News April 16, 2024

ఆర్థిక వ్యవస్థ ఎదిగినా.. భారత్ పేద దేశమే: దువ్వూరి

image

భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా.. పేద దేశంగానే ఉంటుందని RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. సౌదీ అరేబియా అందుకు సాక్ష్యమన్నారు. అది సంపన్న దేశమే అయినా ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాలేకపోయిందని ఉదహరించారు. దేశంలో సంక్షేమ ఫలాలు అందరికీ అంది, నిరుపేదలన్నవారు లేనిరోజే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని దువ్వూరి తన పుస్తకంలో పేర్కొన్నారు.

News April 16, 2024

BIG BREAKING: జనసేనకు గుడ్‌న్యూస్

image

AP: గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట దక్కింది. ఈ గుర్తును JSPకి కేటాయిస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది.

News April 16, 2024

‘నిద్ర’ మానవ కనీస అవసరం: బాంబే హైకోర్టు

image

మనిషికి నిద్ర కనీస అవసరమని, దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కులను ఉల్లంఘించినట్టేనని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితుల స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేయడానికి ‘earthly timings’ని పాటించాలని EDని ఆదేశించింది. నిద్ర లేకపోతే మానసిక సమస్యలు వస్తాయని పేర్కొంది. తనను రాత్రి సమయాల్లో ఈడీ అధికారులు విచారించారని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌‌‌పై కోర్టు ఇలా స్పందించింది.

News April 16, 2024

FLASH: కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా తిలక్

image

TG: కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎన్ వంశతిలక్‌‌ను బీజేపీ ప్రకటించింది. అక్కడి ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ నుంచి ఆమె సోదరి నివేదిత పోటీ చేయనున్నారు.

News April 16, 2024

VOTER ID ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

image

★ <>voters.eci.gov.in<<>> వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
★ రిజిస్టర్ చేసుకున్నట్టైతే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి
★ తర్వాత e-epic Download ఆప్షన్‌ను క్లిక్ చేయాలి
★ మీ ఓటర్ కార్డు నంబర్, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి
★ ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నంబర్ వెరిఫై అవుతుంది
★ ఆ తర్వాత Download e-EPIC పైన క్లిక్ చేయాలి
★ PDF ఫార్మాట్‌లో ఓటర్ ఐడీ డౌన్‌లోడ్ అవుతుంది.
>> SHARE

News April 16, 2024

ఆంధ్ర, తెలంగాణ CSల సమావేశం

image

త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు TG సచివాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు రాకుండా సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 16, 2024

2050 నాటికి ఏటా కోటి మరణాలు..!

image

ప్రపంచ వైద్య నిపుణుల్ని కంగారు పెడుతున్న కనిపించని పెను ముప్పు ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’(ఏఎంఆర్). విచ్చలవిడి ఔషధాల వాడకం వలన కొంతకాలానికి ఆయా రోగకారక క్రిములు ఆ మందులకు కూడా లొంగని నిరోధకతను పెంపొందించుకోవడాన్ని ఏఎంఆర్‌గా వ్యవహరిస్తారు. అదే జరిగితే ఇప్పటి వరకు కనిపెట్టిన ఔషధాలేవీ పనిచేయవు. ఈ కారణంగా 2050 నాటికి ఏటా కోటి మరణాలు నమోదవుతాయనే శాస్త్రవేత్తల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

News April 16, 2024

ఆడలేకపోతున్నా.. చేతులెత్తేసిన మ్యాక్సీ

image

RCB రూ.11కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఆడటం తన వల్ల కాదని చేతులెత్తేశారు. తనకు కొంత బ్రేక్ కావాలని కెప్టెన్, కోచ్‌లకు చెప్పారట. దీంతో మ్యాక్సీని నిన్నటి మ్యాచ్‌లో పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఆశించినంతగా ఆడలేకపోతుండటంతో బ్రేక్ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానని, తిరిగి పుంజుకొని జట్టులోకి వస్తానని చెప్పారు.

News April 16, 2024

ఇజ్రాయెల్ కాదు.. మేమే కూల్చాం: అమెరికా

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడిలో ఎక్కువ మిస్సైల్స్‌, డ్రోన్లను అడ్డుకుంది తామేనని అమెరికా సైనికాధికారులు తాజాగా ఓ వార్తాసంస్థకు తెలిపారు. ‘సుమారు 300కు పైగా క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించింది. సుమారు 80వరకు డ్రోన్లు, కనీసం 6 బాలిస్టిక్ క్షిపణుల్ని మేం పడగొట్టాం’ అని పేర్కొన్నారు. మరోవైపు బ్రిటన్, జోర్డాన్ కూడా తామూ క్షిపణుల్ని అడ్డుకున్నట్లు చెబుతుండటం ఆసక్తికరం.

News April 16, 2024

BIG BREAKING: సీఎం జగన్‌పై దాడి కేసులో పురోగతి!

image

AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఐదుగురు అనుమానితులు ఉండగా.. వారిలో ఒక యువకుడు దాడి చేసినట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తి అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వాడిగా భావిస్తున్నారు. సీసీ కెమెరాలు, ఇతర వీడియోల్లో నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.