India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
RCBపై విజయం తర్వాత SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను బ్యాటరైతే బాగుండేది. ముంబైపై భారీ స్కోరు సాధించాక, మరోసారి అలాంటి ప్రదర్శన చేయలేమని అనుకున్నా. కానీ మళ్లీ భారీ స్కోరు బాదేశాం. ఇలాంటి మ్యాచుల్లో ఓవర్‌కు 7-8 పరుగులు ఇస్తే ఆటపై ప్రభావం చూపొచ్చు. నాలుగు విజయాలు రావడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. నిన్నటి మ్యాచులో కమిన్స్ 3 వికెట్లు తీశారు.
TG: రేపు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్, మంత్రులు దూరమవుతున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు ఈ వేడుకలను ప్రభుత్వం తరఫున లైవ్ ఇచ్చేందుకు అనుమతి లేకపోవడంతో.. పర్మిషన్ కోసం ఈసీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ఆలయ సమీపంలో లడ్డూ ప్రసాదం, తలంబ్రాల పంపిణీకి 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
HYDలో ఫుల్లుగా మద్యం తాగి ఓ యువకుడు కారు నడపడంతో జరిగిన 6 ప్రమాదాల్లో.. ఒకరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. తొలుత IKEA వద్ద కారును ఢీకొట్టడంతో మహిళకు, పారిపోతూ గచ్చిబౌలిలో బైకును ఢీకొనగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరి కాలు విరిగింది. మరో యువకుడు గాయపడి మరణించాడు. అలానే వెళ్తూ బైకును, ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు గాయపడ్డారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు పట్టించగా.. డ్రంకెన్ టెస్టులో రీడింగ్ 550 వచ్చింది.
ఆర్సీబీ వరుస ఓటములపై మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్సీబీ జెర్సీ ధరించడం వల్లే ఆ జట్టుకు అదృష్టం కలిసిరావట్లేదేమోనని అభిప్రాయపడ్డారు. ఆర్సీబీకి అనధికారిక దురదృష్టం తానేనని చెప్పారు. అంతకుముందు డివిలియర్స్‌తో <<12925532>>పందెం<<>>లో ఓడిపోవడంతో స్టైరిస్ ఆర్సీబీ జెర్సీ ధరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జెర్సీ ధరించిన ఐదు మ్యాచులు RCB ఓటమి పాలవ్వడం గమనార్హం.
TG: రూ.2లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని.. అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకులను కోరారు. CM, డిప్యూటీ CM, అధికారులతో చర్చించి రుణమాఫీ చేస్తామన్నారు. అటు రైతుభరోసా సాయం కోసం ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించి, సొమ్ము అందిస్తామన్నారు. ఇక వానాకాలం సీజన్‌కు సంబంధించి పంటలకు అవసరమైన విత్తన సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
TG: ఈ ఏడాది యాసంగి, వానాకాలం సీజన్లలో రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. కేంద్రం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధర, రూ.500 బోనస్‌ను చెల్లించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. రైతుల నుంచి వెంటనే వరిధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.
IPLలో బలమైన జట్లు అనగానే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ ముందుగా గుర్తొస్తాయి. ఈ జట్లపై గెలవాలంటే మిగతా జట్లు శక్తికి మించిన ప్రయత్నం చేయాల్సిందే. అలాంటి టీమ్‌లను SRH ఈ సీజన్‌లో మట్టికరిపించింది. హోంగ్రౌండ్‌లో CSK, MIని.. బెంగళూరులో ఆర్సీబీని చిత్తు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న SRH.. మిగతా మ్యాచుల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తమిళ నటుడు ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకు చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. విడాకుల కోసం వీరు దరఖాస్తు చేసుకోగా.. అక్టోబర్ 7న కోర్టులో హాజరవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ధనుష్, ఐశ్వర్యకు 2004లో వివాహమవ్వగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరు గత కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు.
TG: గత నెలలో వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నిర్ధారించింది. ఎకరానికి ₹10వేల చొప్పున రూ.15.81 కోట్లు చెల్లించనుంది. EC అనుమతితో ఇవాళ/రేపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
AP: విశాఖ గాజువాకలో ఆదివారం జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబుపై రాళ్ల దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. ఈ ఘటనపై విచారించాలని వారు విశాఖ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విశాఖ సౌత్ ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.