News April 16, 2024

పవన్, బాలకృష్ణపై చర్యలు తీసుకోండి: YCP

image

AP: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 13న కదిరి బహిరంగ సభలో బాలకృష్ణ, 14న తెనాలి సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సహా తదితరులు CEO మీనాకు సమర్పించారు. కాగా జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పవన్‌కు ఈసీ ఇటీవలే ఓ సారి నోటీసులు ఇచ్చింది.

News April 16, 2024

జాగ్రత్త.. నేడు, రేపు పెరగనున్న ఎండలు

image

TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రానికి వడగాల్పుల ముప్పు పొంచి ఉందంది. బుధవారం కొన్ని జిల్లాల్లో ఈ వడగాల్పుల తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా సోమవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 44.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 16, 2024

మే 15న ప్రధానిగా తప్పుకుంటా: లూంగ్

image

సింగపూర్ ప్రధాని లీ సీయన్ లూంగ్ రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15న పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. అదే రోజున ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు లూంగ్ సింగపూర్ ప్రధానిగా ఉన్నారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి అవసరమని లూంగ్ పేర్కొన్నారు. సింగపూర్ భవిష్యత్తు కోసం వాంగ్ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

News April 16, 2024

ఇరాన్ విరుచుకుపడ్డా బెదరలేదు

image

ఇరాన్ ప్రతీకార దాడులతో విరుచుకుపడినా ఇజ్రాయెల్ బెదరకుండా దీటుగా ఎదుర్కోవడంతో ఆ దేశ డిఫెన్స్ టెక్నాలజీ చర్చనీయాంశమైంది. ఓవైపు ఐరన్ డోమ్
టెక్నాలజీ దాడులను దీటుగా ఎదుర్కొనగా.. ఇరాన్ మిసైళ్ల గురి తప్పడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా కీలక పాత్ర పోషించిందట. GPS సిగ్నల్స్ నిలిపివేయడంతో ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లు టార్గెట్‌ను గుర్తించడంలో కన్ఫ్యూజ్ అయ్యాయట. 300కుపైగా మిసైళ్లను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది.

News April 16, 2024

ఈ‘డెన్’లో విజయమెవరిదో?

image

ఐపీఎల్ 2024లో నేడు KKR, రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచులు జరిగాయి. వీటిలో KKR 14, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలిచాయి. అయితే హోంగ్రౌండ్‌లో RRపై నైట్ రైడర్స్‌దే పైచేయిగా ఉంది. పాయింట్ల పట్టికలో RR, KKR తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ మ్యాచులో గెలిచిన జట్టు తొలి స్థానానికి ఎగబాకనుంది.

News April 16, 2024

నేడు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ సంగారెడ్డి(D) సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనుంది. పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొంటారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు.

News April 16, 2024

ఈ నెల 21న టీఎస్ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష

image

TG: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ(TSRJC) పరిధిలోని 35 గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీీసీ, ఎంఈసీ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఈ నెల 21న పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం 73,527 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

News April 16, 2024

అక్కడ రూ.150కే ఫ్లైట్ టికెట్

image

విమానం టికెట్ అంటే కనీసం రూ.3వేలైనా ఉంటుంది. కానీ మన దేశంలో కొన్ని రూట్లలో విమానం టికెట్ ధర రూ.150నే అని తెలుసా? రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ కింద కేంద్రం పలు చోట్ల అమలు చేస్తున్న ధరలివి. ఈ స్కీమ్‌లో భాగంగా ధర రూ.1000లోపే ఉంటుంది. కనిష్ఠంగా అస్సాంలోని లిలాబరీ-తేజ్‌పూర్ మధ్య ఫ్లైట్ టికెట్ రూ.150గా ఉంది. డిమాండ్ తక్కువ ఉన్న రూట్లలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ స్కీమ్ తెచ్చింది.

News April 16, 2024

‘పెద్ద ప్లాన్ల’కు భయపడాల్సిన అవసరం లేదు: మోదీ

image

బీజేపీ 400కుపైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. తమ పార్టీ అజెండాపై ప్రతిపక్షాలు ప్రజలను భయబ్రాంతులను గురిచేయడం మానుకోవాలని సూచించారు. ‘నేను పెద్ద ప్లాన్స్ ఉన్నాయని చెప్తున్నందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరినీ భయపెట్టాలని నిర్ణయం తీసుకోను. దేశ అభివృద్ధి గురించి ఆలోచించే తీసుకుంటా’ అని తెలిపారు.

News April 16, 2024

డ్రాపౌట్లపై ఫోకస్.. ఏపీ విధానాన్ని పరిశీలిస్తున్న కేంద్రం?

image

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100రోజుల్లో తీసుకోవాల్సిన చర్యల్లో డ్రాపౌట్లకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి చదువు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోందట. 10, 12 తరగతుల్లో ఫెయిలైన విద్యార్థులను స్కూళ్లు రీఅడ్మిట్ చేసుకునేలా ఉన్న AP ప్రభుత్వ విధానాన్ని పరిశీలిస్తోందట. ప్రస్తుతం పదో తరగతి ఫెయిలైన వారి సంఖ్య 36లక్షలు, 12వ తరగతి ఫెయిలైన వారి సంఖ్య 12లక్షలుగా ఉంది.