News April 15, 2024

బంగారం ధర భారీగా పెరగడానికి కారణాలివే!

image

✒ ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ నిల్వలను అమ్మేసి ముడిచమురు లాంటి అవసరాలను తీర్చుకున్నాయి. ఇప్పుడు అవి మళ్లీ పసిడిని కొంటుండటంతో ధరలు పెరుగుతున్నాయి.
✒ ఈ ఏడాది 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
✒ ఈ కారణాల వల్ల 24 క్యారెట్ల 10 గ్రాముల <<13056460>>ధర<<>> రూ.లక్షకు చేరొచ్చని నిపుణుల అంచనా.

News April 15, 2024

ఏడు దశాబ్దాల్లో ముగ్గురే మహిళా ఎంపీలు!

image

ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు నెలవైన ఉత్తరాఖండ్‌లో మహిళా MPల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు అక్కడ ముగ్గురంటే ముగ్గురే మహిళలు MPలుగా గెలిచారు. 1952లో ఉమ్మడి రాష్ట్రంలో తెహ్రీ నుంచి కమలేందు మతి షా ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. మళ్లీ ఇంకొక మహిళ MPగా గెలిచేందుకు 46 ఏళ్లు పట్టింది. 1998లో ఇలా పంత్(నైనిటాల్) నెగ్గారు. 2012లో రాజ్యలక్ష్మి షా MP స్థాయికి చేరుకోగలిగారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 15, 2024

అందుకే నాకు పెద్ద గాయం కాలేదు: CM

image

AP: ‘నా నుదుటిపై వారు చేసిన గాయం పది రోజుల్లో తగ్గిపోతుంది. కానీ పేదలకు చంద్రబాబు చేసిన గాయాలు ఎన్నటికీ తగ్గవు’ అని సీఎం జగన్ అన్నారు. దేవుడి దయతో రాయి కంటికి, తలకు తగల్లేదని చెప్పారు. దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడని, అందుకే తనకు పెద్ద గాయం కాలేదని తెలిపారు. తనపై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోందని, కుట్రలు చేస్తున్నారని జగన్ ఫైరయ్యారు.

News April 15, 2024

అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్

image

AP: ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పును హైదరాబాద్ సీబీఐ కోర్టు రిజర్వ్ చేసింది. సాక్షులను బెదిరిస్తున్నారని అవినాశ్ బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు ముగియగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.

News April 15, 2024

బాబుని నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్లే: జగన్

image

AP: వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని CM జగన్ ఆరోపించారు. హోదా ఏమైనా సంజీవనా? అని బాబు అన్నారని గుర్తుచేశారు. ‘పిల్లనిచ్చిన మామపై చెప్పులు వేయించి NTR చావుకు కారణమయ్యాడు. అవసరమైనప్పుడు NTR ఫొటో బయటకు తీస్తాడు. దొంగ వాగ్దానాలు చేయడమే ఈ పెద్దమనిషికి తెలుసు. బాబును నమ్మడమంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలాగా పెట్టడమే. పులి నోట్లో తల పెట్టినట్లే’ అని మండిపడ్డారు.

News April 15, 2024

వేలంలో రోహిత్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తా: జింటా

image

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తే తాము కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పంజాబ్ ఓనర్ ప్రీతీ జింటా తెలిపారు. ‘మా టీమ్‌కు స్థిరత్వం, ఛాంపియన్ మైండ్‌సెట్ ఉన్న కెప్టెన్ అవసరం. అవన్నీ హిట్‌మ్యాన్ వద్ద ఉన్నాయి. ఐపీఎల్ 2025 వేలంలోకి అతడు వస్తే ఎంత మొత్తమైనా ఖర్చు చేసి కొనుగోలు చేస్తాం’ అని ఓ ఇంటర్వ్యూలో జింటా చెప్పారు.

News April 15, 2024

దాడి చేసే ముందు హెచ్చరించాం: ఇరాన్

image

ఇజ్రాయెల్‌పై దాడి చేసే ముందు తాము హెచ్చరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేన్ తాజాగా అమెరికాకు తెలిపారు. ఇరుగుపొరుగు దేశాలతో పాటు అమెరికాకు కూడా 72 గంటల ముందే నోటీసులు ఇచ్చామన్నారు. తమ ఎంబసీపై దాడికి ప్రతీకారంగా మాత్రమే దాడి ఉంటుందని, ఆ పరిధి దాటమని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికా ఈ ప్రకటనను ఖండించింది. ఇరాన్‌తో టచ్‌లోనే ఉన్నప్పటికీ వారు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసింది.

News April 15, 2024

మీ బిడ్డ అదరడు.. బెదరడు: సీఎం జగన్

image

AP: పేదల భవిష్యత్తు, పథకాల కొనసాగింపు కోసం వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ కోరారు. గుడివాడ సభలో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వానికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు కుట్రదారులు చుట్టుముట్టారు. కుటిల పద్మవ్యూహంలో నాపై వీరంతా దాడి చేస్తున్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. కృష్ణుడనే ప్రజలు నాకు అండగా ఉన్నారు. మన విజయం తథ్యం’ అని చెప్పుకొచ్చారు.

News April 15, 2024

ప్రాణం పోయినా మాట తప్పకూడదు: పీఎం మోదీ

image

నేతలు ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పకూడదని ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘నేటి రాజకీయ నేతల విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతోంది. మన సంస్కృతిలోని ‘ప్రాణం పోయినా మాట తప్పకూడదు’ అన్న నీతిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేతలు వారు ఇచ్చిన హామీ పట్ల బాధ్యత తీసుకోవాలి. నిలబెట్టుకోవాలి. మేం మాటిస్తే పాటిస్తాం. 370వ అధికరణ రద్దే మా నిబద్ధతకు నిదర్శనం’ అని మోదీ స్పష్టం చేశారు.

News April 15, 2024

పేదల బాగు కోసమే నా తపన: చంద్రబాబు

image

AP: జగన్ వచ్చాక SCలు, STలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. రాజాం సభలో మాట్లాడుతూ.. ‘YCP నేతలు నాపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు రాళ్ల దాడి కూడా చేస్తున్నారు. రాజకీయాల్లో లేని నా భార్య భువనేశ్వరిని అనేక మాటలన్నారు. నేను అరెస్టయ్యాననే బెంగతో 203 మంది ప్రాణాలు వదిలారు. ఆ కార్యకర్తల కుటుంబసభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు. ఎన్ని జరిగినా పేదల బాగు కోసమే నా తపన’ అని పేర్కొన్నారు.