India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టులు ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయో పరిమితి, పోస్టులు, ఇతర వివరాల కోసం https://nvs.ntaonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
RCBని సొంతగడ్డపైనే SRH ఓడించింది. తొలుత SRH 287 పరుగులు చేయగా.. బెంగళూరు 262 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ 25 రన్స్ తేడాతో గెలిచింది. వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వీర విహారం చేశారు. 35 బంతుల్లో 83 పరుగుల (7 సిక్సర్లు, 5 ఫోర్లు)తో ఒంటరి పోరాటం చేశారు. కోహ్లీ 42(20), డుప్లెసిస్ 62(28) రాణించారు. కమిన్స్ 3 వికెట్లు, మార్కాండే 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
SRHపై ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్ బాదారు. నటరాజన్ వేసిన బంతిని 108 మీటర్ల దూరం కొట్టారు డీకే. ఆ బాల్ స్టేడియం పై రూఫ్‌ను తాకి మైదానంలో పడింది. ఐపీఎల్-2024లో ఇప్పటివరకు ఇదే లాంగెస్ట్ సిక్సర్. ఇదే మ్యాచులో SRH బ్యాటర్ క్లాసెన్ 106 మీటర్ల సిక్స్ కొట్టారు. ఈ సీజన్లోనే పూరన్, వెంకటేశ్ అయ్యర్ సైతం 106 మీటర్ల సిక్సర్లు బాదారు.
30 బంతులు- క్రిస్ గేల్ vs పుణే
37- యూసుఫ్ పఠాన్ vs ముంబై
38- డేవిడ్ మిల్లర్ vs ఆర్సీబీ
39- హెడ్ vs ఆర్సీబీ*
42- గిల్ క్రిస్ట్ vs ముంబై
42- డివిలియర్స్ vs గుజరాత్ లయన్స్
45- జయసూర్య vs చెన్నై
46- మురళీ విజయ్ vs రాజస్థాన్
ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. వీరి రాక నేపథ్యంలో జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో 5 రోజుల్లోనే 600కంటే ఎక్కువ విమానాల రాకపోకలు జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకోసం రిలయన్స్ ఎయిర్‌ఫోర్స్ సాయాన్ని తీసుకుందట.
గుజరాత్‌కు చెందిన దంపతులు రూ.200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. జైన మతానికి చెందిన పారిశ్రామిక వేత్త భవేశ్ భాయ్ భండారీ ఆయన భార్య ఇకపై సన్యాసం స్వీకరించి భిక్షాటనతో రోజువారీ జీవనం సాగించనున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా వారు 2022లోనే సన్యాసం స్వీకరించారు. వారి నిర్ణయం ఈ దంపతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఏప్రిల్ 22న భవేశ్ భాయ్ దంపతులు సన్యాసం స్వీకరించనున్నారు.
*IPL చరిత్రలో అత్యధిక స్కోర్
*ఒక IPL ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (22)
*ఒక సీజన్ లో రెండు సార్లు 250+ స్కోర్ చేసిన తొలి జట్టు
*ఐపీఎల్ చరిత్రలో 2 సార్లు 270+ స్కోర్ చేసిన తొలి టీం
APR 19న అస్సాంలో తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సోనిట్‌పూర్(D) ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఒకే ఇంట్లో 350 ఓట్లు ఉన్నాయి. దివంగత బహదూర్ తాపా అనే వ్యక్తి ఐదుగురు భార్యల ద్వారా 12 మంది కొడుకులు, 9 మంది ఆడపిల్లలను కన్నారు. కోడళ్లు, అల్లుళ్లు, పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి జనాభా 1,200కు చేరింది. వీరంతా అదే ఊరిలో 300 ఇళ్లలో నివసిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
కేంద్రంలోని వివిధ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు ఈ నెల 18తో ముగియనుంది. మొత్తం 968 పోస్టులు ఉండగా, గడువును పొడిగించేది లేదని SSC స్పష్టం చేసింది. డిప్లమా లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.35,400-రూ.1,12,400. పేపర్-1 పరీక్ష జూన్ 4 నుంచి 6 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. పూర్తి వివరాలకు ఇక్కడ <
టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి ఏడడుగులు వేసినట్లు ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా ఈమె టెంపర్ సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్2, తదితర చిత్రాల్లో నటించారు.
Sorry, no posts matched your criteria.