India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ‘జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, BRSను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు. BRS ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో BRS నేతలు ప్రచారమే చేయట్లేదు’ అని వ్యాఖ్యానించారు.
TG: పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.2,00,000 రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు. ఇక వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు. నారాయణపేట జనజాతర సభలో రేవంత్ ఈ ప్రకటనలు చేశారు.
IPL: ఈ ఏడాది ఇప్పటివరకు 6 మ్యాచుల్లో ఒకసారి మాత్రమే గెలిచిన ఆర్సీబీ.. ఇవాళ పలు మార్పులు చేసింది. మ్యాక్సీ, సిరాజ్‌లను పక్కనబెట్టింది. అత్యంత ఖరీదైన ప్లేయర్లు కామెరూన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు), అల్జరీ జోసెఫ్ (రూ.11.5 కోట్లు), మ్యాక్స్ వెల్ (రూ.11 కోట్లు), సిరాజ్ (రూ.7 కోట్లు) తుది జట్టులో లేరు.
‘వార్2’ చిత్రంతో జూ.ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసింది. సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే ఆయన ముంబై వెళ్లారు. కాగా అక్కడ జిమ్‌లో తారక్‌తో కలిసి దిగిన ఫొటోను నటి ఊర్వశీ రౌతేలా పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. అందులో ఫొటోకు ఫిల్టర్ వాడినట్లు స్పష్టంగా తెలుస్తుండటంతో ఎడిట్ చేశారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో చైనా ఫోన్ వాడి ఫొటో తీసినందుకు సారీ అని ఊర్వశీ రిప్లై ఇచ్చారు.
TG: దొరలకు, పెత్తందారులకు కాకుండా బీసీలు, సామాన్యులకు కాంగ్రెస్ MP టికెట్లు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘రాష్ట్రంలో 10% జనాభా ఉన్న ముదిరాజ్‌లకు KCR ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. వారిని బీసీ-D నుంచి బీసీ-A గ్రూప్‌లోకి మార్చేందుకు ప్రయత్నిస్తాం. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడుతాం. 15 MP సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా’ అని ప్రకటించారు.
AP: జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై రేపు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తమకే ఆ సింబల్ దక్కుతుందని జనసేన ధీమాగా ఉంది.
TG: రాష్ట్రంలోని లా కాలేజీల్లో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ ఎల్‌సెట్ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితోనే గడువు ముగియగా, అభ్యర్థుల వినతి మేరకు మరో 10 రోజులు ఛాన్స్ ఇచ్చారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అప్లై చేసుకోవచ్చు. మూడు, ఐదేళ్ల LLB, రెండేళ్ల LLM కోర్సుల కోసం జూన్ 3న ప్రవేశ పరీక్ష జరగనుంది.
చినస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ విజృంభించారు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మొత్తం 7 సిక్సులు, 4 ఫోర్లతో 69 పరుగులు చేశారు. 273 స్ట్రైక్ రేట్‌తో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం SRH స్కోర్ 6.3 ఓవర్లలో 89గా ఉంది.
AP: పార్వతీపురం మన్యం(D) కురుపాం MLA అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ అడ్డాకుల గీతారాణిని భారత్ ఆదివాసీ పార్టీ నిలబెట్టింది. జియ్యమ్మవలస(M) గొర్లి గ్రామానికి చెందిన గీతా.. BA చదివారు. జిల్లా ట్రాన్స్‌జెండర్స్ గిరి నేస్తం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆదివాసీల అభ్యున్నతి, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని గీతా తెలిపారు. ఇక్కడ YCP నుంచి మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి, TDP తరఫున జగదీశ్వరి పోటీలో ఉన్నారు.
AP: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్న TDP, YCP అధినేతలు చంద్రబాబు, జగన్‌ల కోసం వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు. నేతల ఇలాకాల్లో ప్రచార బాధ్యతల్ని భుజస్కందాలపై వేసుకుంటున్నారు. YS భారతి ఎన్నికలు పూర్తయ్యే వరకు పులివెందులలోనే ఉండనున్నారు. ఇటు CBN సతీమణి కుప్పంలో, నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటిస్తున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురంలో ప్రజలతో మమేకమవుతున్నారు.
Sorry, no posts matched your criteria.