిన ఫేక్ న్యూస్. వీటిని grievance@way2news.comకు పంపండి.
బాలకృష్ణ-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందన్న బోయపాటి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ‘ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉంది. అది పూర్తయ్యాక ‘అఖండ-2’ ఉంటుంది. ఈ సీక్వెల్‌లో సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది’ అని బోయపాటి చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైనట్లు తెలిపారు.
TG: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన ఆయన.. ‘రాష్ట్రంలో BJPకి 12 MP సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయి. వంద రోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా అమలవుతాయి?’ అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.